National Securities Depository Limited
-
అదానీ షేర్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయ్
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మూడు ఫండ్లకు సంబంధించిన గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) ఖాతాలను మాతమ్రే స్తంభింపచేసినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వివరణ ఇచ్చింది. దానికి అనుగుణంగానే తమ వెబ్సైట్లో తగు మార్పులు చేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లయిన ఎబ్యులా ఇన్వెస్ట్మెంట్స్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్, క్రెస్టా ఫండ్ వీటిలో ఉన్నాయి. తాజా వివరణతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం గణనీయంగా లాభపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ఆరు మారిషస్ ఆధారిత ఫండ్స్‌లో మూడింటి ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపచేసిందన్న వార్తలతో జూన్ 14న అదానీ సంస్థల షేర్లు ఏకంగా 25 శాతం దాకా పతనమయ్యాయి. అదానీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కాకుండా 2016 జూన్ నాటి జీడీఆర్‌ల విషయంలోనే ఆ ఫండ్స్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఎన్ఎస్డీఎల్ అప్పట్లోనే తెలిపింది. కానీ తమ వెబ్సైట్లో స్తంభింపచేసిన 9,444 ఖాతాల జాబితాలో వీటిని కూడా కొనసాగించడం సందేహాలకు తావిచ్చింది. తాజాగా ఆయా ఫండ్స్ ’జీడీఆర్’లను మాత్రమే ఫ్రీజ్ చేసినట్లు పోర్టల్లోనూ మార్చడంతో స్పష్టత ఇచ్చినట్లయింది. దీంతో బుధవారం అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ చెరి 4 శాతం, అదానీ పవర్ 2 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 0.76 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 0.29 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 0.24 శాతం పెరిగాయి. -
పుకార్లు షికార్లు,అదానీ ‘ఫండ్స్’ కలకలం!
న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్ల ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ (ఎన్ఎస్డీఎల్) స్తంభింపచేసిందన్న వార్తలను పారిశ్రామిక దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని పేర్కొంది. సదరు ఫండ్స్ ఖాతాలు యాక్టివ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. ‘ఇన్వెస్టర్లను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేందుకే ఇది చేశారు. దీనివల్ల ఇన్వెస్టర్లకు ఆర్థికపరమైన నష్టం జరగడంతో పాటు గ్రూప్ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతోంది‘ అని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇది మైనారిటీ ఇన్వెస్టర్లపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సదరు ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలపై స్పష్టతనివ్వాలని రిజి్రస్టార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌ని కోరాము. వాటిని స్తంభింపచేయలేదని స్పష్టం చేస్తూ వారు జూన్ 14న ఈ–మెయిల్ పంపారు‘ అని అదానీ గ్రూప్ పేర్కొంది. ఇవే అంశాలను అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ సంస్థలు.. స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేశాయి. మరోవైపు, అదానీ గ్రూప్ ప్రస్తావించిన డీమ్యాట్ ఖాతాలు యాక్టివ్గానే ఉన్నాయని కంపెనీకి పంపిన ఈమెయిల్లో ఎన్ఎస్డీఎల్ స్పష్టం చేసింది. అయితే, ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్లో ఆయా ఖాతాలను స్తంభింపచేసినట్లుగానే చూపుతుండటం గమనార్హం. అకౌంట్ స్థాయిలో వీటిని ఫ్రీజ్ చేసినట్లు పోర్టల్‌లో ఉంది. అయితే అదానీ గ్రూప్ స్టాక్‌లలో పెట్టుబడులకు సంబంధించి ఆయా ఫండ్స్ ఖాతాలు యాక్టివ్గానే ఉన్నాయని రిజిస్ట్రార్ కూడా స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్లో స్తంభింపచేసినట్లుగా చూపుతున్న ఖాతాలు వేరే సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించినవని పేర్కొన్నాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఆయా ఫండ్స్ దశాబ్దంపైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నాయని అదానీ వివరించింది. వివాదమిదీ.. అల్బ్యూలా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు..అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. వీటి ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపచేసిందనే వార్తలే గందరగోళానికి కారణమయ్యాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో ఈ ఫండ్స్‌కి 2.1 శాతం నుంచి 8.91 శాతం దాకా వాటాలు ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన టాప్ 12 ఇన్వెస్టర్ల జాబితాలో ఇవి కూడా ఉంటాయి. సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు ముందు.. ఈ పెట్టుబడుల విలువ సుమారు 7.78 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మూడు ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ ఉన్నాయి. క్రెస్టా ఫండ్ డీమ్యాట్ ఖాతాలో అదానీ గ్రూప్‌లోని ఆరు లిస్టెడ్ సంస్థలకు సంబంధించి 10.76 కోట్ల షేర్లు ఉన్నాయి. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఖాతాలో 8.59 కోట్లు, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలో అయిదు సంస్థలకు సంబంధించి 15.52 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ ఖాతాలన్నీ యాక్టివ్గానే ఉన్నట్లు ఎన్ఎస్డీఎల్ వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి : అదానీ షాక్! ట్విటర్లో ప్రముఖ జర్నలిస్ట్ పేరు ట్రెండింగ్..! -
