Minister talasani srinivasyadav
-
విపత్తుల్ని ఎదుర్కొనే సత్తా ఉంది: తలసాని
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ముందెన్నడూ లేని విధంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి బీభత్సం సృష్టించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. దీనిని త్వరితంగా చక్కదిద్దడం ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ప్రభుత్వానికి ఉందని చాటి చెప్పామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన గాలివాన సహాయక చర్యలను జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేది కాదని... తమ ప్రభుత్వంలో వివిధ శాఖలు సమర్థవంతంగా, సమన్వయంతో వ్యవహరించాయని తలసాని చెప్పారు. విపత్తు సంభవించిన గంటన్నరలో దాదాపు 90 శాతం మేర పరిస్థితుల్ని చక్కదిద్దిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు కూడా కొంత సహనం చూపాలని, అందుబాటులోని వనరులను బట్టి కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల్లో ఆలస్యం కావొచ్చని పేర్కొన్నారు. సహాయక చర్యలపై సీఎం ఎప్పటికప్పుడు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారని చెప్పా రు. ఇక జడివాన బీభత్సం గురించి తెలియగానే తాను, డిప్యూటీ మేయర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించామని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తుందని వాతావరణ శాఖ నుంచి సాయంత్రం 4.58 నిమిషాలకు సమాచారం అందిందని, కొద్దిసేపటికే జడివాన మొదలైందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇక వర్షం, ఈదురుగాలుల వల్ల 84 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని... వారందరికీ అవసరమైన సహాయం అందిస్తున్నామని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. -
చిన్న సినిమాకు పెద్ద ప్రోత్సాహం
చిత్రపరిశ్రమ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం తీర్మానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సినిమా థియేటర్లలో రోజూ 5 ఆటలు ప్రదర్శించాలని, అందులో ఒక ఆటను చిన్న సినిమాకు కేటాయించాలని తీర్మానించింది. సాయంత్రం 4 గంటలకు ఈ చిన్న సినిమాను ప్రదర్శించాలని పేర్కొంది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. సినిమా షూటింగ్‌లకు అనుమతిచ్చే విషయంలో జరుగుతున్న తాత్సారాన్ని నివారించాలని, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయాలని సబ్‌కమిటీ తీర్మానించింది. షూటింగ్ కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)కు దరఖాస్తు చేసుకుంటే పోలీసు, టూరిజం, ఫారెస్టు, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్కియాలజీ తదితర శాఖలను సమన్వయ పరిచి 48 గంటల్లోపు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఎన్వోసీ కాలపరిమితి పెంపు చిన్న నిర్మాతలు కోరుతున్నట్టుగా లో బడ్జెట్ చిత్రాలకు 35 స్క్రీన్స్ నుంచి 50కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సినిమా థియేటర్ల యాజమాన్యాలు రోడ్లు భవనాల శాఖ, అగ్ని మాపక శాఖల నుంచి పొందే నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కాలపరిమితిని 3 సంవత్సరాల నుంచి ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరహాలో హైదరాబాద్‌లో నిర్మించ తలబెట్టిన ప్రపంచస్థాయి ఇన్స్టిట్యూట్కు స్థల సేకరణ, విధి విధానాల తయారీ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారికి అప్పగించారు. థియేటర్లు లేని మండల కేంద్రాల్లో 200 సీట్ల సామర్థ్యం గల మిని కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే అనుమతించాలని ఉప సంఘం నిర్ణయించింది. సినీ కార్మికుల ఇళ్ల కోసం చిత్రపురి కాలనీని ఆనుకొని ఉన్న తొమ్మిదెకరాల స్థలం కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. చిత్రపురి కాలనీలో రోడ్డు, ఆరోగ్యకేంద్రం, రేషన్‌షాపు, వైఫై సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ‘నంది’కి కొత్త పేరుపై కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ చలన చిత్రాలకు ఇచ్చే నంది అవార్డుల పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ‘నంది’కి బదులుగా ఏ పేరు పెట్టాలన్న అంశంపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమ చలన చిత్ర అవార్డులకు పేరు సూచించే బాధ్యతను అప్పగించాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. సమావేశంలో కేబినెట్ సబ్‌కమిటీ సభ్యులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే బాబుమోహన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అజయ్‌మిశ్రా, రాజీవ్ త్రివేది, నవీన్‌మిట్టల్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందనరావు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, దగ్గుబాటి సురేశ్‌బాబు, మురళీమోహన్, జి.