Naval armed dipo
-
పాక్ నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బీఎల్ఏ దాడి
పాకిస్తాన్‌లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడికి తెగబడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడింది. బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బీఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖీ నేవల్ బేస్‌లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పీఎన్ఎస్ అనేది పాక్‌లోని రెండవ అతిపెద్ద నేవీ స్థావరం. పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు. సోమవారం రాత్రి దాడి ప్రారంభంకాగా ఇప్పటికీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సమాచారం. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ ఉదంతంపై పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టర్బాట్‌లోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యులను అప్రమత్తం చేశారు. దీనికి ముందు జనవరి 29న గ్వాదర్‌లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి జరిగింది. కాగా తాజాగా టర్బాట్లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. After the passage of 7 hours, the BLA Majeed Brigade still continues to hold control of the PNS Siddiqui Naval Base in #Turbat city. Firing and explosions continue, BLA fighters reportedly destroy drone operating systems at base source police pic.twitter.com/W68QW8w2os — Benjimen Baluch (@BaluchBenjimen) March 26, 2024 -
చాపకింద నీరులా...
ఎన్‌ఏడీకి యథేచ్ఛగా ప్రణాళికలు పనులకు వెళ్తున్నా... ప్రజల్లో గుబులు ప్రతిపాదిత గ్రామస్తుల ఆందోళన దత్తిరాజేరు : మండలంలో నేవల్ ఆర్మ్డ్ డిపో(ఎన్ఏడీ) ఏర్పాటుకు చాపకింద నీరులా ప్రణాళికలు రచిస్తున్నారు. స్థానికుల సమ్మతితో ప్రమేయం లేకుండా పనులు చేపట్టేస్తున్నారు. ఈ విషయం సామాజిక మాద్యమంలో విస్తతంగా ప్రచారం జరగడంతో ఎన్ఏడీ ప్రతిపాదిత మరడాం, కోమటిపల్లి, వింద్యవాసి, కె.కష్ణాపురం, గుచ్చిమి, భోజరాజపురం, ఎస్.చింతలవలస, పాచలవలస గ్రామాల్లోని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు ఉభాలు విస్తతంగా సాగుతున్నా... కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు. రక్షణ శాఖ అధికారులు ఏ క్షణాన ఏం బాంబు పేలుస్తారోనన్న కలవరం వారిలో మొదలైంది. నమ్ముకున్న భూముల్ని వదలుకోవాలా? ఇన్నాళ్లూ తమను ఆదుకుని తమకు ఇంత కూడు పెడుతున్న భూముల్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. ఈ ఎనిమిది గ్రామాల రైతులేగాకుండా సరిహద్దుప్రాంత రైతుల్లో సైతం భయం పట్టుకుంది. అవసరమైతే ఆందోళనకు అంతా కలసి సమాయత్తం కావాలని యోచిస్తున్నారు. వీరికి వివిధ ప్రజాసంఘాల నుంచి సైతం మద్దతు లభిస్తుండటంతో ఇక న్యాయపోరాటానికి కూడా వెనుకాడేది లేదని చెబుతున్నారు. ప్రాణాలు పోయినా: సుమల వెంకటప్పలనాయుడు, ఎన్ఏడీ తిరుగుబాటు నేత ప్రశాంతంగా ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజల్లో భయాందోళన సష్టిస్తున్నారు. ఈ భూముల్ని రక్షణశాఖ అధికారులకు కట్టబెడతారని విస్తతంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ఎన్ఏడీ ఏర్పాటు చేస్తామన్న వార్తలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. భూముల్ని రక్షించుకోవడానికి ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోం. ప్రాణాలను సైతం పణంగాపెట్టయినా రక్షించుకుంటాం. – సుమల వెంకటప్పలనాయుడు, ఎన్ఏడీ తిరుగుబాటు నేత