natu bombs
-
శ్రీకాకుళంలో పేలిన మందుగుండు సామాగ్రి
సాక్షి, శ్రీకాకుళం: ఓ ఇంట్లో దాచి ఉంచిన ముందుగుండు సామాగ్రి పేలడం జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మీ టాకీస్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి జనావాసాలు మధ్య ఉన్న ఇళ్లు కుప్పకూలింది. పరిసరాల్లోని మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అడవి పందులను వేటాడం కోసం ఆ ఇంట్లో ఉంటున్నవారు ఈ బాంబులు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంట్లో నివసిస్తున్నవారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నాటు బాంబుల తయారీ జరుగుతున్న అధికారులు గుర్తించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మార్కాపురంలో నాటు బాంబు పేలడం కలకలం
-
మార్కాపురంలో పేలిన నాటు బాంబు
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఎస్సీబీసీ కాలనీలో నాటు బాంబు పేలడం కలకలం రేపింది. ఆటోలో నుంచి నాటు బాంబు జారిపడి పేలుడు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే సదురు వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేపీ కొండారెడ్డి నివాసం ఉంది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాటుబాంబులతో ఇరువర్గాల దాడులు
గంగిరెడ్డిపాలెం (బెల్లంకొండ), చిన్న వివాదమే పెద్ద గొడవగా మారి నాటుబాంబులు విసురుకుని పది మంది గాయపడిన సంఘటన గంగిరెడ్డిపాలెం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీనివాసరావుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆసుల జగన్ కుటుంబ సభ్యులను పులిబండ్ల వెంకటేశ్వర్లు వర్గానికి చెందినవారు దూషించడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. చిన్నపాటి వివాదంగా మొదలై ఇరువర్గాలు కోపోద్రిక్తులై కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. దాడుల్లో ఇరువర్గాలకు చెందిన పది మంది పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదుచేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాసరావుగౌడ్ వెల్లడించారు.