National Womens Day
-
National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సమాజసేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. "నైటింగేల్ ఆఫ్ ఇండియా" ‘‘భారత కోకిల’’గాపేరొందిన సరోజినీ నాయుడు పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 13). మహిళా దినోత్సవంగా అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 వతేదీ గుర్తొస్తోంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టిన రోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ప్రతీక. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులోనే ఆమె "లేక్ గర్ల్" అనే కవితను రాసింది.13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన 'లేడీ ఆఫ్ ది లేక్' కవిత చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు. ఉపకారం వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలంటూ ఇంగ్లాండు పంపారు. లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1905లో అతని తొలి కవితా సంకలనం 'గోల్డెన్ థ్రెషోల్డ్' చూసి ముగ్ధుడైన మహాత్మా గాంధీ ఆమెకు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' బిరుదును ఇచ్చారు. గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు, యుకెలో 1915లో తొలిసారి గాంధీజీని కలుసుకున్నారు. అలా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1925లో ఇండియన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండో మహిళా అధ్యక్షురాలయ్యారు. 1932లో కాంగ్రెస్ ప్రతినిధిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1928లో ఇండియా వ్యాపించిన ప్లేగు వ్యాధి కట్టడిలో చేసిన సేవలకు ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఐ-హింద్ అవార్డుతో సత్కరించింది. జాతీయ పోరాటంలో, గాంధీజీతో కలిసి జైలుకు కూడా వెళ్లారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీని 21 నెలలు జైలులో పెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆమె చరిత్రకెక్కారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అలాగే సాహిత్యరంగంలో ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరోజినీ నాయుడు. ‘బర్డ్ ఆఫ్ ది టైం’, ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’, ‘దిఫెదర్ ఆఫ్ డాన్’ ‘గిఫ్ట్ ఆఫ్ ఇండియా’, ‘పాల్కీ క్యారియర్స్’ లాంచి రచనలు ఎందరినో ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పొయెం’లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పాడేవారట అందుకే ఆమెను ‘భారత కోకిల’ అన్నారు. 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. -
సోషల్ మీడియాను బాగా వాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యక్రమాలు, మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మంచి పనుల ప్రచారానికి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని బీజేపీ జాతీయ మహిళా మోర్చా తీర్మానించింది. శనివారం హైదరాబాద్లో జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మీడియా, సోషల్ మీడియా వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై జాతీయ పార్టీ బాధ్యులు సందీప్ పాత్రా, దుష్యంత్కుమార్ గౌతమ్, మహిళా మోర్చా మీడియా, సోషల్ మీడియా బాధ్యులకు శిక్షణనిచ్చారు. సామాజిక మాధ్యమాలను మెరుగైన విధంగా ఉపయోగించుకోవాలని, పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి సుఖ్ప్రీత్కౌర్, రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో తాను సోషల్ మీడియాను సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు డీకే అరుణ తెలిపారు. -
పదహారు రోజుల ఉద్యమ ప్రణాళిక
ఐక్యరాజ్య సమితి నవంబర్ 25ని ‘మహిళలపై హింసను నిర్మూలించే దినం’ గా పాటిస్తోంది. ఈ రోజు మొదలు.. ప్రపంచ మానవహక్కుల దినమైన డిసెంబర్ 10 వరకు 16 రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏటా పిలుపునిస్తోంది. ఆధునిక చైతన్యాన్ని అందిపుచ్చుకొన్న మహిళాప్రపంచం ‘మీ టూ’ లాంటి ఉద్యమాలతో గొంతుపెకిలించుకొని తమపై జరుగుతున్న అత్యాచారాలనూ, లైంగిక వేధింపులను సవాల్ చేస్తూ బాహ్యప్రపంచంలోకి దూసుకొచ్చారు. అయితే మీటూ లాంటి పోరాటాలు సముద్రంలో నీటి బొట్టులాంటివేనన్నది గ్రహించాలి. ఈ సాంకేతిక ప్రపంచాన్ని చేరుకోవడానికి అవకాశమేలేని అట్టడుగు వర్గాల్లో లక్షలాది మంది స్త్రీలు అనేక రకాల లైంగిక వేధింపులకూ, హింసకూ గురవుతూనే ఉన్నారు. పనిలో, గనిలో, కార్ఖానాల్లో పరిశ్రమించే స్త్రీలు మొదలుకొని ధనిక, పేద, కుల, మత, ప్రాంత తారతమ్యాలకు అతీతంగా స్త్రీజాతి ఎదుర్కొంటోన్న పురుషాధిపత్య