బాబు ఆదేశాల మేరకే బూటకపు ఎన్కౌంటర్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిటీ
చంద్రగిరి: ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు కూలీలను తీసుకొచ్చి కాల్చి చంపారని మానవ హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రెట్స్ (పీయూడీఆర్), పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ (పీయూసీఎల్), పీపుల్స్ రైట్స్ ఫర్ ప్రొటెక్షన్ కమిటీ(పీఆర్టీసీ), హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) తదితర జాతీయ సంఘాల సభ్యులు శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎక్కడో పట్టుకున్న కూలీలను తీవ్రంగా హింసించి అనంతరం అటవీప్రాంతంలోకి తీసుకువచ్చి కాల్చిపడేసి పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ కౌంటర్‌పై వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ ఈ కార్యక్రమంలో జాతీయ ప్రజా సంఘాల నేతలు శాంతన్, అజిత్, అజ్మన్, టాటా ఇన్స్టిట్యూట్ ఉద్యోగులు దామోదర్, సుకన్య, కన్నన్, రాష్ట్ర మానవహక్కుల ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, ప్రొఫెసర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ, తెలంగాణ సహాయ కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం నేత దుడ్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పీయూడీఆర్ కమిటీపై కేసు నమోదు
అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా అటవీప్రాంతంలోకి వెళ్లిన పీయూడీఆర్ కమిటీపై ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో జి. శ్రీనివాసులు తెలిపారు.
తమిళనాడులో ఆరని ‘ఎర్ర’ అగ్ని
చెన్నై, సాక్షి ప్రతినిధి: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాష్ర్టవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. శనివారం సైతం రాష్ట్రంలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాయి. మక్కల్ ఇలక్కియ కళగం, పురట్చి మానవర్ ఇలైజంర్ మున్నని, పుదియ జననాయక తొళిలాలర్ మున్నని, పెన్‌గళ్ విడుదలై మున్నని తదితర పార్టీలు శనివారం సెంట్రల్ స్టేషన్‌ను ముట్టడించాయి. తమిళగ మున్నేట్ర కాంగ్రెస్ కట్చి నేత అరుళ్దాస్ నాయకత్వంలో సుమారు 150 మంది ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్రాక్లబ్) ను ముట్టడించారు.
స్మగ్లర్లను కాపాడేందుకే కాల్పులు
నిందితుల్ని రక్షించేందుకే అమాయక తమిళ కూలీలను కాల్చి చంపారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. తిరుచ్చిరాపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై సీబీఐ దర్యాప్తు, న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పీయూసీఎల్, ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం, న్యాయవాదులు, ప్రజాస్వామ్య, మానవహక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీభవన్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.
దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ త్రిమూర్తులు
తిరుపతి: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు అధికారిగా తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్కౌంటర్ ప్రభావం తిరుమల శ్రీవారి భక్తులపై కనిపిస్తోంది. ఫర్షణల నేపథ్యంలో తమిళ భక్తుల రాక భారీగాతగ్గింది.