ప్రదక్షిణలు చేసినా ఓట్లు పడవు
బాబు పై మంత్రి తలసాని ధ్వజం
సుల్తాన్‌బజార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసుకోవాలని తెలంగాణా చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేసిన టీడీపీకి ఓట్లు పడవని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నా రు. శుక్రవారం గన్‌ఫౌండ్రి డివి జన్ పరిధి లో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
ప్రజలు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని, గోషామహల్ నియోజకవర్గం లోని ఆరు డివిజన్ల లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమావ్యక్తం చేశా రు. గతం లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రజలకు చేసిం దేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్, మంచి నీటి బిల్లులు మాఫీ చే శారని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారన్నారు. గన్‌ఫౌండ్రి డివిజ న్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి మమతాగుప్తాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అరిగాల నాగేశ్వరరావు, ప్రేమ్‌కుమార్‌ధూత్, మహేందర్‌కుమార్, దీలీప్‌ఘనాటే, రాంచందర్‌రాజు, శాంతి దేవి, శీలంసరస్వతి, సంతోష్‌గుప్తా, నందకిషోర్‌వ్యాస్, సురేష్, పడాల లలిత తదితరులు పాల్గొన్నారు.