హింస నుంచి బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని ప్రపంచదేశాలకు తొలిసారి 1993లో పిలుపును ఇచ్చింది. ఆ క్రమంలోనే మహిళలపై హింసను నిర్మూలించే పదహారు రోజుల మహిళా ఉద్యమ ప్రణాళికను రూపొందించింది. బాధితులెవరు? ఇప్పటికింకా సాధారణ సమాజంలో మానవహక్కుల్లో భాగంగా గుర్తింపునకు నోచుకోని వర్గాలు ట్రాన్స్జెండర్, లెస్బియన్లు, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్, వలసవెళ్లిన స్త్రీలు, మహిళా శరణార్థులు, మైనారిటీలు, హెచ్ఐవీ బాధితులైన బాలికలు, స్త్రీలూ, శారీరక వైకల్యం కలిగిన స్పెషల్లీ చాలెంజ్డ్ చిన్నారులు అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్న వర్గాలుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ‘ఆరెంజ్ ద వరల్డ్’ థీమ్ అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక దినం నవంబర్ 25ని ప్రతి యేటా ఒక్కో థీమ్తో నిర్వహిస్తారు. ఈ యేడాది 2019ని ‘‘ఆరెంజ్ ద వరల్డ్: జెనరేషన్ ఈక్వాలిటీ స్టాండ్స్ ఎగెనెస్ట్ వుమన్’ జరుపుకుంటున్నారు. నవతరం.. అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తోందనీ, సమానత్వాన్ని కాంక్షిస్తోందనీ దీని ఉద్దేశం. మహిళా విముక్తి సంకేతానికి గుర్తుగా ‘ఆరెంజ్ ద వరల్’్డ అని జగమంతా ప్రతిధ్వనించేలా ఆ రోజు మహిళా శక్తి నినదిస్తుంది. ఈ గొప్ప కార్యానికి నారింజరంగుని ఎంపిక చేసుకోవడానికి కారణం ఆ రంగు ఉజ్వల భవిష్యత్తుకి, హింసారహిత సమాజానికీ ప్రతీక. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసల నుంచి విముక్తికి ఈ రంగు సంఘీభావ చిహ్నం. – అరుణ అత్తలూరి యూఎన్ డిక్లరేషన్ శారీరకంగా, లైంగికంగా, మానసికంగా మహిళలపై జరుగుతోన్న లింగ వివక్షతో కూడిన అన్ని రకాల హింసను అరికట్టాల్సిందిగా 1993లో తొలిసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన చేసింది. అందులో భాగంగానే ప్రతి యేటా నవంబర్ 25ని ప్రపంచ దేశాల్లోని మహిళలు హింసా నిర్మూలనా దినంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడా చర్చకు కూడా నోచుకోని స్త్రీల పునరుత్పత్తి హక్కులు మొదలుకొని, విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమానావకాశాలూ, శ్రామిక మహిళలు, వివక్షలపై పదహారు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రమాద ఘంటికలు ►ప్రతి ముగ్గురు మహిళలు లేదా బాలికలు ఒకరు తమ జీవితకాలంలో అత్యంత దగ్గరిగా ఉన్న సహచర పురుషుల కారణంగా భౌతిక, లైంగిక దాడులకు గురవుతున్నారు. ►వివాహిత, లేదా సహజీవనం చేస్తోన్న వారిలో కేవలం 52 శాతం మంది మహిళలు మాత్రమే లైంగిక సంబంధాల విషయంలోనూ, గర్భధారణ, ఆరోగ్య విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. ►ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 కోట్ల మంది మహిళలు, బాలికలు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరిగాయి. 20 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక కోర్కెలను అణచివేసే క్రమంలో భాగంగా ‘జెనిటల్ మ్యుటిలేషన్’కు గురయ్యారు. ►2017లో ప్రపంచవ్యాప్తంగా హత్యకుగురైన ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు తన స్వంత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే. ► ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా బాధితుల్లో 71 శాతం మంది మహిళలు బాలికలే ఉన్నారు. వీరిలో ప్రతి నలుగురిలో ముగ్గురు బాధితులు లైంగికంగా హింసకు గురయ్యారు. -
నేతన్నలను ఆదుకుంటాం
►రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ►జిల్లా పరిషత్లో జాతీయ చేనేత దినోత్సవం ఆదిలాబాద్అర్బన్: తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫారాల కోసం చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో రూ.1,286 కోట్లు కేటాయించడం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల స్థాపనకు రుణాలు, భూములు ఇవ్వడం జరుగుతుందన్నారు. చేనేత వస్త్రాలను ధరించిన పాత రోజులు మళ్లీ పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలో చేనేత ఉత్పత్తులు లేకున్నా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది పవర్లూమ్స్ రావడంతో హ్యాండ్లూమ్స్ కొంత మేరకు తగ్గిందన్నారు. ఇండియా చేనేత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి గీరాకీ ఉందన్నారు. జిల్లా స్థాయిలో చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. హ్యాండ్లూమ్కు మంచి భవిష్యత్ వస్తుందన్నారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 32వేల చేనేత కుటుంబాలుండేవని, ప్రస్తుతం 32కుటుంబాలు కూడా లేవన్నారు. అంతకుముందు పద్మశాలీ కుల పెద్దలను సన్మానించారు.