native village
-
కైకాల మృతి.. స్వగ్రామంలో విషాదఛాయలు.. కంటతడి పెట్టిన స్నేహితులు
గుడ్లవల్లేరు: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మరణవార్తతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన స్నేహితులు, గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తరచూ తాను పుట్టి, పెరిగిన ఊరికి వచ్చేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సందడి చేసేవారని చిన్ననాటి స్నేహితులు కానూరి పూల రామకృష్ణారావు, బాడిగ ఫణిభూషణరావు, కానూరి రాజేంద్రప్రసాద్‌లు చెప్పారు. కౌతవరంలో తన తాత కంభంమెట్టు రామయ్య పేరిట ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.40లక్షల ప్రభుత్వ నిధులతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా చూశారు. కౌతవరం–చేవెండ్ర రోడ్డు నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. -
డిజిటల్ 'బాబు' సొంతూర్లో ఏటీఎం ఉందా?
తిరుపతి : నగదు రహిత లావాదేవీల ద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీగా ఎలా మార్చాలో చెప్పుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వగ్రామాన్నే గాలికొదిలేశారు. సీఎం స్వగ్రామం నారావారిపల్లిలో కనీసం బ్యాంకు కార్యాలయమే కాక, ఒక్క ఏటీఎం కూడా లేదు. నారావారిపల్లికి పక్కనున్న డజను గ్రామాలది ఇదే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ నోట్ల కోసం ఆ గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి చంద్రగిరి లేదా తిరుపతిలో పనిచేసే ఏటీఎంల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అక్కడ స్వైపింగ్ మిషన్లూ పనిచేయడం లేదు. కేవలం ఒక్క రేషన్ దుకాణదారుడు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో సబ్సిడీ బియ్యాన్ని, ఇతర నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్నాడు. నారావారిపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో రంగంపేటలో ఏటీఎం ఉన్నా.. అది ఉండీ లేనిమాదిరిగా తయారైంది. కనెక్టివిటీ సమస్యతో అది పనిచేయడం లేదు. ఓ వైపు తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 104వ ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులు ప్రసంగాల మీద ప్రసంగాలు ఇస్తున్నారు. ఆ వేదికకు కొద్దీ దూరంలోనే స్వయానా సీఎం స్వగ్రామం నారావారిపల్లినే టెక్నాలజీకి ఆమడదూరంలో పయనం సాగిస్తుండటం విడ్డూరం. -
స్వగ్రామానికి చేరిన ఆర్కే కొడుకు మృతదేహం
-
స్వగ్రామానికి సైదయ్య మృతదేహం
దామరచర్ల : బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అనుమానాస్పదస్థితిలో వా రం రోజుల క్రితం మృతిచెందిన సహా య వైద్యుడు సైదులు మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరుకుంది. దామరచర్లకు చెందిన మాచర్ల వెంకటేశ్వర్లు, కళమ్మల పెద్ద కుమారుడు మాచర్ల సైదయ్య(26) రెండేళ్ల కిత్రం మలేషియాకు వెళ్లాడు. ఆ దేశంలోని కౌలాలంపూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్‌లో గల కనేరి యా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్‌గా చేస్తూ తన నివాసంలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో.. కుమారుడిని కడసారైన చూసుకోవాలన్న తపనతో వెంకటేశ్వర్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావును సంప్రదించారు. వారు ఉన్నతాధికారులను సంప్రదించి సైదులు మృతదేహం మలేషియా నుంచి వచ్చే లా కృషిచేశారు.మృతదేహం బుధవా రం హైదరాబాద్‌కు చేరుకోగా గురువారం ఉదయం అక్కడి నుంచి దామరచర్లకు తీసుకొచ్చారు. ‘ఆత్మహత్యగా చిత్రీకరించారు’ సైదులును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు, తమ్ముడు నాగరాజు, బంధువులు ఆరోపించారు. ఉగాది పండగకు ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. చనిపోవడానికి ముందు రోజు తమతో సైదులు గంటన్నర పాటు ఫోన్లో మాట్లాడాడు.. తెల్లారేసరికి చనిపోయాడంటూ ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి.. అతడి ఒంటిపై గాయాలున్నాయి.. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ వాపోయారు. సైదులుకు ఆరు నెలల వేతనం రావాల్సి ఉందని..పాలకులు తగు చర్యలు తీసుకుని పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. కళమ్మా.. కొడుకు నీ దగ్గరికే వచ్చాడు.. వెంకటేశ్వర్లు భార్య కళమ్మ ఆరుమాసాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు కుమారుడు కూడా చనిపోవడంతో వెంకటేశ్వర్లు జీర్ణిం చుకోలేకపోయాడు. సైదులు మృతదేహం చూస్తూ భార్య చిత్రపటాన్ని పట్టుకుని ‘‘ కళమ్మా.. కొడుకు నీ దగ్గరికే వచ్చాడు చూడూ’’ అంటూ బోరు న విలపించడం అక్కడున్న వారందరీని కంటపడిపెట్టించింది. సైదులు మృతదేహాన్ని తీసుకొచ్చారనే సమాచారం తెలుసుకుని స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సైదులు మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించారు.