Nationalists
-
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధా వులు, జాతీయవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటున్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. 2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది. రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకి స్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తున్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది. కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాలనను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగిపోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబుతున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వసతులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తున్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రాయంతో ఆరోపిస్తు న్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియమిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వకేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు. ‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టు బడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపుతున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవుతోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరుతున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరి కకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావాలనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.జి. మురళీకృష్ణ వ్యాసకర్త పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
మీరు జాతీయవాదులా?
న్యూఢిల్లీ: దేశంలో ఆందోళనలు సృష్టిస్తున్న మూకోన్మాద ఘటనలకు పాల్పడుతున్నవారెవరూ తమను తాము జాతీయవాదులుగా చెప్పుకోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని.. సమాజ ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మూకోన్మాద ఘటనలపై రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిపైనా వెంకయ్య మండిపడ్డారు. ఈ ఘటనలకు రాజకీయ పార్టీలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మూక దాడుల ఘటనలను ఆపేందుకు చట్టం మాత్రమే సరిపోదు. సామాజిక మార్పు అవసరం. మీరు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నట్లయితే.. ఓ మనిషిని ఎలా చంపుతారు? ఓ వ్యక్తి మతం, కులం, వర్ణం, లింగం ఆధారంగా వివక్ష చూపిస్తారా? జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే పదాలకు విశాలమైన అర్థం ఉంది. మూకదాడుల ఘటనలు ఓ పార్టీ పని కాదు. మీరు ఈ వివాదాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారంటే విషయాన్ని పలుచన చేస్తున్నట్లే. ఇదే జరుగుతోందని స్పష్టంగా చెప్పగలను’ అని వెంకయ్య పేర్కొన్నారు. ‘నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. అత్యాచారాలు ఆగిపోయాయా? నేను ఈ అంశంపై రాజకీయాలు మాట్లాడటం లేదు. పార్టీలు కొన్ని అంశాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. ఒక బిల్లు ద్వారా, రాజకీయ తీర్మా నం, పాలనాపరమైన నిర్ణయంతోపాటుగా ఈ దుర్మార్గపు ఆలోచనను సమాజం నుంచి పూర్తిగా తొలగించేలా మార్పు తీసుకురాగలగాలి. ఇదే విషయాన్ని నేను పార్లమెంటులో కూ డా చెప్పాను’ అని వెంకయ్య స్పష్టం చేశారు. -
రాష్ట్ర పతాకంపై అనవసర రభస
హిందీ–హిందూ–హిందుస్థాన్ వాదాన్ని ముందుకు తోస్తూ సంకుచితంగా ఆలోచించే కుహనా జాతీయవాదులు...కర్ణాటకకు ఒక రాష్ట్ర పతాకం ఉండటం అనే భావనను వ్యతిరేకిస్తున్నారు. వారు భారతదేశాన్ని ఒకే భాష, ఒకే మతం గల దేశంగా తప్పుగా గుర్తిస్తున్నారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విశిష్ట చరిత్రలున్నాయి. ఆ కారణంగా వాటికి ప్రత్యేక గుర్తింపులూ ఉన్నాయి. ఈ అస్తిత్వాలు వ్యక్తం కావడాన్ని అనుమతించాలి. వాటికి మన రాజ్యాంగంతో ఎలాంటి వైరు«ధ్యమూ లేదు. వాటిని అణచివేయాలనడానికి ఎలాంటి కారణమూ కనబడదు. నేను, కర్ణాటకలో నివసిస్తున్న గుజరాతీని. రెండు రాష్ట్రాలకూ సొంత అస్తిత్వాలున్నాయి. నా తల్లిదండ్రులు నేటికీ నివసిస్తున్న సూరత్, 1700 వరకు ఒక అంతర్జాతీయ రేవు పట్టణంగా ఉండేది. అన్ని రకాల ప్రజలూ అక్కడ ఉండేవారు. అన్ని కులాలు, మతాలు, జాతుల వారు అక్కడికి వచ్చి, శతాబ్దాల తరబడి స్థిరపడిపోయారు. దేశీయమైన నానా రకాల కులాల వర్తక వర్గాలను కలిగిన ఏకైక భారత నగరం అదే. బనియా, జైన్, షియా బోరా, ఖోజా, సున్నీ బోరా, మెమన్, పార్సీ.. ఇలా రక రకాల వర్తక వర్గాలు అక్కడ ఉంటాయి. 1970ల నుంచి అగర్వాల్‌లు, ఓస్వాల్‌లు కూడా వేల కొలదిగా అక్కడ నివసిస్తున్నారు. మునుపటి శతాబ్దాలలోనైతే, విదేశీయులు సైతం ఆ నగరంలో నివసిస్తూ, వ్యాపారం సాగించేవారు. లియో టాల్‌స్టాయ్ ‘‘ద కాఫీ హౌస్ ఆఫ్ సూరత్’’అనే కథ రాశాడు. ఆ కథలో సూరత్‌లోని ఒక ఫలహారశాలలో, ఒక పర్షియన్, ఒక ఆఫ్రికన్, ఒక భారతీయుడు, ఒక యూదు వర్తకుడు, ఒక చైనీయుడు, ఒక తురుష్కుడు, ఒక ఇంగ్లిషువాడు కలసి భగవంతుని స్వభావాన్ని గురించి చర్చిస్తారు. ఆ కథ రాసిన 150 ఏళ్ల తర్వాత నేడు సూరత్‌లో అలాంటి గుంపు జమ కావడాన్ని ఊహించడం కూడా కష్టమే. తపతీ నది మేట వేసుకుపోవడంతో అలనాటి ఆ రేవు పట్టణం నుంచి నౌకలు అరేబియా సముద్రంలోకి పయనించే వీలు ఇక లేదు. కాబట్టి 1800ల నాటి ఆ కథ నేడు ఊహకు సైతం అందదు. సూరత్‌కు పశ్చిమాన కొత్త రేవు బొంబాయి ఉండేది. నేటి ముంబైలో అలాంటి విభిన్నమైన జాతులవారు యాదృచ్ఛికంగా ఒక చోట చేరడాన్ని ఊహించడం సాధ్యమే. బెంగళూరు, సూరత్ కంటే ఇటీవలి కాలపు నగరమే. కానీ దానికి కూడా అంతే సుసంపన్నమైన చరిత్ర ఉంది. ఆ నగరానికి అంతర్జాతీయ బ్రాండు గుర్తింపు ఉంది. నేను ప్రపంచవ్యాప్తంగా... యూరప్ లేదా ఆఫ్రికా లేదా నైరుతి ఆసియాలకు ప్రయాణాలు సాగిస్తుంటాను. ఆయా దేశాల వారు నన్ను ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుంటారు. బెంగళూరు నుంచి అని చెపితే సరిపోతుంది. సమాచార సాంకేతిక విజ్ఞానం విషయంలో ఇక్కడ జరిగిన అద్భుత కృషి కారణంగా, ఈ నగరం పేరు చెబితేనే వారికి అర్థమైపోతుంది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యాల పరిధిని దాటి కూడా ఈ నగరంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. బెంగళూరులో ఎన్నో భాషల ప్రజలున్నారు. మా ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చే మహిళ నిరక్షరాస్యురాలు. కానీ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషలలో గడగడా మాట్లాడేయగలదు. మలయాళం అర్థం చేసుకుంటుంది కూడా. ఉత్తర భారతీయుల్లో, అక్షరాస్యులలో సైతం అలాంటి వారు ఎంతో మంది ఉంటారనిగానీ, ఇలాంటి వైవిధ్యం వారి నగరాల్లో కనిపిస్తుందనిగానీ అనుకోను. ఈ వాస్తవం గురించి మా బెంగళూరువాసులం గర్విస్తుంటాం. కన్నడ భాషకు ప్రథమ స్థానం ఇవ్వాలని పట్టుబట్టడం (నేను దాన్ని సమర్థిస్తాను) ఉన్నా, ఈ నగరంలో ఇతర భాషలపట్ల గొప్ప సహనశీలత ఉంది. ఇది అత్యంత విశిష్ట లక్షణం. సుసంపన్నమైన, గర్వించదగిన కర్ణాటక రాష్ట్ర వారసత్వాన్ని ప్రతిబింబించే సంకేతాన్ని ఉపయోగించడంలో ఎలాంటి సమస్యా లేదు. హిందీ–హిందూ–హిందుస్థాన్ వాదాన్ని ముందుకు తోస్తూ సంకుచితంగా ఆలోచించే కుహనా జాతీయవాదులు... కర్ణాటకకు ఒక రాష్ట్ర పతాకం ఉండటం అనే భావనను వ్యతిరేకిస్తున్నారు. వారు భారత దేశాన్ని ఒకే భాష, ఒకే మతం గల దేశంగా తప్పుగా గుర్తిస్తున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఉపయోగించుకోవడం వల్లనే రాష్ట్ర పతాకం గురించిన ఈ సమస్య చాలా వరకు తలెత్తుతోంది. ఈ సమస్యకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన హక్కుల పరిధికి లోపలే ఉన్నారని నా అభిప్రాయం. రాష్ట్ర పతాకం, జాతీయ పతాకం కంటే దిగువన ఉంటుందని ఆయన ఇప్పటికే సుస్పష్టంగా చెప్పారు. ఈ మాటతో, రాష్ట్ర పతాకం ఏదో ఒక విధమైన వేర్పాటువాదం దిశగా వేసే తొలి అడుVýæని భావించేవారిని ఆయన ఇప్పటికే నిరాయుధులను చేసేస్తున్నారు. రాజ్యాంగపరంగా కూడా ముఖ్యమంత్రి వైఖరి పూర్తిగా సరిగ్గానే ఉంది. ఆయన నియమించిన కమిటీ కూడా ఇదే చెబుతుందని అనుకుంటాను. ‘‘భారతదేశం, రాష్ట్రాలతో కూడిన గణతంత్రంగా ఉంటుంది’’ ఇది భారత రాజ్యాంగంలోని మొట్ట మొదటి వాక్యం. కాబట్టి మనం ప్రారంభిస్తున్నదే భిన్న రాష్ట్రాలు అనే భావనను గుర్తించడం నుంచి. ఓసారి మన చుట్టూ పరికించి చూస్తే... సొంత పతాకాలను కలిగిన ఒక విధమైన ఉప జాతీయవాదం ఇప్పటికే ఉన్నదని కనిపిస్తుంది. ప్రత్యేకించి ఒక నగరానికి (చెన్నై సూపర్ కింగ్స్) లేదా ఒక రాష్ట్రానికి (కింగ్స్గీఐ పంజాబ్) చెందిన పతాకాలున్న ఐపీఎల్ జట్లున్నాయి. ఇది మరో రూపంలోని ఉప జాతీయవాదం. ఈ జట్లన్నిటికీ విడిగా వాటి సొంత పతాకాలుండటంతో మనకు సమస్యేమీ లేదు. అలాగే రాజకీయ పార్టీలు, వాటి పతాకాలతోనూ పేచీ లేదు. ఇక మనలాంటి ఇతర దేశాలను చూస్తే, ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండటం సర్వసాధారణమే. ఇది, ఈ సమస్యకు సంబంధించిన మరో అంశం. అమెరికాలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ వాటి సొంత పతాకాలున్నాయి. ఇది ఆ దేశ ఐక్యతకు ఏవిధంగానూ భంగకరమనే ఆరోపణ లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విశిష్ట చరిత్రలున్నాయి. ఆ కారణంగా వాటికి ప్రత్యేకమైన గుర్తింపులూ ఉన్నాయి. ఈ అస్తిత్వాలు వ్యక్తం కావడాన్ని అనుమతించాలి. వాటికి మన రాజ్యాంగంతో ఎలాంటి వైరు«ధ్యమూ లేదు. వాటిని అణచి వేయాలనడానికి ఎలాంటి కారణమూ కనబడదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి
అవలోకనం మహత్తరమైన మన భారత జాతీయవాదులు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వారి వెంటపడుతున్నారు. వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ లేదా మరే ఇతర ప్రేమా కాదు... విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ఏ విదేశీ పత్రికైనా చూడండి. భారత్ గురించి ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ప్రపంచం భావిస్తోంది కాబట్టి. అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. మహారాష్ట్రలో ఒక ముస్లిం శాసన సభ్యుడ్ని, అతడు ‘‘భారత్ మాతా కీ జై’’ (తల్లి భారతికి విజయం) అనడానికి బదులు ‘‘జై హింద్’’ (భారత దేశానికి విజయం) అనే అంటానని అన్నందుకు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రెండు నినాదాల మధ్య ఉన్న తేడా ఏమిటో నాకూ క చ్చితంగా తెలియదు. కానీ అది శిక్షార్హమైందనేది మాత్రం స్పష్టం. భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలని ఉర్దూ రచయితలందరినీ మార్చి 19న కోరారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’(ఎన్‌యూపీయూఎల్), ఉర్దూ రచయితలను దిగువ ప్రకటనపై సంతకం చేయాలని కోరింది: ‘నేను.........ను ........... కొడుకు/కూతురు ,........ శీర్షికగల నా పుస్తకం/పత్రికను ఎన్‌యూపీయూఎల్ ఆర్థిక సహాయ పథకం కింద పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆమోదం పొందాను. ఇందులో భారత ప్రభుత్వ విధానాలకు లేదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది, దేశంలోని వివిధ వర్గాల మధ్య ఏ విధమైన వైమనస్యానికి కారణమయ్యేది ఏదీ లేదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ దేని నుంచీ దీనికి ఆర్థిక సహాయం అందలేదు.’’ ఇదీ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపిన విషయం. జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న నాలాంటి వాళ్లకు ఈ వార్త నిరుత్సాహం కలిగించింది. నాకైతే ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో నేను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయింది. మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు. సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు. టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి దేశాలనూ అందులోకి ఈడ్చారు. రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు. కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది. మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం. మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే. వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే. ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికీ మనకున్నది సరిపోదా? నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
మన ముస్లింలు జాతీయ వాదులు
లక్నో: భారతీయ ముస్లింలు జాతీయవాదులని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఉగ్రవాదానికి వారెన్నడూ మద్దతు పలకలేదన్నారు. ఇస్లామిక్ స్టేట్ వంటి మతచాంధస ఉగ్రవాద సంస్థలకు భారత్‌లో స్థానం కల్పించలేదన్నారు. ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతంతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. మదన మోహన్ మాలవీయ మిషన్ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్.. ఉగ్రవాద సవాలును ఎదుర్కొంటున్న దేశాలన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరు సాగించాలన్నారు. ఉగ్రవాద బాధిత దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కలిసి రావాలన్నారు. టైస్టులకు టైస్టులతోనే సమాధానం చెప్పాలంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో.. ‘ఉగ్రవాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచమంతటికీ తెలుసంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నకిలీ కరెన్సీ నోట్లు ఉగ్రవాద వ్యాప్తికి ఉపయోగపడ్తున్నాయని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఆర్థిక వృద్ధికి తోడ్పడిన నిర్ణయాల్లో బ్యాంకుల జాతీయీకరణ అత్యంత ముఖ్యమైనదని ప్రశంసించారు. తమ ప్రభుత్వ ఆర్థికపరమైన నిర్ణయాల వల్ల త్వరలోనే రెండంకెల వృద్ధిరేటును అందుకోగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ మహా సంపర్క్ అభియాన్‌ను ప్రారంభిస్తూ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ‘మోదీ ఏడాది పాలనపై చర్చ మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుతుదోంది. భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారుతోందన్న విషయం విదేశీ పర్యటనల సందర్భంగా మోదీకి లభిస్తున్న స్వాగత సత్కారాల తీరును చూస్తే అర్థమవుతుంది. 2025 నాటికి భారత్ సూపర్ పవర్‌గా మారుతుంది’ అని అన్నారు.