National Bravery Awards
-
శెభాష్ జునియా! సాహస బాలికకు నేషనల్ బ్రేవరీ అవార్డు
సాక్షి, హైదరాబాద్ (అల్వాల్): ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించింది అల్వాల్కు చెందిన జునియా ఈవ్లిన్. బాలిక జునియా ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీడబ్యూ) సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని అందజేసింది. గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జునియా ఈవ్లిన్కు ఈ నెల 17న ఢిల్లీలో పురస్కారాన్ని అందజేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి భయందోళనకు గురికాకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, తమ్ముడిని కాపాడుకోవడంతోపాటు తోటివారిని రక్షించించి సాహస బాలల పురస్కారాన్ని అందుకుంది. వివరాలివీ... మచ్చబొల్లారంలో నివసించే జోసఫ్రాయ్, అభిజేర్ల కుమార్తె జునియా ఆవ్లిన్(14) అల్వాల్లోని సెయింట్ మైఖేల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2022 ఆగస్టు 15న జునియా తన తండ్రి, తమ్ముడితో కలిసి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో జునియా తలకు గాయమైంది. తండ్రి అపస్మారక స్థితికి చేరాడు. తమ్ముడు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సమయంలో జునియా ధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, సోదరుడికి సపర్యలు చేసి వారు స్పృహలోకి వచ్చేలా చేసింది. అనంతరం ఆటోలో ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించింది. మరో ప్రయాణికురాలు, ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించి సఫలం అయింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జునియా తలకు అయిన గాయానికి మూడు కుట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని జునియా ఈవ్లిన్కు అందజేసింది. తన కూతురి ధైర్య సాహసానికి గర్వపడుతున్నానని ఈ సందర్భంగా తండ్రి జోçసఫ్రాయ్ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
బ్రేవ్ గర్ల్.. ఇంకో అవార్డు ఇవ్వాల్సిందే
ఈ ఏడాది జనవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ‘నేషనల్ బ్రేవరీ అవార్డ్’ అందుకుంది జెన్ సదావర్తి. 2018 ఆగస్టులో ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ముందే హెచ్చరించడం ద్వారా పదిమంది ప్రాణాలను కాపాడగలిగింది సదావర్తి. అందుకు వచ్చిన అవార్డే అది. పన్నెండేళ్ల ఈ చిన్నారి ముంబైలోని ఒక స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. షేక్స్పియర్ పుస్తకాల సెట్ మొత్తాన్ని ఇప్పటికే చదివేసింది! ఈ చదవడం తనకు సంబంధించినది. సమాజం కోసం కూడా చాలా చేస్తోంది. ఈమధ్యే.. నిరసన ప్రదర్శనల్లోకి పిల్లల్ని వెంటపెట్టుకుని వెళ్లకూడదనే ఆదేశాలను జారీ చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్కూళ్లలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరింది. పెద్దయ్యాక లాయర్ అవ్వాలని లక్ష్యం. ఇంగ్లిష్, హిందీ చక్కగా మాట్లాడుతుంది. ఈ రెండు భాషలు చాలు.. సమాజం కోసం ఫైట్ చెయ్యడానికి. అయితే అవి అసలు భాషలే కాదని శివసేన కార్యకర్తలు ఆ అమ్మాయిని మహిళా దినోత్సవ ప్రసంగం నుంచి పక్కకు నెట్టేశారు. ‘‘హిందీలో, ఇంగ్లిష్లో కాదు.. అచ్చమైన మరాఠీలో మాట్లాడు’’ అన్నారు. అక్కడితో ఆగిపోలేదు. ‘‘నువ్వీ రాష్ట్రంలో ఉండాలంటే మరాఠీ నేర్చుకోవలసిందే’’ అని బెదిరించారు. బ్రేవరీ అవార్డు తీసుకున్న అమ్మాయి ఆ బెదిరింపులకు భయపడుతుందా! ప్రసంగాన్ని పూర్తి చేసి గానీ వేదిక దిగలేదు. -
సాహసబాలలకు జాతీయ పురస్కారాలు ప్రదానం
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సాహస బాలలకు ఆదివారం జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. 25 మంది చిన్నారులకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 2015 సంవత్సరానికిగానూ సాహస పురస్కారాలను అందజేశారు. ఇందులో 22 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. అవార్డులు అందుకున్న బాలలు, వారి తల్లిదండ్రులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.