Narra bhiksapati
-
సింగరేణి కార్మికులపై సర్కారు చిన్నచూపు
వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మెరుగైన ఆస్పత్రులు, డిపెండెంట్ ఉద్యోగుల అమలు, డిస్మిస్ కార్మికులకు అవకాశం, ఓపెన్‌కాస్ట్ గనుల నియంత్రణ తదితర వాటిపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఏటా ఒకనెల వేతనం మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు కార్మికులు చెలి ్లస్తున్నారని, వీరిని ఐటీ నుంచి మిన హారుుంచాలని డిమాండ్ చేశారు. -
రైతు ఆత్మహత్యల నివారణలో సర్కార్ విఫలం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి గజ్వేల్ : రైతు ఆత్మహత్యల నివారణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి విమర్శించారు. ఆదివారం ఆయన గజ్వేల్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన టీఆర్ఎస్ నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ వ్యాపంగా ఇప్పటివరకు మొత్తం 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా జిల్లాలో 150మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో తమ పార్టీ నాయకురాలు షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్ర చేపట్టనున్నారని తెలిపారు. అదేవిధంగా 23, 24, 25 తేదీల్లో కరీంనగర్ జిలాల్లో యాత్ర కొసాగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ సిద్ధిపేట నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్, గజ్వేల్ నాయకులు మెయొనొద్దీన్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.