najma
-
Najma Parveen: మోదీపై పీహెచ్డీ
నరేంద్ర మోదీ గుజరాత్ సి.ఎం. అయ్యాక, ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పీహెచ్‌డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కాని వారిలో ముస్లిం స్కాలర్లు... అందునా మహిళా ముస్లిం స్కాలర్లు దాదాపుగా లేరు. ఆ విధంగా చూస్తే మోదీపై పీహెచ్డీ చేసిన మొదటి మహిళా స్కాలర్‌గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. చేనేత కుటుంబంలో పుట్టి నజ్మా పర్వీన్‌ది వారణాసి దాపున ఉన్న లల్లాపుర. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. కాని వారు ఆమె చిన్నప్పుడే మరణించారు. అయినా తన చదువుకు ఆటంకం కలిగించకుండా కొనసాగించింది పర్వీన్. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బి.హెచ్.యు.)లో పొలిటికల్ సైన్స్ చదివి 2014లో పీహెచ్డీ సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం ‘నరేంద్రమోడీస్ పొలిటికల్ లీడర్షిప్: యాన్ అనలిటికల్ స్టడీ’. నజ్మా పర్వీన్ తన పీహెచ్‌డీకి ఈ అంశం తీసుకున్నాక ‘నాక్కూడా భవిష్యత్తులో రాజకీయ నేత కావాలని ఉంది. అందుకే నేను భారతీయ ఆవామ్ ΄ార్టీనీ స్థాపించాను కూడా. ఆ ΄ార్టీని ఎలా రూపుదిద్దాలి అనుకున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద దృష్టి మళ్లింది. ఆయన రాజకీయాలలో ధ్రువతార వంటి వారు. 2014 నుంచి దేశంలో ఆయన సమర్థ నాయకత్వం కొనసాగింది. ట్రిపుల్ తలాక్ మీద ఆయన తెచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ నేను మొదటగా శుభాకాంక్షలు తెలియచేశాను’ అని తెలిపింది నజ్మా. పేదరికంలో ఉన్న నజ్మా పర్వీన్ చదువుకు ‘విశాల్ భారత్ సంస్థాన్’ స్థాపించిన ప్రొఫెసర్ రాజీవ్ శ్రీవాస్తవ సహకరిస్తే బి.హెచ్.యు. ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ గైడ్‌గా వ్యవహరించారు. 8 ఏళ్ల సమయం తీసుకుని 20 హిందీ, 79 ఇంగ్లిష్ గ్రంథాలు అధ్యయనం చేసి నజ్మా ఈ పీహెచ్‌డీని పూర్తి చేసింది. -
హిజాబ్ ధరించి ఆటో నడుతుపుతున్న నజ్మా
ఓ యువకుడు యాచకుడి వేషంలో, కేజీల మొత్తంలో కరెన్సీ నాణేలను తీసుకుని ఐఫోన్ కొనడానికి వెళ్లిన వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.మంచి వయసు, ఓపిక ఉన్న వారే ఇలా చేస్తుంటే... ఓపిక లేకపోయినా సమాజంలో గౌరవంగా బతికేందుకు బురఖా వేసుకుని ఆటో నడుపుతోంది నజ్మా అన్సారీ. అయినా ఇతరుల ముందు చేయి చాచే కంటే.. కష్టపడడమే గౌరవం అనుకుంది. ‘గేర్లు మార్చేయండి చాలు గౌరవంగా బతకవచ్చు’ అని చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. నజ్మా అన్సారీ వయసు 45. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్ నగరంలోని కట్ఘర్లో ఆమె నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2010లో భర్త మరణించడంతో ఇంటి భారం ఆమె మీద పడింది. అప్పటిదాక గృహిణిగా ఉన్న నజ్మాకు తన కొడుకు, కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కాలేదు. భర్త నడిపిన టీషాపును అద్దె కట్టలేక వదిలేసింది. ఇంట్లోనే టీ తయారు చేసి విక్రయించింది. అలా పిల్లల అవసరాలు చూసుకుంటూ ఉండగానే భర్త ఇన్సురెన్స్ డబ్బులు రూ.4.35 లక్షలు వచ్చాయి. మూడు లక్షల రూపాయలతో 2015లో కూతురికి పెళ్లి చేసింది. ఆదాయం సరిపోక.. టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్న నజ్మాకు డబ్బులు సరిపోయేవి కావు. కూతురి పెళ్లి తరువాత ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భర్త ఇన్సురెన్స్ డబ్బుల్లో మిగిలిన మొత్తంతో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంది. ఇంటి పనులన్నీ పూర్తిచేసి ఆటో తోలుతూ సంపాదిస్తోంది. అర్ధరాత్రనే భయం లేదు నజ్మా మూడు షిప్టుల్లో ఆటో నడుపుతోంది. బురఖా ధరించి ఉదయం తొమ్మిదిగంటలకు ఆటో స్టార్ట్ చేస్తుంది. ఎండ వేడికి బురఖాలో ఎక్కువ సమయం ఉండలేక మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆటో నడుపుతోంది. మళ్లీ రాత్రి తొమ్మిది నుంచి రెండుగంటల వరకు విరామం లేకుండా నడుపుతుంది. ఇలా మూడు షిప్టుల్లో మొత్తం మీద రోజుకి ఐదు నుంచి ఆరు వందల వరకు సంపాదిస్తోంది. స్థానిక ట్రాఫిక్ పోలీసులు నజ్మా ధైర్యాన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే నజ్మాను చూసిన ఓ హిందూ మహిళ కూడా ఆటో నడపడం మొదలు పెట్టింది. దీంతో ఆ మహిళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడ్డాయి. ఇలా ఇతరులకు స్ఫూర్తి నిలుస్తూనే, తన కష్టార్జితంతో హజ్ యాత్రకు వెళ్తానని చెబుతోంది నజ్మ. అడుక్కునే కంటే... ‘‘పేదరికం ఉందని అక్కడా ఇక్కడా చేయి చాచకుండా కష్టపడి ఏ పనైనా చేసి గౌరవంగా బతకవచ్చు. ఆటో గేర్లు మారుస్తూ, ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాను. ఇక మహిళా డ్రైవర్‌గా నాకు రాత్రి సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం వచ్చాక అర్ధరాత్రి బయటకు రావడానికి కూడా భయం వేయడం లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మాకు రక్షణ కల్పిస్తోంది. పరిస్థితులు మరింత దిగజారినప్పుడు అల్లా కాపాడతాడు’’ అని నజ్మా అన్సారీ ధైర్యంగా చెబుతోంది. -
