Naresh reddy
-
ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..
కామారెడ్డి: ఉరి వేసుకుని ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం వెలుగు చూసింది. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరేష్ రెడ్డి (30) ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య వర్షిణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం సొంత ఇల్లు కట్టుకుని కామారెడ్డిలోని హౌసింగ్బెర్డు కాలనీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతడు జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి కొక్కానికి వైర్‌తో ఉరి వేసుకున్నాడు. యేడాదిగా అతడు కడుపునొప్పితో బాధ పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కడుపు నొప్పి తగ్గకపోవడంతోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సమస్యలు కావచ్చని మరికొందరు భావిస్తున్నారు. కడుపునొప్పి కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ నరేష్ తెలిపారు. నాడు కూతురు మృతి.. నేడు కొడుకు ఆత్మహత్య చెట్టంత ఎదిగిన కొడుకు ఉరేసుకుని చనిపోయాడని తెలిసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే అందరూ కంటతడిపెట్టారు. దేవుడు మాకెందుకీ శిక్ష విధించాడని రోధించారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఏలేటి నరేశ్‌రెడ్డి (30) బుధవారం రాత్రి కామారెడ్డిలోని ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. సొంతూళ్లో ఉంటున్న తల్లిదండ్రులు మహిపాల్‌రెడ్డి, రాధ కొడుకు మరణవార్త విని కుప్పకూలిపోయారు. వృద్ధాప్యంలో తమను సాకుతాడని కలలుగన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. 2005లో వారి కూతురు జయంతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కబడ్డీ క్రీడాకారిణి అయిన ఆమె జాతీయస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పెళ్లయిన కొంత కాలానికే ఆమె మృతి చెందింది. అప్పుడు ఎదిగిన కూతురు, ఇప్పుడు ఎదిగిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. అంత్యక్రియల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఏలేటి నరేష్‌రెడ్డి(37) మృతిచెందగా ఆయన అంత్యక్రియల్లో ఓఎస్డీ ఎస్పీ అన్యోన్య, ఆర్ఐలు, ఎస్సైలు, రాజంపేట పోలీసు సిబ్బంది గురువారం మధ్యాహ్నం బస్వన్నపల్లికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గోన్నారు. -
ఫోర్జరీ సంతకాలతో డబ్బు డ్రా చేసిన కేర్ టేకర్
పంజగుట్ట: ఓ ఉన్నతాధికారి వద్ద కేర్ టేకర్‌గా నమ్మకంగా ఉండే వ్యక్తి అతను మరణించిన అనంతరం కూడా చెక్కులపై ఫోర్జరీ సంతకాలు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నాడు. బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.నరేష్ రెడ్డి (28) వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే ఓ రిటైర్ ఉన్నతాధికారి ఎన్.వి. నాగేశ్వర్రావు వద్ద కేర్ టేకర్‌గా పనిచేసేవాడు. నాగేశ్వర్రావు గత ఏడాది అనారోగ్యంతో చనిపోయారు. నరేష్ రెడ్డి వద్ద నాగేశ్వర్రావుకు చెందిన వివిధ బ్యాంకుల చెక్కులు ఉన్నాయి. ఇటీవల వాటిపై సంతకం ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుంటున్నాడు. నాగేశ్వర్రావు పింఛను డబ్బు సోమాజిగూడలోని సిండికేట్ బ్యాంకులో ఉండడంతో అతని కొడుకు వెంకటేశ్వర్రావు గత నెల 29వ తేదీన తన తండ్రి అకౌంట్‌కు సంబంధించి స్టేట్మెంట్ తీసుకున్నారు. తండ్రి చనిపోయిన అనంతరం కూడా చెక్‌ద్వారా నగదు డ్రా చేసినట్లు అందులో ఉండడంతో బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 4వ తేదీన కూడా నరేష్ రెడ్డి మరో చెక్కుపై రూ.21,500 రాసుకుని ఫోర్జరీ సంతకంతో బ్యాంకుకు రాగా బ్యాంకువారు పట్టుకునేందుకు యత్నించారు. అక్కడ నుండి తప్పించుకోవడంతో సిండికేట్ బ్యాంకు ఛీఫ్ మేనేజర్ వీరారెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఫోర్జరీ చెక్కులతో మొత్తం 5 లక్షల 39 వేలు డ్రా చేశారని, నాగేశ్వర్రావు మృతి చెందిన రోజు కూడా 40 వేలు డ్రాచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ రెడ్డిని నాగే శ్వర్రావు సొంత కొడుకులా చూసుకునేవారని, అతనికి ఏదైనా చేయాలని తపించేవారని త్వరలో వారు ప్రారంభించే ఓ సంస్థలో వాటా ఇచ్చేందుకు కూడా సిద్ధ్దమయ్యారని ఆయన బందువులు తెలిపారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. -
