Nandalal
-
ప్రాజెక్టుల ఘనత వైఎస్‌దే
‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఆయన చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు లష్కర్‌లా గేట్లు ఎత్తుతూ తానే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం దగాకోరుతనానికి నిదర్శనం. ఈ విషయంలో టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవ’ని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. మంగళవారం శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1,200 మంది మహిళలతో గంగమ్మకు బోనాలు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ నేతలు మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముందుగా వారికి వారు శుద్ధి చేసుకోవాలని హితవు చెప్పారు. వారికి దమ్మూ ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున గొలుపొందాలని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ఆత్మకూరు: కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలను ఆదుకునే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్ఘాటించారు. మంగళవారం ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తి పోతల పథకం దగ్గర నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గంగాహారతి కార్యక్రమం పండుగలా సాగింది. గంగమ్మకు పూజలు చేసి.. మహానేతను మనసారా స్మరించుకుంటూ.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన అధికార పార్టీ పాలకులను తూర్పారబట్టారు. తరలివచ్చిన నేతలు వైఎస్ఆర్ గంగా హారతి కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సిద్ధాపురం చెరువు ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్చార్జీలు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మురళీకృష్ణా, నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, శిల్పా కార్తీక్‌రెడ్డి, డాక్టర్ మధు సూదన్, ప్రదీప్‌రెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉదయభాస్కర్, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, నాగరాజుయాదవ్, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పోలూరు భాస్కరరెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, ఆయుష్మాన్ హాస్పిటల్ అధినేత సంజీవరావు, కరుణాకరరెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, జాకీర్, హబీబుల్లా, ఇషాక్, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పలుచని బాలిరెడ్డి, ధనుంజయాచారి, డీకే రాజశేఖర్ పాల్గొన్నారు. -
లోక కళ్యాణం
ఆరోజు కాలేజీ లైబ్రరీలో గాంధీజీ ఆత్మ కథలో నుంచి కొన్ని పేజీలు చదివాడు నందలాల్. అవి పేజీల్లా అనిపించలేదు అతనికి. మనసును విశాలం చేసే వెలుగు కిరణాల్లా తోచాయి. మరుసటి రోజు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేశాడు, నచ్చిన వాక్యాలను డైరీలో నోటు చేసుకున్నాడు. ఇక ఆ రాత్రంతా ఏవేవో ఆలోచనలు! ‘‘ఇతరుల సేవలోనే నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోగలుగు తావు’’... గాంధీజీ మాటల్ని పదేపదే మననం చేసుకున్నాడు. వారణాసిలోని రాజ్తలాబ్ గ్రామంలో చేనేత కార్మికుల ఇంట్లో పుట్టాడు నందలాల్. కుటుంబ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే. తండ్రి చనిపోవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో బేనిపూర్‌లోని పెద్దక్క ఇంట్లో ఉండి కాలేజీ చదువు పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తికాగానే స్వగ్రామానికి వచ్చాడు. ‘‘పట్నంలో ఏదైనా ఉద్యోగం చూసుకోక... ఇక్కడికి వచ్చి ఏంచేస్తావు?’’ అన్నారు చుట్టాలు పక్కాలు. ‘‘నేత పని’’ అని టక్కున జావాబిచ్చాడు నంద. విన్నవాళ్లు ఎగతాళిగా నవ్వారు. ఆ నవ్వులకు నందలాల్ నొచ్చుకోలేదు. తన ఇద్దరన్నలతో పాటు చేనేత పని చేయడం మొదలుపెట్టాడు. పేదరికం కారణంగా బడికి వెళ్లని పిల్లల కోసం సాయంత్ర పాఠశాలను ప్రారంభించాడు. ప్రతిరోజూ ఇల్లిల్లూ తిరిగి పిల్లలను స్కూలుకు తీసుకువచ్చేవాడు నంద. పిల్లలకు నచ్చేలా పాఠాలు చెప్పేవాడు. దీంతో బడిలో పిల్లల సంఖ్య పెరుగుతూ పోయింది. నందను ప్రేరణగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల యువకులు పేదపిల్లలకు, బడికి రెగ్యులర్‌గా వెళ్లని పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభిం చారు. నంద దగ్గరికి వచ్చి వివిధ విషయాల్లో సలహాలు తీసుకునేవారు. వాళ్లందరితో ఒక బృందాన్ని తయారు చేశాడు నంద. అందరూ కలిసి ‘లోక్ సమితి’ అనే పేరుతో రాజ్తలబ్ కేంద్రంగా ఒక స్వచ్ఛంద సంస్థను, దీనికి అనుబంధంగా ‘కళా మంచ్’ పేరుతో ఒక కళామండలిని స్థాపించారు. పాటలు, వీధినాటికలు మొదలైన కళారూపాలతో వివిధ సామాజిక సమస్యలపై గ్రామాలను చైతన్యవంతం చేసేది ‘కళా మంచ్’. జాతీయ స్థాయిలో సామాజిక సమస్యలపై ఉద్యమాలు చేసే ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్’కు స్టేట్ కన్వీనర్‌గా పనిచేయడం వల్ల తన కార్యక్షేత్రాన్ని మరింత విస్తృతపరుచుకునే అవకాశం నందకు దొరికింది. రకరకాల ఉద్యమాల స్వరూప స్వభావాలు, భావజాలలలో నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రారంభించాడు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు అడ్డుకో వడం, స్త్రీసాధికారత, స్వయం సహాయక బృందాలు... ఒకటీ రెండూ కాదు, అనేక మంచి పనులు చేస్తోంది లోక్ సమితి. వరకట్నం ఇచ్చుకోలేక పెళ్లికాని అమ్మాయిలను చూస్తే నందకు బాధగా అనిపించేది. దాంతో ‘లోక్ సమితి’ తరపున మొదటిసారి 13 పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించాడు. అలా నేటి వరకు 700 మంది వివాహాలు జరిగాయి. కట్నం తీసుకోవద్దంటూ మగ పిల్లలకు బోధిస్తున్నాడు. పెళ్లి పేరుతో డబ్బు వేస్ట్ చేయొద్దని, ఆ డబ్బుల్ని మిగిల్చి తనకు ఇస్తే కొందరు ఆడపిల్లల జీవితాలను నిలబెడతానని అవగాహనా సదస్సులు పెట్టి మరీ చెబుతున్నాడు. దాంతో ఎందరో ధనవంతులు తమ కుటుంబాల్లో వివాహవేడుకల ఖర్చులను తగ్గించుకొని ఆ మొత్తాన్ని పేదల పెళ్లిళ్లకు ఇస్తున్నారు. తాను చేస్తున్న మంచి పనుల గురించి ప్రస్తావించినప్పుడు ‘‘ఇది తొలి అడుగు మాత్రమే’’ అంటాడు నందలాల్ తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఉద్దేశించి!