Narayanakhed election
-
టీఆర్ఎస్కు 60 వేల మెజారిటీ ఖాయం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జగదేవ్‌పూర్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ 60 వేల మెజార్టీతో విజయం సాధించనుందని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని కొండపోచమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. -
‘ఓటె’త్తిన ఖేడ్: 81.79 శాతం పోలింగ్
♦ 81.79 శాతం పోలింగ్ ♦ ప్రశాంతంగా ముగిసిన నారాయణఖేడ్ ఉప ఎన్నిక ♦ ఖేడ్ చరిత్రలో అత్యధిక ఓటింగ్ ♦ విధి నిర్వహణలో కానిస్టేబుల్‌కు రక్తపోటు.. మృతి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 81.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్‌రాస్ శనివారం ప్రకటించారు. నారాయణఖేడ్ చరిత్రలో అత్యధిక ఓటింగ్ ఇదే కావడం గమనార్హం. గత సాధారణ ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదైంది. వలస ఓటర్లు వెల్లువలా తరలిరావడంవల్లే ఓటింగ్ భారీగా పెరిగింద న్నది విశ్లేషకుల అంచనా. పోలింగ్ మొదట్లో కొంత మందకొడిగా సాగినా.. 10 గంటల తరువాత వేగం పుంజుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓటర్ల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 58.43 శాతం నమోదు కాగా, 3 గంటలకు 73.47 శాతానికి చేరింది. సాయంత్రం 5గంటలకు 81.79శాతం నమోదైంది. నియోజకవర్గంలోని 168 గ్రామాల్లో 1.89 లక్షల ఓట్లు ఉండగా, 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చే శారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో పొరపాట్లు దొర్లడంతో ఓట్లు గల్లంతయ్యాయి. నారాయణఖేడ్ మండలంలోని గౌరారం తండాలో ఎన్నికల సిబ్బందికి 2015నాటి ఓటరు లిస్టు, ఏజెంట్లకు 2016 ఓటరు లిస్టు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. ఇక్కడ 60 మంది ఓట్లు గల్లంతయ్యా యి. నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్‌పల్లిలో తమ ఓట్లు తీసేశారని 80మంది ఆం దోళనకు దిగారు. దాదాపు 15 గ్రామాల్లో ఈతరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. తొలి ఓటరుకు పువ్వుతో స్వాగతం నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ మోడల్ పోలింగ్ కేంద్రంలో సోనిబాయ్ ఓటుతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెకు అధికారులు గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతం పలికారు. మొత్తం 20 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి మహారెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి కల్హేర్ మండలం ఖానాపురంలో, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి మంగల్‌పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా కొండాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హీరాసింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ రక్తపోటు పెరగడంతో కిందపడిపోయారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందారు. హీరాసింగ్ పటాన్చెరు పోలీసు స్టేషన్లో పని చేస్తున్నట్లు డీఎస్పీ తిరపతన్న తెలిపారు. 16న కౌంటింగ్ నారాయణఖేడ్ మండలం జూకల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈవీఎంలు ఇక్కడకు చేరుకున్నాయి. వీటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి భారీ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్ వెల్లడించారు. వెల్లువలా వలస కూలీలు నియోజకవర్గంలో మొత్తం 1,88,839 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు 1.37 లక్షల మందికి మాత్రమే ఓటరు స్లిప్పులు అందించారు. మిగిలిన 51 వేల మంది ఓటర్ల ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వీరంతా వలస కూలీలని, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ రోజున వలస కూలీలు వెల్లువలా వచ్చారు. హైదరాబాద్, బీదర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. 51 వేల మందిలో 50 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అంచనా. -
‘ఖేడ్’లో బ్యాలెట్ పేపర్ వాడాలి
ఈసీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ అవసరమైతే పోలింగ్ తేదీని మార్చాలని వినతి సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ : నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీ, కాంగ్రెస్‌కు తగ్గిన ఓట్లు, స్థానికంగా ఉన్న పరిస్థితులపై చాలా అనుమానాలు వచ్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పలు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు, కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో పోలైన ఓట్లకన్నా టీఆర్ఎస్కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని, ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయని తెలిపారు. నారాయణఖేడ్‌లో అవసరమైతే పోలింగ్ తేదీని మార్చి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఉత్తమ్ ఈసీని కోరారు. ఈవీఎంల ట్యాంపరింగ్: సబిత, మర్రి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్పార్టీ ఈవీ ఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈవీఎంలలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టుగా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని కేంద్రాల్లో పోలైన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు అధికారపార్టీకి వచ్చినట్టుగా ఈవీఎంలు చూపించాయన్నారు. ఈసీకి లేఖ అందజేసిన నేతలు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో పాటు ఇతర అధికార ప్రతినిధులు సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖను అందజేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పథకం ప్రకారం ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని ఈ సందర్భంగా శ్రవణ్ విమర్శించారు. నోటా బటన్ గులాబీ రంగులో ఉండటంతో ఈ ఎన్నికల్లో నోటాను తొలగించారని, అందువల్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘా న్ని కోరామని ఆయన మీడియాకు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై న్యాయ పోరాటం చేస్తామని శ్రవణ్ చెప్పారు. ‘ఖేడ్’ ఉప ఎన్నికల్లో ఓటు నిర్ధారణ స్లిప్ ఇవ్వాలి: ఎల్. రమణ సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఈవీఎంలలో ఓటేశాక ఓటు నిర్ధారణ స్లిప్ ఇవ్వాలని, లేదా బ్యాలట్ పేపర్లను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు నిర్దారణ స్లిప్ ఇవ్వకుండా పోలింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఇలాంటి స్లిప్‌లు ఇవ్వగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ‘నోటా’ను కూడా తొలగించారని ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.