'పోలీసులు అరేయ్..ఒరేయ్ అంటున్నారు'
-
'అధికారంలోకి వస్తాం..మీ భూముల్ని తిరిగి ఇప్పిస్తాం'
-
'అధికారంలోకి వస్తాం..మీ భూముల్ని తిరిగి ఇప్పిస్తాం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతుల బాధలు, సమస్యలు, వారిపై వేధింపులు.. వింటుంటే గుండె తరుక్కుపోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని...వారి తరపున పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. కాగా రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై ...రైతులు సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెలిబుచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోవటంలో తప్పులేదని, అయితే ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. రోడ్లు వేసి, జోనింగ్ చేసి వదిలేయాల్సిన ప్రభుత్వం..భూములు ఎందుకు లాక్కోవాలని చూస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన చేయాలే కానీ...రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని వైఎస్ జగన్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని, ఆ అధికారం ఉండేది నాలుగేళ్లే... ఇంకా ముందే పోవచ్చు అని వైఎస్ జగన్ అన్నారు. 'మీ అన్నా...తమ్ముడో, కొడుకో అధికారంలోకి వస్తాడు...తిరిగి మీ భూముల్ని మీకు ఇస్తాడ'ని పేర్కొన్నారు. బలవంతంగా భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే కోర్టులు ఉన్నాయని, అక్కడ సవాల్ చేద్దామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం రైతులతో కలిసి గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. వారి సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళతామన్నారు. -
'పోలీసులు అరేయ్..ఒరేయ్ అంటున్నారు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఒకటైన పెనుమాక గ్రామం ప్రస్తుతం కశ్మీర్‌లోని ఉద్రిక్తతను తలపిస్తోందని నరేష్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరు నరేష్ అని చెప్పగానే...పోలీసులు తన ఫోన్ నెంబర్ చెబుతుంటే ఆశ్చర్యపోవటం తనవంతైందన్నారు. పోలీస్స్టేషన్లకు తాము ఎందుకు వెళ్లాలని, పొలాలు పోతే తామేమీ తినాలి, ఎట్లా బతకాలని ఆయన ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై రాజధాని ప్రాంత గ్రామాల రైతులు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. గ్రామాల్లో పోలీసుల కవాతులు ఎందుకు?...మనశ్శాంతి కరువై, భయంభయంగా బతుకుతున్నామని మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. భూములు ఇవ్వకుంటే పట్టుకుపోతామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. మేమిస్తున్నాం... మీరెందుకు ఇవ్వరని టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని రైతులు తెలిపారు. పోలీసులు తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని , అరేయ్...ఒరేయ్ అని పిలుస్తూ వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరంతో పదిమంది బతుకుతున్నామని, ఉన్న ఎకరం తీసుకుంటే తమ పిల్లల భవిష్యత్ ఏంటని రైతులు ప్రశ్నించారు. భూములు ఇవ్వకుంటే కొట్టేట్టుగా ఉన్నారని, తమ అనుమతి లేకుండా భూములను గ్రీన్ బెల్ట్‌గా ఎలా ప్రకటిస్తారన్నారు. రూ.3 కోట్లు విలువైన భూములను రూ.కోటికి ఎవరైనా ఇస్తారా అన్నారు. తమ కోసం ఏదో చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని రైతులు మండిపడ్డారు.