నందమూరి జయకృష్ణకు జైలు శిక్ష
- ఆరు నెలల జైలు, రూ.25 లక్షల జరిమాన విధింపు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానాను విధించారు. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.
అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్, పార్కింగ్ లీజుకు సంబంధించిన వివాదంలో నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న కోర్టు.. కఠిన శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబీకులు స్పందించాల్సిఉంది.