Nani alla
-
త్వరలో వైఎస్సార్ సీపీ మండల కమిటీలు
నాయకుల ఎంపిక కోసం నియోజకవర్గానికి ఇద్దరేసి కన్వీనర్ల నియామకం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని వెల్లడి ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి.. వారి తరఫున పోరాటాలు సాగించేందుకు త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలను నియమిస్తున్నట్టు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆళ్ల నాని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సూచనలకు అనుగుణంగా కమిటీల నియూమకం చేస్తామని తెలిపారు. శుక్రవారం తన నివాసంలో పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులతో నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎంతో అభిమానం ఉందని, దానిని కాపాడుకుంటూ జనహితం కోసమే పార్టీ పనిచేస్తుందనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే పార్టీ మండల కమిటీలు, అనుబంధ విభాగాల మండల కమిటీలను నియమించనున్నామన్నారు. ఇందుకోసం ఆయా మండలాల్లోని సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఇలా అన్ని వర్గాలకూ అనుకూల మైన, ఆమోద యోగ్యమైన వారి కి ఆయా కమిటీల్లో ప్రాతి నిధ్యం కల్పిస్తామన్నారు. కమిటీల నియూమకానికి సంబంధించి నాయకులు, కార్యకర్తల్లో ఏకాభిప్రాయం తీసుకురావడానికి నియోజకవర్గానికి ఇద్దరేసి కన్వీనర్లను నియమిస్తున్నామన్నారు. పోలవరం నియోజకవర్గానికి పోల్నాటి బుజ్జి, పాకనాటి తాతాజీ, చింతలపూడి నియోజకవర్గానికి చెలికాని రాజబాబు, కొవ్వాసి నారాయణరావు, గోపాలపురం నియోజకవర్గానికి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, లంకపల్లి డేవిడ్, కొవ్వూరుకు పోతుల రామతిరుపతిరెడ్డి, కారుమంచి రమేష్, నిడదవోలుకు ఆత్కూరి దొరయ్య, ముప్పిడి విజయరావు, ఉంగుటూరుకు బొద్దాని శ్రీనివాస్, లంకా మోహన్‌బాబు, దెందులూరుకు వందనపు సాయిబాలపద్మ, పటగర్ల రామ్మోహనరావు, భీమవరానికి నడపన సత్యనారాయణ, మాదేసు సురేష్‌కుమార్, ఉండికి పేరిచర్ల నరసింహరాజు, గూడూరి ఉమాబాల, ఆచంటకు కామన బాలసత్యనారాయణ, ఎండీ అస్లాం, నరసాపురానికి చెల్లెం ఆనంద ప్రకాష్, గుణ్ణం సుభాష్, పాలకొల్లుకు మేడపాటి చంద్రకాళిరెడ్డి, సాయినాథ్ ప్రసాద్, తాడేపల్లిగూడెంకు ఘంటా ప్రసాద్, కౌరు వెం కటేశ్వర్లు, తణుకుకు ముప్పిడి సంపత్‌కుమార్, హర్ష, ఏలూరుకు డాక్టర్ మల్లెల లక్ష్మీనర్సింహమూర్తి, కరాటం కృష్ణ స్వరూప్‌లను కన్వీనర్లుగా నియమించినట్లు వివరించారు. వీరంతా ఆయా అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, స్థానిక నాయకులు, కార్యకర్తల అబిప్రాయాలు తీసుకుంటారన్నారు. మం డల కమిటీల్లో స్థానం కోరుకుంటున్న ఆశావహుల పేర్లను తనకు తెలియజేస్తారన్నారు. వాటిని తాను రాష్ట్ర నాయకత్వానికి నివేదించి, పార్టీ కార్యాలయం అనుమతితో కమిటీలను ప్రకటిస్తామని చెప్పారు. -
వీవీ వినాయక్ కు ప్రముఖుల పరామర్శ
చాగల్లు : ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ తల్లి నాగరత్నం మృతి వారి కుటుం బానికి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. గురువారం చాగల్లు వచ్చిన అయన వీవీ వినాయక్‌ను కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వినాయక్ సొదరుడు మాజీ సర్పంచ్ సురేంద్రకుమార్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆత్కూరి దొరయ్య, మండల కన్వీనర్ బొర్రా కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బండి పట్టాభి రామారావు (అబ్బులు), పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు ముప్పిడి విజయరామ్, నాయకులు పరిమి శ్రీనివాస్, మైపాల రాంబాబు, చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, మట్టా వెంకట్రావు, ప్రగళ్లపాటి సుబ్బారావు, కొండేపాటి సూర్యనారాయణ వారి వెంట ఉన్నారు. ప్రముఖుల పరామర్శ : వీవీ వినాయక్‌ను పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు కలిసి సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కారుపాటి వివేకానంద, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, జిల్లా కాపునాడు నాయకులు గెడ్డం రాధాకృష్ణ, ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మహాలక్షు్ష్మడు, ఉప్పులూరి రామకృష్ణ, స్థానిక నాయకులు నాగరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మాయల మాంత్రికుడు చంద్రబాబు
నరసాపురం అర్బన్ : మాయల మాంత్రికుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి భంగపడిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు అండగా నిలబడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక తెలగా కల్యాణమండపంలో నిర్వహించిన పార్టీ నరసాపురం నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదని విమర్శించారు. రైతు రుణమాఫీకి చంద్రబాబు కేటాయిస్తానని చెబుతున్న రూ.5 వేల కోట్లు కనీసం వడ్డీ మాఫీకి కూడా సరిపోవన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అదికూడా పార్టీ కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకుల మనోభావాలకు అనుగుణంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు మోసాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. వచ్చేనెల 5న కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మహాధర్నా పోస్టర్‌ను ఆళ్ల నాని ఆవిష్కరించారు. పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేలా, ప్రభుత్వం మెడలు వంచే విధంగా ప్రభుత్వంపై పార్టీ కార్యకర్తలు కలసికట్టుగా పోరాడాలని సూచించారు. ప్రజాసంక్షేమం పట్టకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకే దొరకకుండా చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు చేస్తున్నారని, హైదరాబాద్‌లో ఉంటే టెలీకాన్ఫెరెన్స్తో కాలంవెళ్ల దీస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తప్పుడు విధానాలతో ఇసుక కొరతను సృష్టిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కిలో బియ్యం రేషన్‌లో రూపాయికి దొరుకుతుంటే, మరో వైపు కేజీ ఇసుక రూ.10కు కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. సభకు పార్టీ పట్టణ కన్వీనర్ నల్లిమిల్లి జోసఫ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో పార్టీ జిల్లా క్రమశిక్షణాసంఘం సభ్యుడు సాయినాథ్ ప్రసాద్, కొత్తపల్లి భుజంగరాయలు (నాని), పాలంకి ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లం ఆనందప్రకాష్, బీసీ సెల్ అధ్యక్షుడు గంటా ప్రసాద్, మహిళా విభాగం కన్వీనర్ వి.సాయిబాలపద్మ, ఏలూరు టౌన్ కన్వీనర్ శ్రీనివాస్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గూడూరి ఉమాబాల, మొగల్తూరు మండల కన్వీనర్ కర్రి ఏసు, బొక్కా రాధాకృష్ణ మాట్లాడారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో నరసాపురం నియోజకవర్గ పార్టీ తరఫున ఆళ్ల నానిని కొత్తపల్లి సోదరులు ఘనంగా సత్కరించారు. తొలుత ఆళ్ల నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వచ్చేనెల 5న నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.