బార్ కౌన్సిల్‌కు నిధులిచ్చింది వైఎస్ ఒక్కరే..
రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి
వేములవాడ: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బార్ కౌన్సిల్‌కు రూ.1.65కోట్లు మంజూరు చేశారని, రాష్ట్ర చరిత్రలోనే ఇది మర్చిపోలేనిదని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సివిల్ కోర్డు సొంత భవనం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సీఎం కేసీఆర్ సైతం బార్ కౌన్సిల్‌కు రూ.కోటి మంజూరు చేస్తానని ప్రకటించారని తెలిపారు.
సిరిసిల్లలో జిల్లా కోర్టు ఏర్పాటు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టులకు అవసరమైన పుస్తకాలను తన సొంత నిధులు వెచ్చించి అందజేస్తానని చెప్పారు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో పనిచేస్తేనే సమాజానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.