చాపకింద నీరులా...
చాపకింద నీరులా...
Published Mon, Jul 25 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
ఎన్‌ఏడీకి యథేచ్ఛగా ప్రణాళికలు
పనులకు వెళ్తున్నా... ప్రజల్లో గుబులు
ప్రతిపాదిత గ్రామస్తుల ఆందోళన
దత్తిరాజేరు : మండలంలో నేవల్ ఆర్మ్‌డ్ డిపో(ఎన్‌ఏడీ) ఏర్పాటుకు చాపకింద నీరులా ప్రణాళికలు రచిస్తున్నారు. స్థానికుల సమ్మతితో ప్రమేయం లేకుండా పనులు చేపట్టేస్తున్నారు. ఈ విషయం సామాజిక మాద్యమంలో విస్తతంగా ప్రచారం జరగడంతో ఎన్‌ఏడీ ప్రతిపాదిత మరడాం, కోమటిపల్లి, వింద్యవాసి, కె.కష్ణాపురం, గుచ్చిమి, భోజరాజపురం, ఎస్.చింతలవలస, పాచలవలస గ్రామాల్లోని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు ఉభాలు విస్తతంగా సాగుతున్నా... కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు. రక్షణ శాఖ అధికారులు ఏ క్షణాన ఏం బాంబు పేలుస్తారోనన్న కలవరం వారిలో మొదలైంది.
నమ్ముకున్న భూముల్ని వదలుకోవాలా?
ఇన్నాళ్లూ తమను ఆదుకుని తమకు ఇంత కూడు పెడుతున్న భూముల్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. ఈ ఎనిమిది గ్రామాల రైతులేగాకుండా సరిహద్దుప్రాంత రైతుల్లో సైతం భయం పట్టుకుంది. అవసరమైతే ఆందోళనకు అంతా కలసి సమాయత్తం కావాలని యోచిస్తున్నారు. వీరికి వివిధ ప్రజాసంఘాల నుంచి సైతం మద్దతు లభిస్తుండటంతో ఇక న్యాయపోరాటానికి కూడా వెనుకాడేది లేదని చెబుతున్నారు.
ప్రాణాలు పోయినా: సుమల వెంకటప్పలనాయుడు, ఎన్‌ఏడీ తిరుగుబాటు నేత
ప్రశాంతంగా ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజల్లో భయాందోళన సష్టిస్తున్నారు. ఈ భూముల్ని రక్షణశాఖ అధికారులకు కట్టబెడతారని విస్తతంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ఎన్‌ఏడీ ఏర్పాటు చేస్తామన్న వార్తలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. భూముల్ని రక్షించుకోవడానికి ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోం. ప్రాణాలను సైతం పణంగాపెట్టయినా రక్షించుకుంటాం.
– సుమల వెంకటప్పలనాయుడు, ఎన్‌ఏడీ తిరుగుబాటు నేత
Advertisement
Advertisement