Nasheed
-
మరింత ముదురుతున్న సంక్షోభం
వాషింగ్టన్ : మాల్దీవుల అంతర్గత సంక్షోభం మరింత ముదురే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో ఐరాస విభాగం భద్రతా మండలి అత్యవసర భేటీని నిర్వహించింది. ఇప్పటిదాకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ.. మున్ముందు మాత్రం పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని భద్రతా మండలి సహాయక కార్యదర్శి జనెరల్ మిరోస్లేవ్ జెంకా వెల్లడించారు. ఇక మరోవైపు మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిపై ఐరాస ప్రధాన కార్యదర్శి జెనెరల్ అంటోనియో గుటెర్రెస్ స్పందించారు. తక్షణమే ఎమర్జెన్సీని ఎత్తివేయాలని ఆయన అధ్యక్షుడు యెమీన్ను కోరుతున్నారు. ప్రజాస్వామ్యంపై ఇది దాడి చేయటమేనని చెబుతున్న ఆంటోనియో.. పరిస్థితి మరింత క్లిష్టంగా మారకముందే త్వరపడాలని అంటున్నారు. ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ... మాల్దీవుల సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు చర్చించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘గురువారం వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం త్వరగా ముగియాలని ఇద్దరు కోరుకున్నారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. అఫ్ఘనిస్థాన్ యుద్ధం, రోహింగ్యా శరణార్థుల సమస్యలపై కూడా వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్-భారత ప్రధాని నరేంద్ర మోదీ సంక్షోభం ఎలా మొదలైంది... బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తిరిగి దేశానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రతిపక్షానికి చెందిన 9 మంది నేతలను వెంటనే విడుదల చేయాలని గతవారం మాల్దీవుల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. కానీ ఈ తీర్పును అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ ఖాతరు చేయలేదు. ప్రతిపక్ష నేతలను విడుదల చేసేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో వివాదం మొదలైంది. న్యాయస్థానం తీర్పుతో చివరకు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు దాపురించటంతో జడ్జిలనే అరెస్ట్ చేయించిన అధ్యక్షుడు అబ్దుల్లా.. తర్వాత అత్యవసర పరిస్థితిని విధించారు. భద్రతా సిబ్బంది నడుమ అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ -
సైన్యాన్ని పంపండి
-
సైన్యాన్ని పంపండి
కొలంబో/మాలే: తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేం దుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ సుప్రీంకోర్టు గత గురువారం తీర్పునివ్వడం.. దాన్ని పాటించేందుకు యమీన్ విముఖత చూపుతుండటం తెలిసిందే. సోమవారం యమీన్ మాల్దీవుల్లో అత్యవసర స్థితిని కూడా విధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నషీద్ స్పందిస్తూ.. ‘భారత్ తన రాయబారిని, సైన్యాన్ని మా దేశానికి పంపించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నాను. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదే. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమం. సంక్షోభానికి తెరదించాల్సిందిగా ప్రజలు ప్రపంచ దేశాలను.. ప్రత్యేకించి భారత్, అమెరికాలను కోరుతున్నారు’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ఇద్దరు జడ్జీల అరెస్టు: మాల్దీవుల్లో అత్యవసర స్థితిని విధించిన కొన్ని గంటలకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్, మరో జడ్జి అలీ హమీద్‌లను యమీన్ అరెస్ట్ చేయించారు. వారిపై ఏ అభియోగాలు మోపారు?, ఎలా విచారిస్తున్నారన్న విషయాలను బయటపెట్టలేదు. మరో మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ను కూడా గృహనిర్బంధంలో ఉంచారు. న్యాయమూర్తులు తనను పదవి నుంచి దించేయడానికి కుట్ర పన్నారని యమీన్ ఆరోపించారు. కలత చెందాం: మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారతంలోని ఓ కీలక వైమానిక స్థావరం వద్ద భారీ సంఖ్యలో సైనికులున్నట్లు సమాచారం. -
జీఎంఆర్‌కు అప్పగించేది లేదు..
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌కు పెద్ద షాక్. మాలె విమానాశ్రయాన్ని విదేశీ కంపెనీకిగానీ, తమ దేశానికి చెందిన కంపెనీకిగానీ అప్పగించేది లేదని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ స్పష్టం చేశారు. విమానాశ్రయ నిర్వహణ బాధ్యతను తమ ప్రభుత్వానికి చెందిన మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కంపెనీ చేపడుతుందని ఆయన వెల్లడించారు. దీంతో విమానాశ్రయ నిర్వహణ ప్రాజెక్టు తిరిగి తమకే వస్తుందని ఎదురు చూస్తున్న జీఎంఆర్‌కు పెద్ద ఎదురుదెబ ్బ తగిలినట్టయింది. ‘విమానాశ్రయ పూర్తి నిర్వహణ బాధ్యతలు మాల్దీవుల ప్రభుత్వానికి చాలా ముఖ్యమైంది. జీఎంఆర్కుగానీ భారత కంపెనీలకుగానీ మేము వ్యతిరేకం కాదు. వాణిజ్య, భద్రతాపరంగా ఈ విమానాశ్రయం మాకు అత్యంత ప్రాధాన్యమైంది’ అన్నారు. కొత్త ప్రాజెక్టు చూసుకోండి.. మాలె విమానాశ్రయ ప్రాజెక్టును జీఎంఆర్‌కు తిరిగి అప్పగించేది లేదని తేల్చి చెప్పిన యమీన్.. మాల్దీవుల్లో ఏదైనా కొత్త ప్రాజెక్టును చూసుకోవాలని జీఎంఆర్‌కు సూచించారు. విమానాశ్రయ ప్రాజెక్టు వివాదాన్ని కోర్టు వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాగా, మాలె విమానాశ్రయ ఆధునీకరణ, 25 ఏళ్లపాటు నిర్వహణ ప్రాజెక్టును 2010లో జీఎంఆర్ చేపట్టింది. ఒప్పందంలో లొసుగులు ఉన్నాయని ఆరోపిస్తూ కొత్తగా అధికారంలోకి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం 2012 నవంబర్‌లో కాంట్రాక్టును రద్దు చేసిన సంగతి తెలిసిందే.