ఆదిశే షగిరిరావు, శ్యాంప్రసాద్‌రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, రామ్మోహన్రావు, విజయేందర్‌రెడ్డి, కొమరం వెంకటేశ్ పాల్గొన్నారు. -
కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టాడు
♦ మాల-మాదిగలను విడగొట్టాడు ♦ ఏపీలో ఆ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ♦ జగన్‌ను విమర్శిస్తూ రెండేళ్లు పూర్తి చేయడం తప్ప సాధించింది లేదు ♦ ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబు. మాల-మాదిగలను విడగొట్టిండు. కాపులు-బీసీల మధ్య చిచ్చుపెట్టిండు. కాపులను మచ్చిక చేసుకుందామని కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. అది బూమరాంగ్ అవుతుంది. ఆయన మెడకే చుట్టుకుంటుంది. కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించావ్. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు..? ప్రత్యేక విమానం వేసుకుని దేశ దేశాలు తిరిగి వస్తున్నా.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి కూడా రాలేదు. ఈ రెండేళ్లూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ైవె .ఎస్. జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ కాలం వెళ్లదీయడం తప్ప సాధించిన అభివృద్ధి ఏముంది’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. ఆయన శనివారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కాపులకు ఇచ్చిన హామీలను రెండేళ్లుగా ఎందుకు నెరవేర్చలేదు..? వారు ఉద్యమబాట పట్టిన తర్వాతే బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఎక్కడ నుంచి తెస్తాడు. అందుకే ప్రజలు కూడా నమ్మడం లేదు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులేవీ రాలేదు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ చేసే ఆరోపణలకు, వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు. కేబినెట్ దృష్టంతా జగన్‌ను టార్గెట్ చేయడంపైనే... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడానికే చంద్రబాబు తన కేబినెట్ మొత్తాన్నీ వాడుకుంటున్నాడని, బీజేపీ నేతలనూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ‘అమరావతిని జగన్ ఒక్కడే కాదు.. ఇతర విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. అమరావతి పేరు పెట్టగానే దేశం అంతా ఉలిక్కి పడిందని చెప్పుకుంటున్నావ్. పక్కన ఉన్న తమిళనాడు వాళ్లకే అమరావతి గురించి తెలియదు. ఇటీవల సీమాంధ్రకు చెందిన ఓ మిత్రుడి ఫంక్షన్‌కు వెళ్లా.. అక్కడి ప్రజల్లో చంద్రబాబు పాలనపై విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. మీడియాలో వచ్చేది చూసి అంతా బాగుందని నమ్మొద్దని కూడా అన్నారు. అనుకూల మీడియాతో చంద్రబాబు మేనేజ్ చేసుకుంటున్నారని అక్కడి వారు అన్నారు’ అని తలసాని పేర్కొన్నారు. ‘రావెల కిశోర్ కొడుకు ఘటనకు జగన్‌కు ఏం సంబంధం..? ఆ కేసు జగన్ కుట్ర అంటే ఎలా..? భూమన కరుణాకర్‌రెడ్డి ముద్రగడతో ఫోన్లో మాట్లాడితే తుని విధ్వంసం జరిగిందంటారు..? ఆరోజు ఏం జరిగిందో అందరికీ తెలుసుగా, 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్బాలు పలికే చంద్రబాబు బడ్జెట్లో ఎందుకు అంత తక్కువ నిధులు కేటాయించారు? అరకొర నిధులతో పోలవరం ఎలా పూర్తి చేస్తావ్’ అని నిలదీశారు. సీట్ల కేటాయింపుపై రాద్ధాంతం ఎందుకు? ‘29 రాష్ట్రాలు ఉన్న దేశంలో 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ జాతీయ పార్టీ. అయితే టీడీపీ ఇప్పుడొక రాష్ట్రంలో లేకుండా పోయింది’ అని తలసాని అన్నారు. ‘అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై రాద్ధాంతం ఎందుకు? 1996లో ఎన్టీఆర్‌ను గద్దెదింపినప్పుడు ఎన్టీఆర్ టీడీపీ వాళ్లకు ఎలా సీట్లు కేటాయించారో... ఇప్పుడూ అలాగే. మాకు మార్గం వేసింది నువ్వే కదా..’ అని చంద్రబాబునాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
‘సినిమా’ చూపిస్తున్నారా?
