natukodi
-
నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..
నాటు కోళ్లు, జాతి (పందెం) కోళ్ల పెంపకం మారుమూల గ్రామాల్లో సైతం రైతుకు ఆధారపడదగినంత స్థాయిలో నిరంతర ఆదాయాన్ని అందిస్తుందని ఓ యువజంట రుజువు చేస్తున్నారు. గత పదేళ్లుగా శ్రద్ధగా ఈ పని చేస్తే ప్రజలకు ఆరోగ్యదాయకమైన మాంసం, గుడ్లను అందించటంతోపాటు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు రైతు దంపతులు ఉపేందర్‌రావు, జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడేనికి చెందిన నిరుద్యోగులైన మూలగుండ్ల ఉపేందర్‌రావు, వజ్జా జ్యోతి పదేళ్ల క్రితం ఇంటి వద్ద ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని నాటు, పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. చుట్టూ కోళ్ల ఎగిరి పోకుండా ఎత్తు జాలీ ఏర్పాటు చేశారు. నీడ కోసం పరిసర ప్రాంతంలో వివిధ రకాల చెట్లను పెంచారు. కోళ్ల మధ్యకు మాములు రాకుండా చూసేందుకు సీమ కోళ్లను, రెండు కుక్కలను పెంచారు. కొన్నేళ్ల క్రితం 20 జాతి (పందెం) కోడి పిల్లలను పలు ప్రాంతాల నుంచి సేకరించి పెంచటం మొదలుపెట్టారు. వీటి గుడ్లను సాధారణ కోళ్లకు వేసి పొదిగించి పిల్లలు తీసి సంతతిని పెంచారు. తదనంతరం ఇంక్యుబేటర్‌ను సమకూర్చుకొని పందెం కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. పిల్లల సైజును బట్టి వివిధ ధరలకు అమ్ముతున్నారు. 8 రకాల జాతి కోళ్లుకోళ్లను 24 గంటలూ కనిపెట్టుకొని ఉండి అన్ని పనులూ ఉపేందర్‌రావు, జ్యోతి చేసుకుంటారు. వీరి వద్ద మార్కెట్లో మార్కెట్లో గిరాకీ ఉన్న నెమలి, కాక, డేగ, రసంగి, అబ్రాస్, సీత్వాల్, కెక్కర, ఎర్ర కెక్కర వంటి అనేక రకాల జాతి కోళ్లను వీరు పెంచుతున్నారు. రెండు వందల పెట్టలు, పుంజులు ఉన్నాయి. ఇవి దాణా కంటే ఆకుకూరలను ఎక్కువగా తింటున్నాయి. ఇంటి పరిసరాల్లో పలు రకాల ఆకుకూరలను,మునగాను పెంచి వీటికి మేపుతున్నారు. ఫామ్ హౌస్ యజమానులు జాతి కోళ్లను ఆసక్తితో పెంచుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసుకెళుతున్నారు. కిలో బరువు గల జాతి కోడి రూ. 4 నుంచి 5 వేలు పలుకుతోంది. నెలలోపు చిన్న పిల్లలైతే రూ. 300 వరకు పలుకుతోందని ఉపేందర్ రావు తెలిపారు. మునగాకుతో జబ్బులకు చెక్!మొదట్లో కడక్‌నా«ద్ కోళ్ల పెంపకం చేపట్టాం. మారుమూల ప్రాంతం కావటంతో వాటికన్నా జాతి (పందెం) కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం వస్తోంది. జాతి కోడిగుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పోదిగించి పిల్లలను అమ్మటం వల్ల మంచి ఆదాయం పొందుతున్నాం. రెండు, మూడు సార్లు మందులు వాడితే ఈ కోళ్లకు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా మునగ ఆకు తినిపిస్తే కోళ్లకు జబ్బులు వచ్చే ఛాన్సే లేదని ఉపేందర్‌రావు(95023 48987) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. – ఇల్లెందుల నాగేశ్వరరావు, సాక్షి, ఇల్లెందు (చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!) -
ఆన్లైన్లో అమ్మకానికి నాటుకోడి.. దేశంలోనే తొలిసారిగా
నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్! ముఖ్యంగా చికెన్‌ని లొట్టలేసుకుంటే తినేవారికయితే ఇదీ ఎంతో నచ్చే విషయం. నిఖార్సైన నాటుకోడి మాంసం ఆర్డర్ వేస్తే చాలు మీ ఇంటికి వచ్చేస్తుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నాటుకోడి మాంసం ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది కంట్రీ చికెన్ కో సంస్థ. ప్రస్తుతం మూడు సెంటర్ల నుంచి ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఐదు రకాలు కంట్రీ చికెన్ కో సంస్థ క్లాసిక్ ఆంధ్రా, టెండర్ తెలంగాణ, మైసూర్ క్వీన్, వారియర్, కడక్‌నాథ్ వెరైటీల్లో నాటుకోడి మాంసం అందిస్తోంది. పూర్తిగా సహాజ పద్దతుల్లో పెంచిన నాటుకోడి మాంసాన్నే విక్రయిస్తామని కంట్రీ చికెన్ కో హామీ ఇస్తోంది. కేజీ ఎంతంటే కంట్రీ చికెన్ కో వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం కేజీ మాంసానికి కడక్‌నాథ్ రూ. 