ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సమాజసేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. "నైటింగేల్ ఆఫ్ ఇండియా" ‘‘భారత కోకిల’’గాపేరొందిన సరోజినీ నాయుడు పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 13).
మహిళా దినోత్సవంగా అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 వతేదీ గుర్తొస్తోంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టిన రోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది.
సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ప్రతీక. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులోనే ఆమె "లేక్ గర్ల్" అనే కవితను రాసింది.13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన 'లేడీ ఆఫ్ ది లేక్' కవిత చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు. ఉపకారం వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలంటూ ఇంగ్లాండు పంపారు. లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1905లో అతని తొలి కవితా సంకలనం 'గోల్డెన్ థ్రెషోల్డ్' చూసి ముగ్ధుడైన మహాత్మా గాంధీ ఆమెకు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' బిరుదును ఇచ్చారు.
గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు, యుకెలో 1915లో తొలిసారి గాంధీజీని కలుసుకున్నారు. అలా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1925లో ఇండియన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండో మహిళా అధ్యక్షురాలయ్యారు. 1932లో కాంగ్రెస్ ప్రతినిధిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1928లో ఇండియా వ్యాపించిన ప్లేగు వ్యాధి కట్టడిలో చేసిన సేవలకు ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఐ-హింద్ అవార్డుతో సత్కరించింది. జాతీయ పోరాటంలో, గాంధీజీతో కలిసి జైలుకు కూడా వెళ్లారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీని 21 నెలలు జైలులో పెట్టింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆమె చరిత్రకెక్కారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే సాహిత్యరంగంలో ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరోజినీ నాయుడు. ‘బర్డ్ ఆఫ్ ది టైం’, ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’, ‘దిఫెదర్ ఆఫ్ డాన్’ ‘గిఫ్ట్ ఆఫ్ ఇండియా’, ‘పాల్కీ క్యారియర్స్’ లాంచి రచనలు ఎందరినో ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పొయెం’లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పాడేవారట అందుకే ఆమెను ‘భారత కోకిల’ అన్నారు. 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమె గుండెపోటుతో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment