జిన్నారం (మెదక్) : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాష్ట్రం తరఫున ఆడేందుకు మెదక్ జిన్నారంలోని గిరిజన బాలుర పాఠశాల విద్యార్థి ఎన్నికయ్యాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాథోడ్ ప్రశాంత్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్‌లో జరిగిన కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు.
దీంతో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు గుజరాత్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ప్రశాంత్ ఎన్నికయ్యాడు. గతంలో ప్రశాంత్ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు సైతం అర్హతను సాధించిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూడా ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తాడని పాఠశాల ప్రిన్సిపాల్ వీరప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీఈటీ ప్రేమానందం ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి
Published Tue, Jan 19 2016 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement