nationalist
-
జాతీయవాద ఉద్యమానికి తీరని లోటు
ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, ఆలిండియా స్థాయిలో ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులుగా గణనీయమైన స్థాయిలో సేవలు అందించారు. నర్సయ్య తన 81 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్ 24 హన్మకొండ హంటర్ రోడ్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం మండలగూడెంలో 1942 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభిం చారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను సులభ శైలిలో బోధించి వారిలో ఇంగ్లిష్ భాష అధ్యయనం పట్ల ఆసక్తి పెంచే మెలకువలు నేర్పించిన ఉత్తమ అధ్యాపకులుగా గుర్తింపు పొందారు. 1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో జరిగిన అనేక సంఘర్షణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల జిల్లాల్లో విశేష పర్యటనలు చేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తల్లో జాతీయవాద దృక్పథాన్ని ప్రేరేపించారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. కొంతకాలం వరంగల్ విభాగ్ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏబీవీపీ సంస్థకు పూర్తి సమయ కార్యకర్తగా వరంగల్ నుండి దేశ నలుమూలల పని చేయడానికి వెళ్లారు. క్లిష్ట పరిస్థితులలో జాతీయవాద వ్యాప్తి కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు నర్సయ్య. బిహార్ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్‌గా కూడా ఆయన చాలాకాలం సేవలు అందించారు. 2001లో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇంగ్లిష్ లెక్చరర్‌గా నర్సయ్య వడ్డేపల్లిలోని పింగిలి కాలేజీలో, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేశారు. పలు జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సేవాపతకం శిబిరాల్లో జాతీయ పునర్నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై అనర్గళంగా ఉపన్యసించి యువతలో సేవాభావం, దేశభక్తి, సంకల్పబలం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసిన సామాజిక చైతన్యశీలి ఆయన. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ చౌరస్తాలోని వేదికపై ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా సాగేవి. నక్సలైట్ల చేతిలో ఏబీవీపీ కార్యకర్తలు మరణించిన సమయంలో నర్సయ్య మొక్కవోని ధైర్యంతో వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో విద్యార్థులను జాగృతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏబీవీపీ చేపట్టిన పాదయాత్రకు పాటలు, మాటలు అందించారు. గుజ్జుల నర్సయ్యసార్ మరణం విద్యారంగానికి, సామాజిక చైతన్యానికి తీరని లోటు. వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళి. (క్లిక్: సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ) - నేదునూరి కనకయ్య వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం -
జైహింద్ స్పెషల్: యుద్ధతంత్రం.. శాంతిమంత్రం
పాఠం మొదలైంది. అది ఫస్టియర్ బి.ఎ. హిస్టరీ క్లాస్. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్. ప్రొఫెసర్ ఇ.ఎఫ్.ఆటెన్ క్లాస్ మొదలు పెట్టారు. అంతకుముందే అతడు స్టాఫ్ రూమ్‌లో కూర్చొని ఉన్నప్పుడు.. ఇండియన్ స్టూడెంట్స్‌కి బుద్ధీజ్ఞానం లేవన్నాడు! చిన్న ఈక్వేషన్ తెలుసుకోలేకపోతే ఎలా అన్నాడు.. క్లాస్‌లోకి వచ్చి, కొనసాగింపుగా. హిస్టరీ ప్రొఫెసర్‌కు సమీకరణాలతో ఏం పని? అయితే ఆయన మాట్లాడుతున్నది కూడా చరిత్ర సమీకరణాల గురించే! చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రడీ అంటున్న సీఈవో ఒకే ఆత్మ.. ఒకే ఆగ్రహం ‘‘చూడండి, అధికులదే ఎప్పుడూ అధికారం. ఇండియన్స్ కన్నా బ్రిటిషర్లు మోరల్లీ సుపీరియర్స్. ఇది రియాలిటీ. దీన్ని యాక్సెప్ట్ చెయ్యకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ ఆశ్చర్యంగా అడిగారు ఆటెన్. తోటి ప్రొఫెసర్లు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ... క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్ ఉడికిపోయారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎవరైనా గౌరవ మర్యాదలు పాటిస్తున్నారూ అంటే వారు ఇంకోచోట ఎక్కడో తేల్చుకోవాలనుకున్నారని అర్థం. అయితే స్టూడెంట్స్‌లో అంత కుట్ర ఉండదు. స్టూడెంట్స్‌కి అంత నిగ్రహం ఉండదు. స్టూడెంట్స్‌కి విడివిడి ఆత్మలు ఉండవు. ఒకే దేశంలా అందరిదీ ఒకే ఆత్మ. ఒకరికి దెబ్బతగిలితే ఇంకొకరి చర్మం కములుతుంది. ఒకరికి మనసుకు గాయం అయితే ఇంకొకరి పిడికిలి బిగుసుకుంటుంది. ప్రొఫెసర్ ఆటెన్... ఒకరి మనసునే గాయపరచలేదు. ముందున్న కుర్రాడు నూరేళ్ల ప్రెసిడెన్సీ కాలేజీలో ఇలాంటిది జరగలేదు! భారతదేశ చరిత్రలోనే ఇలాంటిది జరగలేదు! ఏమైంది? ఏమైందీ?! ప్రొఫెసర్ ఆటెన్పై చెయ్యి చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు?.. బి.ఎ. ఫస్టియర్ స్టూడెంట్స్. ఎందుకు అని వైస్ ఛాన్స్లర్ అడగలేదు. ‘‘ఎవరు?’’ అని అడిగాడు. ఎవరో ఎవరినో చూపించారు. ‘‘నేనడుగుతున్నది... చెయ్యి చేసుకున్నవారి వెనుక ఉన్నది ఎవరూ అని?’’ అన్నాడు. ఎవరూ చెప్పలేదు. చెప్పకుండానే తెలుసుకున్నాడు ఛాన్స్లర్. సు–భా–స్... చంద్రబోస్!! కానీ, బోస్... వెనుక లేడు. అందరికన్నా ముందు ఉన్నాడు. ఆటెన్‌ని అందరికన్నా ముందు కొట్టింది కూడా అతడేనేమో తెలీదు. ఆటెన్‌కు ‘బ్రిటిష్ ఇండియా’ క్షమాపణ చెప్పింది. కాలేజ్ రిజిష్టర్‌లో బోస్ పేరు ‘తొలగించడమైనది’. గమ్యం ఒకటే.. దారులే వేరు! హీరో అయ్యాడు బోస్. ‘‘వయసు?’’ ‘‘ఇరవై.’’ ‘‘కాలేజ్ నుంచి ఎందుకు పంపించారు?’’ ‘‘ప్రొఫెసర్ ఆటెన్ ఇండియన్స్‌ని తిట్టాడు. ప్రొఫెసర్ ఆటెన్‌ని మేము...’’ ‘‘అర్ధమైంది! యు ఆర్ ఆడ్మిటెడ్’’ ‘‘.......’’ ‘‘కానీ బోస్... గుర్తుంచుకో. ఆటెన్‌ని నువ్వేదో చేసినందుకు కాదు, నీ ఫ్యూచర్ పాడవకూడదని.’’ బోస్ ‘స్కాటిష్ చర్చెస్ కాలే జ్’ లో ఏకంగా బి.ఎ. థర్డ్ ఇయర్లో చేరాడు. ఫస్ట్ క్లాస్‌లో పాసై íఫిలాసఫీ పట్టాతో బయటికి వచ్చాడు. కానీ అతడికి గాంధీజీ ఫిలాసఫీ ఏమిటో అంతుబట్టడం లేదు! అహింస అంటున్నారు గాంధీజీ. దూకుడు మీదుండే ఇరవై రెండేళ్ల కుర్రాడికి.. రెణ్ణాళ్లకే సివిల్ సర్వీసు ఉద్యోగాన్ని కాలితో తన్నొచ్చిన జాతీయవాదికి.. బెంగాల్ అతివాద బెబ్బులి చిత్తరంజన్‌దాస్ దగ్గర పంజాకు పదును పెట్టుకున్న చిరుతకు.. యుద్ధ తంత్రాన్ని రచించకుండా శాంతిమంత్రాన్ని జపిస్తే రుచిస్తుందా?! ముళ్లదారిలో నడుస్తూ గులాబీ గుత్తుల సందేశాలను మోసుకెళ్లడం ఏమిటి? గాంధీజీ సిద్ధాంతం బోస్కి నచ్చలేదు. బోస్ దూకుడుని గాంధీజీ మెచ్చలేదు. ఇద్దరిదీ ఒకే గమ్యం. దారులు వేరు! శత్రువుకు కోసం గాంధీజీ చెంపను చూపిస్తే, నేతాజీ చూపుడు వేలిని చూపిస్తున్నాడు. అరె! కుర్ర బోస్... హఠాత్తుగా నేతాజీ ఎప్పుడయ్యాడు?! ‘కాంగ్రెస్’కు పోటీ! బోస్ హఠాత్తుగా ‘నేతాజీ’ అవలేదు. ముందు ఆలిండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు అయ్యాడు. ‘ఫార్వర్డ్’ న్యూస్‌పేపర్‌కి ఎడిటర్ అయ్యాడు. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ సి.ఇ.వో. అయ్యాడు. చుట్టుముట్టిన పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు. మాండలే జైలులో ఖైదీ అయ్యాడు. రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై మళ్లీ హీరో అయ్యాడు. కాంగ్రెస్‌పార్టీ జనరల్ సెక్రెటరీ అయ్యాడు. కలకత్తా మేయర్ అయ్యాడు. నెహ్రూకి దగ్గరయ్యాడు. సహాయ నిరాకరణ చేసి మళ్లీ అరెస్టయ్యాడు. ఐరోపా వెళ్లాడు. అక్కడి భారతీయ విద్యార్థుల్ని, ఐరోపా రాజకీయ నాయకులని, ముస్సోలినీని కలిశాడు. కమ్యూనిజాన్ని, ఫాసిజాన్ని స్టడీ చేశాడు. తిరిగొచ్చాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. గాంధీజీకి నచ్చలేదు. స్వరాజ్యం కోసం తుపాకీ పట్టాల్సిందేనని అన్నవాడెవడూ ఆయనకు సహజంగానే నచ్చరు. పైగా ఇప్పుడు బోస్... ది గ్రేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి పోటీ పడేందుకు వచ్చాడు. అసలే నచ్చడు. గాంధీజీ ఒప్పుకోలేదు! పార్టీలో గాంధీజీకి ఎంతమంది ఉన్నారో, బోస్కి అంతమంది ఉన్నారు. ఎటువైపు ఎంతమంది ఉన్నా, అందరం కలిసే ఉందాం అన్నాడు బోస్. కలిసి ఉండి దేశాన్ని ఏం చేద్దామని? గాంధీజీకి అర్థంకావడం లేదు. బోస్ గెలిచాడు. మళ్లీ ఏడాది కూడా నిలబడ్డాడు. ‘‘నో’’ అన్నారు గాం«ధీజీ! ఆయనకు తెలుసు. చేత్తో తుపాకీ పట్టుకుని ఆవేశంగా తిరగేవాడు ఎప్పుడో కొంప ముంచేస్తాడు. ఇంత శ్రమా వృథా అవుతుంది. ఇంత శాంతీ బూడిదవుతుంది. ‘‘అవును నిజమే’’ అన్నారు నెహ్రూ. పెద్దాయనకు ఇంకో పెద్దాయన సపోర్ట్. ఎవరూ మాట్లాడలేదు. గాంధీజీ తన క్యాండిడేట్‌గా పఠాభి సీతారామయ్యను నిలబెట్టారు. ‘‘బోస్... నువ్వు పోటీ చేయకు’’ అనే సంకేతం కూడా పంపారు. -
అజిత్ పవార్‌కు ఐటీ శాఖ ఝలక్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు ఆదాయపన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్, ఇతర బంధువులకు చెందిన రూ.1,400 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. ముంబై, న్యూఢిల్లీ, పుణె, గోవా, మరో డజనుకుపైగా ప్రాంతాల్లో ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్టుగా మంగళవారం ప్రకటించింది. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాంజాక్షన్ యాక్ట్ 1988 కింద ఈ ఆస్తుల్ని అటాచ్ చేసుకున్నట్టుగా స్పష్టం చేసింది. సతారాలో రూ.600 కోట్ల విలువ చేసే షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో రూ.250 కోట్లు విలువ చేసే రిసార్ట్ నిలయ, దక్షిణ ముంబైలోని రూ.25 కోట్లు విలువ చేసే పార్థ్ పవార్ కార్యాలయం నిర్మల్ హౌస్ , దక్షిణ ఢిల్లీలోని రూ.20 కోట్లు విలువ చేసే ఫ్లాట్‌తో పాటుగా... వివిధ ప్రాంతాల్లో రూ.500 కోట్లు విలువ చేసే భూములు అటాచ్ చేసుకున్నట్టుగా ఐటీ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆస్తులన్నీ అజిత్ పవార్, ఆయన బంధువులవేనని, వారి బినామీ పేర్ల మీద ఉన్నాయని తెలిపారు. ఆ ఆస్తులన్నీ అక్రమ మార్గాల్లోనే వారికి వచ్చాయని అన్నారు. గత నెలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పవార్ బంధువుల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. -
‘జాతీయవాద’ చట్రంలో చిక్కిన క్రికెట్
భారత ఉపఖండానికి చెందిన జట్లు ఆడే క్రికెట్ క్రీడను జాతీయవాద దృక్పథంతో చూడటమే సమస్య. ప్రత్యర్థి జట్లు బౌండరీలు కొట్టినా లేదా వికెట్లు తీసుకున్నా స్టేడియంలు నిశ్శబ్దంగా మారుతాయి. అన్ని జట్ల విషయంలోనూ ఇది జరిగేదే. కాకపోతే భారత్–పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్‌ల విషయంలో ‘శత్రు’ జట్టుపై ప్రేక్షకుల కోపం మరింత ఎక్కువ. చెప్పుకోదగిన ప్రయోజనమేదీ పెద్దగా లేకపోయినా ఎదురెదురుగా నిలిచి అపకుండా కాల్పులు సాగిస్తుండే సేనల స్థానంలో గొంతులు చించుకుని దూషించే పౌరులు నిలుస్తారు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు పరస్పరం తలపడుతుంటే చూసి ఇరు దేశాల ప్రజలు ఆనందిస్తారా? మనం ఇక ఎంత మాత్రమూ ఆ అనుభూతిని ఇష్టపడటం లేదనే నమ్మకానికి వచ్చేశాను. అలా ఆనందించడం ఒకప్పటి సంగతి కావచ్చు గానీ, ఇంచుమించు గత 25 ఏళ్లుగా పరిస్థితి అలా లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర విద్వేషం, అయిష్టం క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సందర్భాల్లో అధికంగా ఉంటాయి. మీడియా కారణంగా అవి కట్టలు తెంచుకునే స్థాయిలో నిలుస్తాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు భిన్నంగా క్రికెట్ ఆట రోజంతా లేదా ఐదు రోజుల పాటూ సాగుతుంది, బాధ లేదా విజయోత్సాహం భావన దీర్ఘంగా విస్తరిస్తాయి. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం ఒకప్పుడైతే కోరుకోదగిన మంచి విషయమే. కానీ, ఇప్పుడు రెండు జట్లూ ఒకదానితో మరొకటి తలపడటం ఇంచుమించుగా మానేశాయి. కాబట్టి ఈ చేదు అనుభవం టీ20లకు, వన్డే ఇంటర్నేషనల్స్‌కు మాత్రమే, అది కూడా తటస్థ మైదానాలలో జరిగే వాటికే పరిమితమైంది. భారత ఉపఖండంలోని జట్లు ఆడే క్రికెట్ క్రీడను జాతీయవాద దృక్పథంతో చూడటం, మెచ్చుకోవడం అనేదే దీనికి సంబంధించిన మొదటి సమస్య. ప్రత్యర్థి జట్లు బౌండరీలు కొట్టినప్పుడు లేదా వికెట్లు తీసుకున్నప్పుడు స్టేడియంలు నిశ్శ బ్దంగా మారుతాయి. అన్ని జట్ల విషయంలోనూ ఇది జరిగేదే. కాకపోతే భారత్– పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్‌ల విషయంలో ‘శత్రు’ జట్టుపై ప్రేక్షకుల కోపం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థి జట్ల మధ్య ఉండే స్నేహపూర్వక వాతా వరణం, సరదాగా ఆటపట్టించడం వంటి ఇతర అంశాలు స్టేడియంలో క్రీడలను చూడటాన్ని ఆనందదాయకంగా చేస్తాయి. ఉపఖండంలో జరిగే పోటీల్లో అది పూర్తిగా కొరవడుతుంది. క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ప్రయోజనమేదీ పెద్దగా లేక పోయినా ఎదురెదురుగా నిలిచి ఆగకుండా కాల్పులు సాగిస్తుండే సేనల స్థానంలో గొంతులు చించుకుని దూషించే పౌరులు ఉంటారు (వారు కూడా తమ తమ జట్ల రంగుల యూనిఫారాల్లో ఉంటారు). గుజరాతీలు క్రీడలకు సంబంధించి అదనంగా మరో అంశాన్ని చేర్పు చేశారు. జాతీయత ఆవహించి ఉన్న సందర్భంలోనూ అది పని చేస్తుంటుంది. ఒకప్పుడు నేను మహా జోరుగా పందేలు (బెట్టింగ్‌లు) కాసేవాడ్ని (ఇప్పుడిక ఎంత మాత్రం చేయడం లేదు). ఒక సాయంత్రం మా బావమరిది సందీప్ ఘోష్ మా ఇంటికి వస్తున్నారు, అప్పుడు భారత్, శ్రీలంకతో ఆడుతోంది. ఆయన లంకపై పందెం కాయాలనుకున్నారు. ఆ పందెం కాయమని చెప్పడానికి నేను బుకీకి ఫోన్ చేశాను. ఆ పని ముగించాక, భారత్‌కు వ్యతిరేకంగా ఎందరు పందేలు కాసి ఉంటారా? అని మాకు ఆశ్చర్యం కలిగింది. గుజరాతీలు తమ ఉద్వేగాలను వ్యాపారానికి దూరంగా ఉంచుతారు. కాబట్టి చాలా మందే కట్టి ఉంటారని అనుకున్నాం. నేను మళ్లీ బుకీకి ఫోన్ చేసి అడిగితే దాదాపు ఓ యాభై మంది ఉంటారని, ఘోషే మొదటివాడని చెప్పాడు. బాగా పందేలు కాసే గుజరాతీలు సైతం జాతీ యవాదం వెంటపడి పోయి, తమ డబ్బుతో కూడా భారత్‌కు మద్దతు తెలుపు తున్నారని దీని అర్థం. ఆ మ్యాచ్‌లో లంక గెలిచింది. ఇకపోతే, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ల విషయంలో అ పందేలు కట్టే అంశం కూడా దాదాపుగా అంతరించి, పరిస్థితి ఇంచుమించు యుద్ధంలా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం భారత్–పాక్ మ్యాచ్‌లను చూడటం ఆనందదాయకంగా