త్వరలో వైఎస్సార్ సీపీ మండల కమిటీలు
నాయకుల ఎంపిక కోసం నియోజకవర్గానికి ఇద్దరేసి కన్వీనర్ల నియామకం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని వెల్లడి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి.. వారి తరఫున పోరాటాలు సాగించేందుకు త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలను నియమిస్తున్నట్టు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆళ్ల నాని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సూచనలకు అనుగుణంగా కమిటీల నియూమకం చేస్తామని తెలిపారు. శుక్రవారం తన నివాసంలో పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులతో నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎంతో అభిమానం ఉందని, దానిని కాపాడుకుంటూ జనహితం కోసమే పార్టీ పనిచేస్తుందనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే పార్టీ మండల కమిటీలు, అనుబంధ విభాగాల మండల కమిటీలను నియమించనున్నామన్నారు. ఇందుకోసం ఆయా మండలాల్లోని సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఇలా అన్ని వర్గాలకూ అనుకూల మైన, ఆమోద యోగ్యమైన వారి కి ఆయా కమిటీల్లో ప్రాతి నిధ్యం కల్పిస్తామన్నారు. కమిటీల నియూమకానికి సంబంధించి నాయకులు, కార్యకర్తల్లో ఏకాభిప్రాయం తీసుకురావడానికి నియోజకవర్గానికి ఇద్దరేసి కన్వీనర్లను నియమిస్తున్నామన్నారు.
పోలవరం నియోజకవర్గానికి పోల్నాటి బుజ్జి, పాకనాటి తాతాజీ, చింతలపూడి నియోజకవర్గానికి చెలికాని రాజబాబు, కొవ్వాసి నారాయణరావు, గోపాలపురం నియోజకవర్గానికి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, లంకపల్లి డేవిడ్, కొవ్వూరుకు పోతుల రామతిరుపతిరెడ్డి, కారుమంచి రమేష్, నిడదవోలుకు ఆత్కూరి దొరయ్య, ముప్పిడి విజయరావు, ఉంగుటూరుకు బొద్దాని శ్రీనివాస్, లంకా మోహన్‌బాబు, దెందులూరుకు వందనపు సాయిబాలపద్మ, పటగర్ల రామ్మోహనరావు, భీమవరానికి నడపన సత్యనారాయణ, మాదేసు సురేష్‌కుమార్, ఉండికి పేరిచర్ల నరసింహరాజు, గూడూరి ఉమాబాల, ఆచంటకు కామన బాలసత్యనారాయణ, ఎండీ అస్లాం, నరసాపురానికి చెల్లెం ఆనంద ప్రకాష్, గుణ్ణం సుభాష్, పాలకొల్లుకు మేడపాటి చంద్రకాళిరెడ్డి, సాయినాథ్ ప్రసాద్, తాడేపల్లిగూడెంకు ఘంటా ప్రసాద్, కౌరు వెం కటేశ్వర్లు, తణుకుకు ముప్పిడి సంపత్‌కుమార్, హర్ష, ఏలూరుకు డాక్టర్ మల్లెల లక్ష్మీనర్సింహమూర్తి, కరాటం కృష్ణ స్వరూప్‌లను కన్వీనర్లుగా నియమించినట్లు వివరించారు. వీరంతా ఆయా అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, స్థానిక నాయకులు, కార్యకర్తల అబిప్రాయాలు తీసుకుంటారన్నారు. మం డల కమిటీల్లో స్థానం కోరుకుంటున్న ఆశావహుల పేర్లను తనకు తెలియజేస్తారన్నారు. వాటిని తాను రాష్ట్ర నాయకత్వానికి నివేదించి, పార్టీ కార్యాలయం అనుమతితో కమిటీలను ప్రకటిస్తామని చెప్పారు.