909, క్రాసిక్ ఆంధ్రా రూ. 584, టెండర్ తెలంగాణ రూ. 487, మైసూర్ క్వీన్ రూ.552లుగా ఉంది. ఇందులో మైసూర్ క్వీన్ వెరైటీలో కోడిపెట్టెల మాంసం లభిస్తుంది. పూర్తిగా సహాజసిద్ధమైన ఆహారం ఈ కోళ్లకు అందిస్తున్నారు. పందెం కోడి కంట్రీ చికెన్ కో అందిస్తున్న నాటు కోడి మాంసం వెరీట్లో పందెం కోడి రకానికి చెందిన వారియర్ అత్యంత ఖరీదైనది. వారియర్ నాటుకోడి మాంసం కేజీ రూ.2599లగా ఉంది. ఈ వారియర్ రకం చికెన్ కోసం 1.9 కేజీ నుంచి 2.4 కేజీల బరువు ఉండే పంండె కోడిని మాంసం కోసం ఉపయోగిస్తారు. ఈ పందెం కోళ్లకు దానాగా బాదంపప్పు, జీడిపప్పు వంటివి ఖరీదైన డ్రైఫ్రూట్స్ అందిస్తారు. ఆర్డర్ చేస్తే చాలు కంట్రీ చికెన్ కో వెబ్‌సైట్‌కి వెళ్లి నచ్చిన వెరెటీకి చెందిన చికెన్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. బోయిగూడ, ప్రగతినగర్, దిల్సుఖ్నగర్లలో ఈ సంస్థకు బ్రాంచీలు ఉన్నాయి. అక్కడి నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ సేవలు అందిస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ! -
ఈ కోడి కొవ్వు తక్కువ.. రుచి ఎక్కువ
తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సయిన నలుపు రంగు కోడి. మటన్‌కు పోటాపోటీగా గిరాకీ. నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్ కోళ్లతో పోల్చితే పోషకాలలో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్న ఈ నల్ల కోడి పేరు ‘కడక్‌నాథ్’. సాక్షి, అమరావతి: నాటుకోడి మాంసానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. అయితే నాటుకోడిని తలదన్నేలా కడక్‌నాథ్ అనే ఈ ప్రత్యేక జాతి నాటు కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ధారా, జాబియా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వంటి గిరిజన ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. రంగు, రుచితో పాటు ఈ కోళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ‘మెలనిన్’ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వలనే ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మార్కెట్లో కడక్‌నాథ్ కోడి మాంసం ధర కిలో అక్షరాల రూ.800లు పైమాటే. మాంసమే కాదు.. ఈ కోడి గుడ్డు కూడా కాస్ట్లీనే. ఒక్కొక్క గుడ్డు రూ.20 పైనే పలుకుతోంది. ఎన్నో ‘లాభాలు’ సాధారణ బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో ప్రొటీన్స్/ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ మాత్రం చాలా తక్కువ. మాంసంలోనే కాదు ఈ కోడి గుడ్డులో కూడా అత్యధిక శాతం ప్రొటీన్లు, లినోలెయిక్ యాసిడ్లు ఉన్నాయి. ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన తెగుళ్లు పెద్దగా వీటి దరి చేరవు. ఏ వాతావరణంలోనైనా ఇవి పెరుగుతాయి. ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, సజ్జలు ఇలా ఏవైనా తిని జీర్ణించుకోగలుగుతాయి. ఇలా.. పోషకాలు అందిస్తూ వినియోగదారునికి, లాభాలు తెచ్చిపెడుతూ పౌల్ట్రీ రైతులకు కడక్‌నాథ్ కోళ్లు ప్రయోజనకరంగా ఉన్నాయి. రూ.2 కోట్లతో ప్రాజెక్టు మంచి రుచితో పాటు అత్యధికంగా పోషకాలను అందించే ఈ కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని మన రాష్ట్రంలో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ జిల్లా ఊటుకూరు వద్ద మూతపడిన కోళ్ల ఫారంను పునరుద్ధరించి కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పౌల్ట్రీ ఫారం నిర్వహణ కోసం కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వీఏఎస్, పారావెట్ పోస్టులను కూడా మంజూరు చేశారు. ఈ పౌల్ట్రీఫారం ద్వారా వేల సంఖ్యలో కడక్‌నాథ్ కోడి పిల్లలను ఉత్పత్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా వాటి పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు వ్యయమవుతుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. నెలకు 10 నుంచి 18 గుడ్లు సాధారణ కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ప్రస్తుతం లైవ్ కోడి ధర కిలో రూ.650లు ఉంటే, మాంసం రూ.800 పైగా పలుకుతోంది. ఇంట్లో తినేందుకు వాడే ఈ కోడి గుడ్డు ధర రూ.20కి పైగా పలుకుతుంటే.. పిల్లలు పొదిగే గుడ్డు ధర రూ.40 పైమాటే. తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఎంతో లాభదాయకం. 2017లో 500 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫారం ప్రారంభించా. నేడు 1,500 కోళ్లతో నడుపుతున్నా. నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు. రైతు బజార్ల నుంచి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, మూడు పూటలా నీళ్లు పెడతానంతే. వీటికి వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగాల బెడద ఉండదు. 4–5 నెలల తర్వాత కోడి.. మాంసానికి సిద్ధమవుతుంది. మా ఫారం నుంచి ఈ కోళ్లనే కాకుండా కోడి మాంసాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నా. కోడి పిల్లలను అయితే ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నా. రూ.లక్షతో మొదలైన వ్యాపారం నేడు రూ.20 లక్షలకు చేరింది. – ఇంటి ప్రదీప్, ప్రదీప్ ఫామ్స్ యజమాని, నున్న, కృష్ణా జిల్లా. -
ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..
వారం.. వర్జ్యంతో పనిలేదు.. పగలు.. రాత్రి అన్న తేడా లేదు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా... ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు. నీసు లేకుంటే.. జిల్లా వాసులకు పూటగడవం లేదు.. అతిశయోక్తిగా అనిపిస్తున్నా.. ఇదే నిజం. ఎందుకంటే జిల్లాలో మాంసం వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. స్థోమతను బట్టి ఎవరికి వారు చికెన్, మటన్..చేపలు.. రొయ్యలు అంటూ.. లాగించేస్తున్నారు. జిల్లాలో గతంలో (కరోనా లాక్‌డౌన్‌కు ముందు) వారంలో సగటున 2 లక్షల నుంచి 3 లక్షల కేజీల వరకు ఉన్న మాసం వినియోగం ప్రస్తుతం.. సగటున 4 లక్షల నుంచి 5 లక్షల కేజీలకు చేరడమే ఇందుకు నిదర్శనం. సాక్షి, చిత్తూరు: జిల్లాలో మాంసం వినియోగం భారీగా పెరిగింది. మేక, గొర్రె, కోడి, కముజు పిట్టల అమ్మకాలు రోజురోజుకూ ఎక్కువౌతున్నాయి. జిల్లాలో ప్రధాన మేకల సంత అయిన తిరుపతికి ప్రతి శనివారం వేల సంఖ్యలో వచ్చే మేకలు, గొర్రెలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఆదివారం మేకల, గొర్రెల మాంసం వినియోగం సుమారు 50 వేల కిలోల వరకు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం జిల్లాలో బోన్ మటన్ ధర కిలో రూ 660, బోన్‌లెస్ రూ. 750 నుంచి 800 వరకు ఉంది. వ్యాపారులు వీటిని ఎక్కువగా తిరుపతి న్యూ బాలాజీ కాలనీ సమీపంలోని మేకల సంతలో కొనుగోలు చేస్తారు. ఇవికాకుండా మొక్కుబడుల కోసం కొనుగోలు చేసే జీవాలు 500 నుంచి 800 వరకు ఉంటాయని తెలుస్తోంది. మాంసం ధరలు పెరిగినా కొనేందుకు మాత్రం వినియోగదారులు వెనుకడుగు వేయడం లేదు. చికెన్‌కే ప్రాధాన్యం.. చికెన్ కంపెనీల గుత్తాధిపత్యంతో కోడి మాంసం ధర విపరీతంగా పెరిగింది. అదే విధంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి చికెన్ ద్వారా లభిస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో మాసం ప్రియలు రెచ్చిపోతున్నారు. అయిన దానికి.. కానిదానికి.. చికెన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో కోళ్ల ఫారాలు సుమారు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటిలో సుమారు 1.80 లక్షల బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. మిగిలిన చోట్ల లేయర్ కోళ్లు పెంచుతున్నారు. జిల్లాలో లైవ్, స్కిన్, స్కిన్లెస్ పేరిట కోడి మాంసం వినియోగం జరుగుతోంది. జిల్లాలో రోజుకు లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలు సాగుతున్నాయి. ఇక నాటుకోడి మాంసం కిలో రూ. 