narasapuram mp
-
రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయండి: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని, అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
పది రోజుల్లో ఇసుక సమస్యకు పరిష్కారం : ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : గత ప్రభుత్వం ఎక్కడా లేని అప్పులు చేసి అంతా కన్ఫ్యూజ్ చేసి పెట్టారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. గురువారం పాలకోడేరు మండలం వేండ్రలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు వైఎస్సార్సీపీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వారం, పది రోజుల్లో ఇసుక కొరత లేదు అనే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం అసాధారణ నిర్ణయమని తెలిపారు. దేవాలయ కమిటీల్లో, మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల్లో 50 శాతం మహిళలకే ప్రకటించిన మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, ఉండి నియోజకవర్గ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ కౌరు శ్రీనివాస్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రబాబు, భూపతిరాజు, సత్యనారాయణరాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఇంతకీ ఆయన ఏ పార్టీ!
-
ఇంతకీ ఆయన ఏ పార్టీ!
ఏలూరు : ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి పట్టుమని నాలుగు నెలలు కూడా కాలేదు. మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.... నిన్నటి వరకూ బీజేపీలో ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు గురువారం నరసాపురం ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి తెలుగు దేశం తరపున, రెండోది బీజేపీ తరపున వేశారు. పొత్తుల వ్యూహాల్లో భాగంగా ఆయన ఇలా రెండు పార్టీల తరపున నామినేషన్లు వేసినా ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీకి రాజీనామా చేయలేదు... అలాగని తెలుగుదేశం పార్టీలోనూ చేరలేదు. అయినా రెండు పార్టీల తరపున ఎలా నామినేషన్ వేశారోనని ఆయన అనుచరులే అయోమయంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నదీ ఆయనకే తెలియదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న రఘురామ కృష్ణంరాజు చివరకు సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ఏపార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారని ఆయన పక్కనున్న వారే చెవులు కొరుక్కుంటున్నారు.