స్పీడ్ స్కేటింగ్‌లో నజ్మా ప్రతిభ
ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం అరండల్‌పేట(గుంటూరు): స్పీడ్ స్కేటింగ్‌లో సిమ్స్ మై స్కూల్ విద్యార్థిని ఎం.డి.నజ్మా ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించినట్లు సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థిని అభినందన కార్యక్రమం సోమవారం పాఠశాలలో నిర్వహించారు. భరత్‌రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని తిరుపుర్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి యాంటి టెర్రరిజమ్, గ్లోబల్ వార్నింగ్ సదస్సు నిర్వహణ సందర్భంగా స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలకు సిమ్స్ విద్యార్థిని ఎం.డి.నజ్మా హాజరై వరల్డ్ రికార్డు సాధించిందని పేర్కొన్నారు. ఎం.డి.నజ్మా ఆరో∙తరగతి చదువుతుందని, చిన్ననాటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొని జాతీయస్థాయిలో నగరానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం గర్వకారణమన్నారు. సిమ్స్ సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష మాట్లాడుతూ స్కూల్ ప్రాంగణంలో అనుభవం కలిగిన శిక్షకులతో స్కేటింగ్ శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. డీన్.ఎల్.శ్రీనివాసరావు, స్కేటింగ్కోచ్ షేక్.సలాం తదితరులు పాల్గొన్నారు -
ఫలక్‌నూమాలో చిన్నారి అదృశ్యం
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారీ పాప తప్పిపోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.....కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాజిద్ ఈ నెల 18వ తేదీనా ఫలక్‌నుమాలోని జహనుమా ల్యాన్సర్ ప్రాంతానికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా వచ్చాడు. కాగా ఈ నెల 20వ తేదీనా ఉదయం 8 గంటలకు తన చిన్న కుమార్తె నజ్మా(2) బంధువుల చిన్నారులతో కలిసి తిను బండారాల కోసం స్థానికంగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మేరకు సాజిద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ చిన్నారీ ఆచూకీ తెలిసిన వారు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616512 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
-
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
మృతురాలి ప్రియుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు సాక్షి, విజయవాడ : విజయవాడలో జరిగిన పరు వు హత్య కేసులో మృతురాలు నజ్మా ప్రియుడు దీపక్‌ను, హత్య చేసిన తల్లి బీబీజానీని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేశారు. తన కుమార్తెను లైంగికంగా ఇబ్బందిపెట్టాడని, ఇద్దరూ తీయిం చుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికాకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని నజ్మా తండ్రి మైసూర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. దీపక్ కాల్‌డేటాను పరిశీలించి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన నజ్మా తల్లి బీబీజానీని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ సహేరా బేగం నిర్వహించిన విచారణలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. నజ్మా కుటుంబం మూడునెలలుగా వాంబే కాలనీలో ఉంటోంది. ఎంబీయే చదివి భార్య నుంచి విడాకులు తీసుకున్న దీపక్ అదే కాలనీలో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దీపక్ రెండు నెలలుగా నజ్మాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ వ్యవహారంపై మందలించినా నజ్మా వినకపోవడంతో తల్లి బీబీజాని ఆమెను చంపేసింది. మైనర్ కావటంతోనే పోక్సో చట్టం 17ఏళ్ల బాలిక నజ్మాను ప్రేమపేరుతో వేధించాడని, పరోక్షంగా ఆమె మరణానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్ట్ -2012 (పోక్సో చట్టం), కిడ్నాప్ తదితర కేసులను పోలీసులు దీపక్‌పై నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం ప్రకారం.. బాలిక ఇష్టపూర్వకంగా ప్రియుడితో బయటకు వెళ్లినా అతడిదే నేరం అవుతుంది. బాలికల్ని ప్రేమించటం నేరం. -
పరువు కోసం పేగుబంధాన్ని తెంచుకుంది!