500 వరకు పలుకుతుండగా.. గ్రామాల్లో కిల్లో రూ. 350 వరకు ఉంటోంది. దీంతోపాటు కముజు పిట్టల మాంసం వినియోగం కూడా పెరిగింది. పిట్ట ఒకటి రూ. 40 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో ధర రూ. 400 చొప్పున పిట్టమాసం వినియోగం రోజుకు 1000 కిలోల వరకు ఉంటోంది. ఇక జిల్లా వాసులు మాసం వినియోగం కోసం రోజూ సగటున కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) సమతుల్యత అవసరం ఆహార విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారంతో పాటు, ఆకుకూరలు తప్పని సరిగా క్రమపద్ధతిలో తీసుకోవడం మంచిది. మేక మాంసం, కోడి మాంసం తీసుకోవడం వల్ల కరోనా వ్యాధిని కట్టడి చేయవచ్చని కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు, వారానికి రెండు నుంచి మూడు రోజులు మాంసాహారం తీసుకుంటే వాటికి సరిసమానంగా కాయకూరలు, ఆకు కూరలు కూడా తీసుకోవాలి. తద్వారా పోషకాల్లో సమతౌల్యత వస్తుంది. – డాక్టర్ రవిరాజు, కోవిడ్–19 నోడల్ అధికారి, కార్వేటినగరం -
ఇంటి కోడి.. లాభాల ఒడి
► ఆసక్తి ఉంటే చాలు తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ► మామునూరులో కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ► ఏటా 1.20లక్షల పిల్లల ఉత్పత్తి మామునూరు(వర్ధన్నపేట) : జీవనోపాధికి చాలా మార్గాలు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అట్టడుగు వర్గాల వారు, నిరక్షరాస్యులకు అవి అందుబాటులో ఉండవు. ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో పశు సంవర్థక శాఖ ముందుం టోంది. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎవరి పనులు వారు చేసుకుంటూనే ఇంటి వద్ద ఎంచుకోదగిన తేలికైన ఉపాధి మార్గమే పెరటి కోళ్ల పెంపకం. మామునూరులో ఉత్పత్తి కేంద్రం వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరులో వనరాజా, గిరిరాజ, రాజశ్రీ ఇతర కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. 2007లో దీనిని ప్రారంభించగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి వనరాజా కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఇది ఒక్కటే కావడం విశేషం. గుడ్లను హ్యాచింగ్ చేసేందుకు 10వేల గుడ్లను స్టోరేజీ సామర్థం కలిగిన ఇంక్యుబేటర్ ఏర్పాటు చేశారు. ఇంక్యుబేటర్‌లో 18 రోజుల వరకు గుడ్లను పొదిగి ఆ తర్వాత 5వేల గుడ్ల సామర్థ్యం కలిగిన హాచింగ్ యూనిట్లోకి మారుస్తారు. అందులో మూడు రోజులపాటు ఉంచుతారు. మొత్తం 21 రోజుల పాటు కృత్రిమంగా పొదిగించిన తర్వాత పిల్ల లు బయటకు వస్తాయి. బ్రూడింగ్(పెంచడం) చేసిన అనంతరం అవసరం ఉన్నవారికి అందజేస్తున్నారు. ప్రతీనెల ఉత్పత్తి అయిన కనీసం 10వేల కోడి పిల్లలను రఘనాథపల్లి మండలం కోమళలో ఉన్న మదర్ యూనిట్ ద్వారా అందజేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడి వనరాజా, గిరిరాజా, గ్రామప్రియ, రాజశ్రీ కోడిపిల్లలు సబ్సిడీపై సరఫరా అవుతున్నాయి. ఈ ఫామ్‌లో ఏడాదికి రూ.1.20లక్షల పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. వనరాజా పెరటి కోళ్లను వివిద శాఖల అధికారులు రాయితీపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీపై అందజేస్తున్నారు. సబ్సిడీ ఇలా.. పెరటికోళ్ల పెంచుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు, యువత, మహిళలు మార్చి, ఏప్రిల్, మే నెలలో ముందుగా మండల పశువైద్యాధికారిని సంప్రదించి ధరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి మండలానికి 20 నుంచి 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లా అధికారి ఆమోదం తెలిపిన జాబితా వచ్చాక మండల పశువైద్యశాఖ అధికారుల ద్వారా మామునూరు కోళ్ల ఉత్పత్తి కేంద్రంలో 45 కోళ్ల చొప్పున సబ్సిడీపై అందజేస్తారు. రెండు విడతలుగా 25, 20 కోళ్లను పంపిణీ చేస్తారు. 4–6వారాల వయస్సు ఉన్న ఈ పిల్లలకు ఒక్కో దానికి మొత్తం ధర రూ.68 ఉండగా.. రూ.50 సబ్సిడీ పోగా రూ.18 చెల్లిస్తే కోళ్లు ఇస్తారు. వనరాజా కోళ్ల పెంపకం.. గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకోవడానికి వనరాజ కోళ్లు అనుకూలం, లాభదాయకం. పెంపకం ఖర్చులు చాలా తక్కువగా ఉండడంతో పాటు గుడ్డు పెద్దసైజులో వస్తుంది. ఆరు వారాల వయస్సులో కోడి 700 నుంచి 850 గ్రాముల బరువు ఉంటే దేశవాళీ కోడి కేవలం 250నుంచి 400వరకు బరువు ఉంటుంది. దేశవాళీ కోడిగుడ్లు బరువు కేవలం 28నుంచి 40గ్రాముల మధ్యలో ఉంటాయి. పెరటికోళ్ల రకాలు.. వనరాజా, గిరిరాజా, గ్రామరాజా, రాజశ్రీ కోళ్లు ఆత్యంత ఆకర్షణ లక్షణాలతో రంగు ల రెక్కలతో ఉంటాయి. వీటికి అధిక రోగ నిరోధక శక్తి ఉంటుంది. పెద్ద సైజు గుడ్లు ఉత్పాదన, పెంపంకంపై ఖర్చు తక్కువ, ఎక్కువ రోజుల వరకు బతికే కలిగే సామర్థ్యం వీటి గుడ్లను దేశీ కోళ్లు కూడా పొదగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. పెంపకంలో జాగ్రత్తలు 4–6వారాల వయస్సు దాటిన తర్వాత వీటీని పెరట్లో పెంపకానికి విడిచిపెట్టొచ్చు. సాయంకాలం ఆయ్యే సరికి ఇవి తమ గూటికి చేరుకునేటట్టు మొదటి నుండే అలవాటు చేయాలి. రోగాల బారిన పడినప్పుడు ఒక డోసు వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పెరటి కోళ్ల పెంపకం అత్యంత లాభదాయకం. మండల పశువైద్యాధికారి అందించిన జాబితా ప్రకారం సబ్సిడీపై లబ్ధిదారులకు కోళ్లను అందజేస్తాం. మనరాజా కోడి పిల్లలు అవసరం, ఆసక్తి ఉన్న వారు నేరుగా లేక 98490 01612 నంబర్లో సంప్రదించవచ్చు. వనరాజా కోళ్లు పెంపకం చేపడితే అదనపు అదాయం సమకూరుతుంది. తక్కువ కాల పరిమితిలో మంచి మాంసం, గుడ్ల ద్వారా సంపాదన లభిస్తుంది. వీటి పెంపకంలో ఖర్చు కూడా చాలా తక్కువ.– డాక్టర్ ఎం.డీ.జాకీర్ అలీ, ఫాం ఇన్చార్జి -
మరో పాతికేళ్లు ఇలాగే అలరించాలి : వెంకటేశ్
‘‘నాటుకోడి’ టైటిల్ మాసీగా, ఎనర్జిటిక్‌గా ఉంది. పాతికేళ్లుగా శ్రీకాంత్ ఎన్నో మంచి చిత్రాల్లో నటించి, మెప్పించారు. మరో పాతికేళ్లు తను ఇలాగే నటించి అందర్నీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో వెంకటేశ్. శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానికృష్ణ దర్శకత్వంలో బందరు బాబీ, నానికృష్ణ నిర్మించిన చిత్రం ‘నాటుకోడి’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయగా, వెంకటేశ్ స్వీకరించారు. తలసాని మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్ ఒక కమిట్మెంట్తో పైకొచ్చాడు. స్వయంకృషితో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం సక్సెస్ అయి టీమ్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘మొదటిసారి అవినీతి పోలీసాఫీసర్‌గా నటించా. గతంలో నానికృష్ణ, నా కాంబినేషన్లో వచ్చిన ‘దేవరాయ’లా ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల్లో మా ‘నాటుకోడి’ ఓ భాగం అవుతుంది’’ అని నానికృష్ణ అన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, హీరో తరుణ్, నటులు కోట శ్రీనివాస రావు, శివాజీరాజా, సంగీత దర్శకుడు రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.