Nannapaneni Rakakumari
-
నన్నపనేనిని తోసేసిన స్వామిగౌడ్
-
దీక్ష భగ్నాల్లో వివక్ష
నేతల దీక్షలను భగ్నం చేయడంలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం, టీడీపీ నేతలపై చూపిన అమితప్రేమ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గుంటూరులో శుక్రవారం అర్ధరాత్రి టీడీపీ దీక్షల శిబిరాన్ని భగ్నం చేస్తూ పోలీసులు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీమంత్రి శనక్కాయల అరుణను 108 అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను మాత్రం పోలీసు సుమో వాహనంలో బలవంతంగా ఎక్కించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఐదురోజులు నిరాహార దీక్ష చేసి బాగా నీరసపడిన విజయమ్మను అంబులెన్స్‌లో తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా పోలీసులకు రాకపోవడం.. ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తరలింపు తీరు అభ్యంతరకరం సాక్షి, న్యూఢిల్లీ: సమర దీక్ష చేస్తున్న విజయమ్మ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయమ్మ పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ‘దీక్షా ప్రాంగణానికి పోలీసులు భారీగా వచ్చారు. ఒక్క అంబులెన్సు లేదు. ఆసుపత్రిలో ఏర్పాట్లు చేయలేదు. వైద్యులు లేరు. పోలీస్ వాహనంలో విజయమ్మను తరలించి ఆసుపత్రిలో పైకి, కిందకు నడిపించడం ఎంతవరకు సబబు? ఓ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పట్ల ప్రవర్తించే తీరు ఇదా? ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని పేర్కొన్నారు. అప్రజాస్వామికం: జూపూడి సాక్షి, హైదరాబాద్: సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికమని, ఆమె పట్ల పాలకులు వ్యవహరించిన తీరు గర్హనీయమని పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ దీక్షను కనుక కొనసాగనిస్తే ప్రజలు తండోపతండాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ వెనుక కదులుతారన్న భయంతోనే కాంగ్రెస్ పాలకులు విచక్షణారహితంగా భగ్నం చేశారని ఆయన శనివారం అన్నారు. -
నేడో.. రేపో ఢిల్లీకి చంద్రబాబు!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేడో, రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఆదివారం ఉదయం, సాయంత్రం యనమల రామకృష్ణుడు, సీఎం రమేష్, సుజనా చౌదరి, అరవిందకుమార్‌గౌడ్, పెద్దిరెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులతో చర్చించారు. విభజన అంశంపై ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి అభిప్రాయ సేకరణ జరపనున్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా వెళ్లి ప్రధాని, రాష్ర్టపతిలను కలవాలని నిర్ణయించారు. సమావేశానంతరం యనమల, సీఎం రమేష్, పెద్దిరె డ్డి మీడి యాతో మాట్లాడుతూ.. పొత్తుల గురించి మోడీ తన అభిప్రాయాన్ని చెప్పారని, ఈ విషయమై సోమవారం మరోసారి చర్చిస్తామని తెలిపారు.