రైతు ఆత్మహత్యల నివారణలో సర్కార్ విఫలం | Failure of government in farmer suicide prevention | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యల నివారణలో సర్కార్ విఫలం

Published Sun, Sep 13 2015 11:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రైతు ఆత్మహత్యల నివారణలో సర్కార్ విఫలం - Sakshi

రైతు ఆత్మహత్యల నివారణలో సర్కార్ విఫలం

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి
గజ్వేల్ :
రైతు ఆత్మహత్యల నివారణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి విమర్శించారు. ఆదివారం ఆయన గజ్వేల్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  తెలంగాణ వ్యాపంగా ఇప్పటివరకు మొత్తం 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా జిల్లాలో 150మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్‌ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  ఈనెల 21, 22 తేదీల్లో తమ పార్టీ  నాయకురాలు షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్ర చేపట్టనున్నారని తెలిపారు. అదేవిధంగా 23, 24, 25 తేదీల్లో కరీంనగర్ జిలాల్లో యాత్ర కొసాగుతుందన్నారు.  విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ సిద్ధిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి జగదీశ్వర్, గజ్వేల్ నాయకులు మెయొనొద్దీన్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement