
టీఆర్‌ఎస్‌కు 60 వేల మెజారిటీ ఖాయం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
జగదేవ్‌పూర్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ 60 వేల మెజార్టీతో విజయం సాధించనుందని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని కొండపోచమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు.