national leval
-
జాతీయస్థాయి స్విమ్మింగ్ టోర్నీకి ఎంపిక.. మిట్టపల్లి రిత్విక
నిజామాబాద్: హైద్రాబాద్‌లోని పబ్లిక్స్కూల్లో ఈ నెల 29, 30 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ సబ్ జూనియర్, జూనియర్ టోర్నీలో జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది. జిల్లా తరఫున 50, 100, 200మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు, 200మీటర్లలో కాంస్య పతకంతో సాధించింది. ఆగస్టు 16 నుంచి 20వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్ టోర్నీకి ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర స్విమింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, ఉమేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడీల శ్రీరాములు, మహిపాల్‌రెడ్డి తదితరులు ఆమెను అభినందించారు. -
సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ గురి
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలపై అధికార బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జిలు ఇందులో పాల్గొంటారు. దిశానిర్దేశం చేయనున్న నడ్డా గత లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి అంతకుమించి నెగ్గాలని లక్ష్యం నిర్దేశించుకుంది. 2014, 2019ల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని 144 నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈ లోక్‌సభ స్థానాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పాగా వేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నలుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించింది. మరోవైపు ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర మంత్రుల బృందాలు పర్యటించాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జేపీ నడ్డా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల భేటీలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కచ్చితంగా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నలోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో జరగబోయే త్రిపుర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, మరింత చేరువ కావాల్సిన ప్రాంతాలు, వర్గాలను గుర్తించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడానికి వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆఫీసు బేరర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే అవకాశం ఉందని మరో నాయకుడు చెప్పారు. అమరీందర్‌కు కీలక బాధ్యతలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకున్న పలువురు పంజాబ్ నేతలకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్, మాజీ ఎంపీ సునీల్ జాఖడ్,యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓబీసీ ఉప వర్గీకరణకు దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం. 2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్‌ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది. -
జాతీయ సాహిత్య సమ్మేళనంలో రాణీప్రసాద్
హైదరాబాద్ వేదికలో సాహిత్య ప్రసంగం.. మహిళా రచయిత్రులతో మూడో జాతీయ సమ్మేళనం సిరిసిల్ల: జాతీయ మహిళా సాహిత్య సమ్మేళనంలో సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవయిత్రి కందేపి రాణీప్రసాద్ పాల్గొన్నారు. నంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో సోమవారం రాత్రి నిర్వహించిన సమ్మేళనంలో వంద మందికిపైగా మహిళా కవయిత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాణీప్రసాద్ సాహిత్య సృజనపై ప్రసంగించారు. కార్యక్రమంలో ముక్తేపి భారతి, తెన్నెటి సుధాదేవి, కన్నెగంటి అనసూయ, కుప్పిలి పద్మ, శైలజ, వాణిశ్రీ, శ్రీలక్ష్మీ, సుజనాదేవి, మెర్సీ, మార్గరేట్, గోడపర్తి సంధ్య, నందమూరి లక్ష్మీపార్వతి కేవీ.కృష్ణమూర్తి, మంథా భానుమతి మరో వంద మంది కవయిత్రులు పాల్గొన్నారు.