కలెక్షన్లపై వాణిజ్యపన్నుల శాఖ కన్ను థియేటర్లలో రూ.కోట్లు వసూలవుతున్నా... వినోదపు పన్ను లక్షలు దాటట్లేదు టిక్కెట్ల అమ్మకాలకు ఆన్‌లైన్‌తో అనుసంధానం కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో స్పష్టత ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్: ఒక సినిమా వందల కోట్ల రూపాయల క్లబ్బుల్లో చేరినా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లిస్తున్న వినోదపు పన్ను రూ.లక్షలు దాటడం లేదు. థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రేక్షకుల సంఖ్యకు, శాఖకు చూపించే లెక్కలకు పొంతనే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వినోదపు పన్ను వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పెట్టింది. ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ వినోదపు పన్ను వసూళ్ల తీరును చూసి నివ్వెరపోయింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సినిమాల ద్వారా రాష్ట్రం నుంచి ఏటా వందల కోట్ల రూపాయలు వసూలవుతున్నా వినోదపు పన్ను రూ.80 కోట్లు దాటడం లేదు. థియేటర్లలో ప్రదర్శితమయ్యే తెలుగు సినిమాలపై 15 శాతం, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషా చిత్రాలపై 20 శాతం పన్ను వసూలు చే స్తారు. ఆన్లైన్ అనుసంధానంతో... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 532 సినిమా థియేటర్లలో సుమారు 3 లక్షల సీట్లకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు ఆన్లైన్ లింక్ చేయాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. తొలుత గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లు, త దుపరి మునిసిపాలిటీలు, గ్రామ స్థాయికి వె ళ్లాలని నిర్ణయించారు. గ్రామ పంచాయితీల్లో సినిమా టిక్కెట్లతో సంబంథం లేకుండా ఉన్న శ్లాబ్ పన్ను విధానాన్ని తొలగించి, టిక్కెట్ల అమ్మకాల ద్వారానే పన్ను వసూలు చేయనున్నారు. ఆన్లైన్ వెబ్సైట్ లు, థియేటర్లలో జరిగే టిక్కెట్ల అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వాణిజ్యపన్నుల శాఖలో రికార్డ్ అయ్యేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సమన్వయంతో థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాల వివరాలు శాఖకు చేరేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. సెట్‌టాప్ బాక్స్‌తో ఎగవేతలకు చెక్... రాష్ట్రంలో కేబుల్ కనెక్షన్ లేని ఇళ్లు 10 శాతం కూడా ఉండవని ఓ అంచనా. ప్రతి కేబుల్ ఆపరేటర్ వినోదపు పన్నును వేర్వేరు శ్లాబుల్లో చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీలోని కేబుల్ ఆపరేటర్ నెలకు రూ.100 నుంచి రూ. 200 వరకు చెల్లించాలి. ఇక ప్రతి కేబుల్ కనెక్షన్‌కు కార్పొరేషన్లో రూ.5, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలో రూ.4, మొదటి, రెండో గ్రేడ్ మునిసిపాలిటీల్లో రూ.3, ఇతర మునిసిపాలిటీల్లో రూ.2 చొప్పున పన్ను చెల్లించాలి. కానీ ఒక్కో ఆపరేటర్‌కు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయన్న విషయంలోనే స్పష్టత లేదు. కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్స్‌లు అనుసంధానం చేయడం వల్ల ఈ వివరాలు తెలుస్తాయి. హైదరాబాద్ పరిధిలో సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తికాగా, మిగతా చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. -
టీఆర్ఎస్కు 60 వేల మెజారిటీ ఖాయం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జగదేవ్‌పూర్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ 60 వేల మెజార్టీతో విజయం సాధించనుందని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని కొండపోచమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. -
ప్రదక్షిణలు చేసినా ఓట్లు పడవు
బాబు పై మంత్రి తలసాని ధ్వజం సుల్తాన్‌బజార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసుకోవాలని తెలంగాణా చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేసిన టీడీపీకి ఓట్లు పడవని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నా రు. శుక్రవారం గన్‌ఫౌండ్రి డివి జన్ పరిధి లో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని, గోషామహల్ నియోజకవర్గం లోని ఆరు డివిజన్ల లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమావ్యక్తం చేశా రు. గతం లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రజలకు చేసిం దేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్, మంచి నీటి బిల్లులు మాఫీ చే శారని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారన్నారు. గన్‌ఫౌండ్రి డివిజ న్ టీఆర్ఎస్ అభ్యర్ధి మమతాగుప్తాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అరిగాల నాగేశ్వరరావు, ప్రేమ్‌కుమార్‌ధూత్, మహేందర్‌కుమార్, దీలీప్ఘనాటే, రాంచందర్‌రాజు, శాంతి దేవి, శీలంసరస్వతి, సంతోష్‌గుప్తా, నందకిషోర్‌వ్యాస్, సురేష్, పడాల లలిత తదితరులు పాల్గొన్నారు. -
రూ. 3 కోట్లకు అమ్మిపెడతా... సిద్ధమా!
- ఆస్తుల వెల్లడిపై లోకేశ్‌ది బోగస్ సమాచారం: తలసాని ఆస్తుల వెల్లడిపై నారా లోకేశ్ అంతా బోగస్ సమాచారమిచ్చి తానేదో సత్యహరిశ్చంద్రుడిలా చెప్పుకుంటున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ‘‘జూబ్లీహిల్స్‌లో కోట్లు పలికే ఇంటి విలువను కేవలం రూ.24 లక్షలుగా లోకేశ్ పేర్కొనడం విడ్డూరం. దాన్ని రూ.3 కోట్లకు అమ్మిపెట్టిస్తా. అమ్మేందుకు సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి తలసాని మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏపీ సీఎం కుటుంబ ఆస్తుల వ్యవహారంలో ఆంధ్ర మీడియా హైప్‌ను సృష్టించిందని, చంద్రబాబు, ఆయన సన్నిహితులతో తనకు మంచి సంబంధాలు ఉండేవని, అందువల్ల ఆయన ఆస్తులు ఎలా సంపాదించారు, వాటి విలువ ఎంత అనేది బాగా తెలుసన్నారు. విజయవాడలో ఉండే పాలన చేసుకుంటేనే బాబు ఆరోగ్యానికి మంచిది అని తలసాని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీని నాలుగు రోజులే నిర్వహించారని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కారని, అందుకు భిన్నంగా తెలంగాణ అసెంబ్లీని వీలైనన్నీ ఎక్కువరోజులు నిర్వహించడంతో పాటు అన్ని విషయాలు మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇస్తామన్నారు. ఇంట్లో కూర్చున్నా గెలుస్తా...: సనత్‌నగర్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని తలసాని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరగవచ్చునని, ఈ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, వచ్చే మూడేళ్లలో జరిగే అభివృద్ధి చూసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పారు. ప్రాజెక్టులు రీ డిజైన్ చేశాక, వ్యవసాయానికి 9 గంటల సరఫరా చేసి సీఎం నీటి పారుదల వనరులను రైతులకు అందుబాటులోకి తెస్తారని, దీంతో ఆత్మహత్య లు తగ్గుతాయని అన్నారు. పొలిటికల్ కెరీర్ అనేది ఒక సైకిల్ వంటిదని, ఒక రాజకీయవేత్త ఒకచోట నుంచి మరోచోటకు మారవచ్చునన్నారు. తలసానితో కాంగ్రెస్ నేత దానం నాగేందర్ భేటీ కావడంపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు.