రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు 18వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే నంద్యాల పట్టణానికి చెందిన యల్లశేషు (19), ఆయన తమ్ముడు చిన్నశేషు, చిన్నాన్న కొడుకు నాగరాజు పెళ్లి నిమిత్తం కర్నూలులో ఉన్న బంధువులకు పత్రికలు పంచి బైక్పై నంద్యాలకు బయలుదేరారు. మార్గమధ్యలో హెచ్.కొట్టాల బస్సు స్టేజి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ఎల్లశేషు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నశేషు గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవపరీక్షలు జరిపిస్తామని ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.