Natural Skin
-
మచ్చలను తుడిచేద్దాం...
బ్యూటిప్స్ ప్రతిరోజూ ఉదయం ముందుగా చన్నీటితో ముఖం కడిగి టొమాటో రసం, నిమ్మరసం మిశ్రమాన్ని ముఖానికి రాయాలి (ఒక బాటిల్లో తాజా టొమాటోరసం అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి రోజూ వాడవచ్చు). ఈ మిశ్రమాన్ని కాటన్‌తో కాని వేళ్లతో కాని అప్లయ్ చేయాలి. పది నిమిషాలకు లేదా ఆరిన తర్వాత చన్నీటితోనే తుడిచేయాలి. ఇది నేచురల్ స్కిన్‌కి మంచి టోనర్. ఇది ముఖం మీది నల్లమచ్చలతో పాటు అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుంది. మచ్చలను తొలగించడంలో చందనం చక్కగా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిలో తగినంత పన్నీటిని కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చన్నీటితో తడిపి వలయాకారంగా రుద్దుతూ కడగాలి. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండేసిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి. నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, మొటిమలు అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది. రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి, రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. -
నాచురల్ ఫేస్‌మాస్క్
పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి లేదా టేబుల్ స్పూన్ తాజా పాలు ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ బ్రష్‌తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఇది నాచురల్ స్కిన్‌కూ పొడిచర్మానికి కూడా చక్కగా పని చేస్తుంది. ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద నల్ల మచ్చలు పోవాలంటే... నిమ్మరసంలో కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి. రాత్రంతా ఉంచడం సాధ్యం కాకపోతే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఇలా ఇలా వారానికి రెండు - మూడు సార్లు చేస్తుంటే ముఖం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం తెలుపుదనం సంతరించుకుంటుంది.