ప్రేమలో పడిందని కూతుర్ని కడతేర్చిన తల్లి * విజయవాడలో దారుణం వీరులపాడు: పేగుబంధం విలువ.. నవమాసాలు మోసిన తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు. కానీ ఓ కన్నతల్లి పరువు కోసం కూతురి ఉసురు తీసింది. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న వ్యక్తి ప్రేమలో పడిందంటూ కుమార్తెను కడతేర్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మైసూర్ జానీకి 20 ఏళ్ల కిందట బీబీజానీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె నజ్మా(16) నగరంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమె వారు నివాసముంటున్న అపార్ట్మెంట్ పైఅంతస్తులో ఉండే దీపక్ అనే వివాహితుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో నజ్మాను మందలించింది. అయినా వినకపోవడంతో బుధవారం నిద్రపోతున్న కుమార్తెను హతమార్చింది. కాగా, నజ్మా మృతిపై దీపక్ ఫిర్యాదు చేయడంతో విజయవాడ నున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జుజ్జూరులో కూతురి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న తల్లిదండ్రులను విచారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అదేరోజు రాత్రి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు కూతురి అంత్యక్రియలు నిర్వహించారు. చెప్పినా వినలేదని.. బీబీజానీ గురువారం జుజ్జూరులో విలేకరులతో మాట్లాడింది. వివాహితుడైన దీపక్‌తో నజ్మా ప్రేమలో పడిందని తెలిసి మందలించానని చెప్పింది. తన కూతురి జీవితం నాశనం చేయొద్దని దీపక్‌ను వేడుకున్నానంది. కానీ అతను వినకపోగా నజ్మాతో తన పెళ్లి జరిపించాలని, లేకుంటే తామిద్దరం దిగిన ఫొటోలను నెట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నం దీపక్‌తో కలసి ద్విచక్రవాహనంపై వచ్చిన నజ్మాను మరోసారి మందలించగా తనను ఇష్టమొచ్చినట్లు తిట్టిందని చెప్పింది. కుటుంబ పరువు పోతుందన్నా వినలేదనే ఆక్రోశంతో నిద్రపోతున్న కూతురి మొహంపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు చెబుతూ కన్నీటిపర్యంతమైంది. కన్న కూతురిని కడతేర్చినట్లు బీబీ జానీ స్వయంగా ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
కన్నకూతురిని హతమార్చిన తల్లి
విజయవాడ: బెజవాడ వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే రక్తం పంచుకు పుట్టిన కూతురిని హతమార్చింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే పేగు బంధాన్ని మర్చిపోయింది. తన కుటుంబం పరువు పోతుందని భావించి... కన్న కూతుర్నే కడతేర్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించిన తల్లి పరువు పోతుందని కూతురి మొహంపై దిండుతో అదిమి హత్య చేసింది. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్లు చుట్టుపక్కలవారిని నమ్మించింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు మాట వినకపోవడంతో బీబీజాన్‌కు కోపం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం కూతురు కడుపు నొప్పితోనే చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. స్వస్థలం కంచికచర్లలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే చలాకీగా కనిపించిన యువతి ఆకస్మాత్తుగా చనిపోవడంపై ప్రియుడికి అనుమానం వచ్చింది. అతడు సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. నజ్మా మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపగా, నివేదికలో హత్యగా తేలింది. దీంతో బీబీజాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.