ఉండగా జరిగిన ఒక మ్యాచ్ గుర్తుకు వస్తోంది. అప్పుడు మియాందాద్, ఇమ్రాన్‌ఖాన్‌ల క్రీడా నైపుణ్యం తారస్థాయిలో ఉండేది, కపిల్‌దేవ్ అప్పుడే గవాస్కర్ నేతృత్వంలోని భారత జట్టులో చేరాడు. క్రికెట్ క్రీడ ఇబ్బం దికరంగా మారడం మొదలైన తొలి మ్యాచ్‌లలో ఒకటి భారత్–వెస్టిండీస్‌ల మధ్య 1983 అక్టోబర్‌లో శ్రీనగర్‌లో జరిగింది. ప్రేక్షకులు భారత్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు, ప్రేక్షకుల నుంచి తమకు లభించిన మద్దతుకు వెస్టిండీస్ జట్టు నిర్ఘాంత పోయింది. గవాస్కర్ తన ‘‘రన్స్ ఎన్ రన్స్’’లో ఆ ఆనుభవాన్ని వర్ణించారు. ప్రేక్ష కులు ఇమ్రాన్‌ఖాన్ పోస్టర్లను పట్టుకుని ఉండటం గురించి రాశారు. నాతో సహా చాలా మంది భారతీయులకు కశ్మీర్లో పరిస్థితి సాధారణంగా లేదనే విషయం తెలిసింది అప్పుడే. గవాస్కర్ అనుభవానికి కారణం మరి దేనికన్నా ఎక్కువగా భారత వ్యతిరేకతేనని నా భావన. అది అవహేళనే. అయితే ఆయన దాన్ని సరైన రీతిలో స్వీకరించారు. గవాస్కర్ ప్రేక్షకులకు ముందు తనను, తర్వాత మైదానాన్ని చూపి, అటుపిమ్మట ఇమ్రాన్ పోస్టర్‌ను, ఆకాశాన్ని చూపినట్టు ఆయన రాశారు. తన సైగలకు ప్రేక్షకులు పెద్దగా హర్షధ్వానాలు చేశారని పేర్కొన్నారు. మార్చి 2004లో ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ అక్తర్, మోహ్మద్ సమీల బౌలింగ్‌ను ఎదుర్కొని వీరేంద్ర సెహ్వాగ్ త్రిశతకం చేశాడు. ఆ సమ యంలో నేను, ఒక పాకిస్తానీ స్నేహితునితో కలసి స్టేడియంలోనే ఉన్నాను. ఆ మ్యాచ్ జరుగుతుండగా మమ్మల్ని భారతీయులుగా గుర్తించిన ప్రేక్షకులు ఆటోగ్రా ఫ్లను కోరుతూ మా వద్దకు వచ్చారు. అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముష ర్రఫ్ల చొరవతో జరిగిన ప్రెండ్షిప్ సిరీస్ సందర్భంగా అది జరిగింది. కార్గిల్‌లో, ఒక్కో పక్షాన దాదాపు 500 మంది మరణించిన పెద్ద యుద్ధాన్ని సాగించిన నేతలు వారు. వాజపేయి ప్రధాని, ముషర్రఫ్ ఆర్మీ చీఫ్. ఇరువురూ తమ ఆయుధాలను, అణు కార్యక్రమాలను ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన వారే. అంతేకాదు, అది కశ్మీర్లో అత్యధికంగా హింస చెలరేగిన కాలం కూడానని గుర్తుంచుకోవాలి. జమ్మూకశ్మీర్‌లో 2016లో సంభవించిన మరణాలతో (267) పోలిస్తే, 2001లో అంతకు 20 రెట్లు (4,507) మరణించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింతగా విషమించాయని మనం విశ్వసించేట్టయితే అందుకు కారణాలు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు మాత్రం కాదు. రాజకీయాలు, మీడియా అందుకు కారణం. జమ్మూకశ్మీర్‌లో నాటితో పోలిస్తే హింస తక్కువగా ఉన్న ఈ రోజుల్లో అలాంటి సిరీస్ జరగడమనే ఆలోచనే అద్భుతంగా ఉంటుంది. కానీ నేడు ఇరు దేశాల జనాభాల మనసుల్లో నెలకొని ఉన్న హింస, ఆనాడు నిజంగా చెలరేగిన హింస కంటే ఎక్కువగా ఉంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com