National Kabaddi Tournament
-
పురుషుల విభాగంలో ఢిల్లీకి చెందిన దేస్వాల్ టీం విజయం
-
తిరుపతి నగరంలో ముగిసిన జాతీయ కబడ్డీ పోటీలు
-
తగ్గేదేలే: నువ్వా.. నేనా?
-
రోజా కూతకు రాగానే మారుమోగిపోయిన స్టేడియం
-
కబడ్డీ కోర్టులో రోజా.. ఆటగాళ్లలో జోష్ నింపిన నగరి ఎమ్మెల్యే
తిరుపతి తుడా: జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌తో తిరుపతిని క్రీడాపురిగా తీర్చిదిద్దారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం స్థానిక ఇందిరా మైదానంలో మూడోరోజు కబడ్డీ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని బెస్ట్ ప్లేయర్లకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్ట ఇనుమడించేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి క్రీడలతో కొత్త సొబగులు వచ్చాయని తెలిపారు. తెలుగు బాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పెద్దపీట వేస్తారని కొనియాడారు. తిరుపతి ఇందిరా మైదానంలో కబడ్డీ లీగ్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి, వేదికపై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడుతాయన్నారు. కబడ్డీ పోటీలతో తిరుపతిలో పండుగ వాతావరణ ఏర్పడిందని తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం వెనుక తిరుపతి ప్రజలు, వ్యాపారులు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సహకారం ఉందని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అత్యున్నతంగా ప్రోటీలను నిర్వహించడం ఎమ్మెల్యే భూమనకే చెల్లిందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచి శ్రీకాంత్, అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం.. ఆనందం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించడం గర్వకారణమన్నారు. క్రీడలతో ఆర్యోగం, ఆనందం దక్కుతుందని తెలిపారు. ఈఓ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు టీటీడీ పూర్తి సహకారం అందించిందన్నారు. క్రీడాకారులకు తమ వంతుగా వసతి సౌకర్యం కల్పించామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో జోష్ నింపేందుకు ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, మేయర్శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్‌రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తిరునగరి.. క్రీడాపురి
-
తిరుపతి నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు
-
క్రీడాకారులకు ఆటే జీవితం: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
తిరుపతి తుడా: జాతీయ కబడ్డీ పోటీలు తిరుపతిలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, బ్యాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతాలాపన, భరతనాట్య ప్రదర్శన అనంతరం క్రీడా, శాంతి కపోతాలను ఎగురవేశారు. పోటీలను ప్రారంభించిన పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. తిరుపతిలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులకు ఆటే జీవితమన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండాలని, నాణ్యమైన చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం సంకల్పించారని తెలిపారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిని క్రీడా హబ్‌గా కూడా తీర్చిదిద్దుతామన్నారు. కబడ్డీ టోర్నీతో దేశమంతా తిరుపతి వైపు చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు.. డాక్టర్ గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు.. ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, నవాజ్‌బాషా, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, కలెక్టర్ హరినారాయణన్, మునిసిపల్ కమిషనర్ గిరీష, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఉత్సాహం ఉరకలేస్తోంది.. తిరుపతిలో కబడ్డీ కబడ్డీ..
-
జాతీయ కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి
జిన్నారం (మెదక్) : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాష్ట్రం తరఫున ఆడేందుకు మెదక్ జిన్నారంలోని గిరిజన బాలుర పాఠశాల విద్యార్థి ఎన్నికయ్యాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాథోడ్ ప్రశాంత్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్‌లో జరిగిన కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. దీంతో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ప్రశాంత్ ఎన్నికయ్యాడు. గతంలో ప్రశాంత్ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు సైతం అర్హతను సాధించిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూడా ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తాడని పాఠశాల ప్రిన్సిపాల్ వీరప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీఈటీ ప్రేమానందం ఆశాభావం వ్యక్తం చేశారు.