Naiini Narsinhareddy
-
ఖర్చంతా పార్టీదే: నాయిని
మహేశ్వరం: ప్రగతి నివేదన బహిరంగ సభకు అధికార దుర్వినియోగం ఎక్కడా చేయ లేదని, అన్ని ఖర్చులను పార్టీ యే భరిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన బహిరంగ సభ వేదిక వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలతో కలసి ఆయన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రగతి నివేదన బహిరంగసభ కోసం ఒక్క అధికారినీ వినియోగించుకోలేదని, సభఖర్చును మొత్తం పార్టీనే భరి స్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సభకు ముందస్తు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. డబ్బులు పంపిణీ చేసే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలతో దొరికి జైలుకూడు తిన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే తమకంటే పెద్ద సభ నిర్వహించాలని సవాల్ విసిరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు సభ అనంతరం భూమిని శుభ్రం చేస్తామని తెలిపారు. ఐపీఎస్‌లకు ‘ప్రగతి నివేదన’ బాధ్యతలు 10 మంది ఇన్చార్జీల నియామకం సాక్షి, హైదరాబాద్: ‘ప్రగతి నివేదన సభ’ బాధ్యతలను కొందరు ఐపీఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అప్ప గించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న వాహనాలను నియంత్రించడం, ప్రజలను లోపలికి అనుమతించడం, వారిని సమన్వయం చేయడంతోపాటు సభావేదికకు ఇన్‌చార్జీలుగా ఐపీఎస్‌లను నియమిస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రగతి నివేదన సభ కోఆర్డినేటర్‌గా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. సభ ఇన్చార్జిగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సెక్యూరిటీ ఇన్చార్జిగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ ఇన్‌చార్జీలుగా అడిషనల్ సీపీ అనిల్ కుమార్, నల్లగొండ ఎస్పీ రంగనాథ్, సీఎం సెక్యూరిటీ, రూట్ క్లియరెన్స్ ఇన్చార్జిగా ఎస్పీ కోటిరెడ్డి, సభకు వచ్చేవారిని లోనికి అనుమతించే బాధ్యత వరంగల్ సీపీ రవీందర్, సభకు వచ్చేవారిని సమన్వయపరిచే బాధ్యతలను డీసీపీ జానకీ షర్మిల, ఎస్పీ శశిధర్రాజులకు అప్పజెప్పారు. సభావేదిక ఇన్చార్జిగా విక్రమ్‌జీత్ దుగ్గల్‌ను నియమించారు. -
రేపు రెడ్డి హాస్టల్‌కు సీఎం శంకుస్థాపన
స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, పట్నం హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతంలో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి ఈ నెల 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. 10 ఎకరాల స్థలంలో చేపట్టే హాస్టల్ భవన నిర్మాణానికి సీఎం ఇటీవల 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, చింతల రామచంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. 30 శాతం ఇతర కులాల విద్యార్థులకు హాస్టల్లో వసతి కల్పిస్తామని మంత్రులు తెలిపారు. కేసీఆర్ రాక నేపథ్యంలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది బుద్వేల్ స్థలాన్ని పరిశీలించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్, కూంబింగ్ టీంలు పరిసరాలను జల్లెడ పట్టాయి. శంకుస్థాపన స్థలం వద్ద ప్రత్యేకంగా మూడు క్యాంపులను ఏర్పాటు చేశారు. శతాబ్ది ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ నారాయణగూడలోని రెడ్డి బాలికల హాస్టల్లో హాస్టల్ శతాబ్ది ఉత్సవాల ఆహ్వానపత్రిక, బ్రోచర్‌ను ఆదివారం ఇక్కడ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎడ్ల రఘుపతిరెడ్డి ఆవిష్కరించారు. జయంతి వేడుకలను సీఎం ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. వెంకటరామారెడ్డి స్వగ్రామం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయంపేటను దత్తతకు తీసుకుని రూ.2.30 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్డి హాస్టల్ ఘనచరిత్ర ఇది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి, రావి నారా యణరెడ్డి, జస్టిస్ సీతారాంరెడ్డి, యూజీసీ చైర్మ న్గా పనిచేసిన జి.రామిరెడ్డి చదువుకునే రోజుల్లో ఈ హాస్టల్లో వసతి పొం దారు. వీరితోపాటు అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖ విద్యావేత్తలు ఈ హాస్టల్లో ఉండి తమ కెరీర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకున్నారు.