తనఖా షేర్ల బదిలీ ఆపండి
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కార్వీకి రుణాలిచ్చిన బ్యాంకులకు ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్ ఆదేశాలిచి్చంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎస్ఎస్డీఎల్).. మరిన్ని షేర్లను కార్వీ క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించకుండా స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది ఉత్తర్వులు బుధవారం (నేడు) మధ్యాహా్ననికి ఇవ్వనుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు ఎన్ఎస్డీఎల్ ఇప్పటికే చాలామటుకు షేర్లను క్లయింట్లకు బదిలీ చేయగా.. మరికొందరు ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల బదలాయింపు ఇంకా జరగాల్సి ఉంది. అయితే, తనఖా పెట్టిన షేర్లకు ప్రతిగా కారీ్వకి రుణాలిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మొదలైన సంస్థలు ఈ విషయంలో సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపైనే శాట్ తాజా ఆదేశాలిచి్చంది. రుణాలపై ప్రభావం చూపుతుంది.. రుణాల కోసం తనఖా ఉంచిన షేర్లను ఇలా ఏకపక్షంగా బదలాయించేస్తే.. ఇలాంటి రుణాల మంజూరుపై తీవ్ర ప్రభావం పడుతుందని బ్యాంకులు తమ వాదన వినిపించాయి. ఆయా షేర్లను క్లయింట్లు విక్రయించేసిన పక్షంలో మళ్లీ వెనక్కి రప్పించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో క్లయింట్లకు బదిలీ చేసిన షేర్లను వెనక్కి తీసుకుని, ఎస్క్రో అకౌంట్లో ఉంచాలని కోరాయి. నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థలు చేసే ’తప్పులకు’ తమను బాధ్యులను చేయడం సరికాదని బ్యాంకులు పేర్కొన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 470 కోట్ల విలువైన షేర్లకు ప్రతిగా రూ. 300 కోట్ల రుణమిచి్చంది. మిగతా వాటికన్నా ముందుగా శాట్‌ను ఆశ్రయించిన బజాజ్ ఫైనాన్స్ .. సుమారు రూ. 345 కోట్ల రుణమిచ్చింది. మరోవైపు, బ్యాంకులు బాధ్యతారహితంగా బ్రోకరేజీలకు రుణాలిస్తున్నాయంటూ ఎన్ఎస్డీఎల్ తరఫు న్యాయవాది ఆరోపించారు. సెబీ ఆదేశాల మేరకే క్లయింట్ల ఖాతాల్లోకి ఎన్ఎస్డీఎల్ షేర్లను బదిలీ చేసిందని స్పష్టం చేశారు. సుమారు 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ. 2,300 కోట్లకు పైగా విలువ చేసే షేర్లను బజాజ్ ఫైనాన్స్ తదితర సంస్థల్లో తనఖా పెట్టి కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ దాదాపు రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీపై సెబీ ఆంక్షలు విధించగా, స్టాక్ ఎక్సే్చంజీలు ఆ సంస్థ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేశాయి. ఈ క్రమంలో.. కార్వీ తనఖా పెట్టిన షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయాలన్న సెబీ ఆదేశాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) ప్రస్తుతం అమలు చేస్తోంది. ఇప్పటికే 83,000 మంది ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్ల బదిలీ పూర్తయ్యింది. చెల్లింపుల సమస్య కారణంగా మిగతా ఖాతాల్లోకి బదలాయింపు జరగాల్సి ఉంది. -
ఇన్వెస్టర్ల కోసమే సెబీ
సాక్షి, గుంటూరు: ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె. రంగనాయకులు అన్నారు. శనివారం గుంటూరులో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్), సెబీ ఆధ్వర్యంలో మార్కెట్ భద్రతపై ఇన్వెస్టర్లకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోతే గనక ఇన్వెస్టర్లు సెబీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు-10లో ఉన్న సెబీ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు. సెబీ డీజీఎం సంజయ్ సీ పురావ్, ఎన్ఎస్డీఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సమర్ బన్వత్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజరు ఎం. రవికుమార్, హెచ్డీఎఫ్సీ ప్రతినిధి సుమన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 500 కోట్ల రికవరీకి నోటీసులు: సిన్హా ముంబై: ఉల్లంఘనలకు పాల్పడిన, బకాయిలు ఎగ్గొట్టిన కంపెనీల నుంచి దాదాపు రూ.500 కోట్లు పైగా రాబట్టేందుకు గత రెండు నెలల్లో నోటీసులు పంపినట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. ఆయా కంపెనీలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు ఒక సదస్సులో ఆయన చెప్పారు. మరోవైపు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సారథ్యంలోని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ సంక్షోభం ప్రభావం.. మరో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్-ఎస్ఎక్స్పై ఉండదని సిన్హా చెప్పారు. తన పరిధిలోకి వచ్చే ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ నియంత్రణ పకడ్బందీగా ఉండేలా సెబీ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.