నాటుబాంబులతో ఇరువర్గాల దాడులు | two batch's attack the natu bombs | Sakshi
Sakshi News home page

నాటుబాంబులతో ఇరువర్గాల దాడులు

Published Sat, Feb 22 2014 1:54 AM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

నాటుబాంబులతో ఇరువర్గాల దాడులు - Sakshi

నాటుబాంబులతో ఇరువర్గాల దాడులు


 గంగిరెడ్డిపాలెం (బెల్లంకొండ),
 
  చిన్న వివాదమే పెద్ద గొడవగా మారి నాటుబాంబులు విసురుకుని పది మంది గాయపడిన సంఘటన గంగిరెడ్డిపాలెం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
 
 పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీనివాసరావుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆసుల జగన్ కుటుంబ సభ్యులను పులిబండ్ల వెంకటేశ్వర్లు వర్గానికి చెందినవారు దూషించడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. చిన్నపాటి వివాదంగా మొదలై ఇరువర్గాలు కోపోద్రిక్తులై కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు    దిగాయి. దాడుల్లో ఇరువర్గాలకు చెందిన పది మంది పైగా గాయపడ్డారు.
 
 క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  ఇరువర్గాలపై కేసులు నమోదుచేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని  సీఐ శ్రీనివాసరావుగౌడ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement