navami
-
నా పక్కన రెండు దెయ్యాలు కూర్చున్నాయి.
-
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య!
అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠితుడైనప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ఈనెలలో రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీనితోపాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్‌కు అనుసంధానించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
'నాంది' ఫేమ్ నవమి గాయక్ ఫోటోలు
-
నా బెండ్ తీశాడు
‘‘చాలా రోజుల తర్వాత మరోసారి నన్ను ఆర్టిస్ట్‌గా గుర్తించే సినిమా ఇది. ‘గమ్యం’ తర్వాత నాకు మరో మొమరబుల్ మూవీ అవుతుంది. విజయ్ టాలెంట్ ఏంటో షూటింగ్ మొదలైన రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోయింది. విజయ్ నా బెండు తీశాడు (నవ్వుతూ). ఆయన దర్శకత్వంలో ఇదే బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి ముఖ్య పాత్రల్లో సతీష్ వేగేశ్న నిర్మించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి తేజ్ ‘బ్రీత్ ఆఫ్ నాంది’ (టీజర్)ని విడుదల చేశారు. సాయి తేజ్ మాట్లాడుతూ – ‘‘నరేశ్ అన్న నటించిన ‘నేను’, ‘గమ్యం’, ‘మహర్షి’ సినిమాల్లో ఆయన నటన నాకు చాలా ఇష్టం. ‘నాంది’ టీజర్ చాలా బాగుంది. నా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకి విజయ్ చాలా హెల్ప్ చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో కూడా ఎంతో రిస్క్ చేసి షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. విజయ్ కనకమేడల మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బ్రీత్ ఆఫ్ నాంది’కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిçస్తున్నాను’’ అన్నారు. -
నవమి నాటికి మూలమూర్తులకు బంగారు కవచం
* 12 కేజీల బంగారం వితరణ ఇచ్చిన బెంగళూరు భక్తుడు * 15న చినజీయర్ స్వామి రాక * విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ జ్యోతి భద్రాచలం : భక్తరామదాసు ప్రతిష్ఠించిన భద్రాద్రి రాములోరు (గర్భగుడిలోని మూలవరులు) ఇక స్వర్ణ కవచంతో మెరిసిపోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న జరిగే శ్రీసీతారాముల పెళ్లి రోజున (శ్రీరామనవమి) బంగారు కవచాన్ని వారికి అలంకరించనున్నారు. బెంగళూరుకు చెందిన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ భక్తుడు 12 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి తమకు అందజేశారని దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భద్రాద్రి ఆలయంలోని గర్భగుడిలో ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు ఈ కవచాన్ని అలంకరిస్తామని చెప్పారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వర్ణ కవచం తయారీని ప్రముఖ స్థపతి పాకున్నం రామన్‌కుట్టి దండపాణికి అప్పగించినట్లు తెలిపారు. శ్రీరామనవమి నాటికి మూలవరులకు వజ్రాలతో పొదిగిన స్వర్ణ కవచాన్ని అలంకరిస్తామని వివరించారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా ఈ నెల 10 నుంచి 18 వరకు కీలక ఘట్టం ఉంటుందని, ఈ నెల 15న చినజీయర్ స్వామి హాజరుకానున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి ప్రత్యేక వేడుకలు... ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మాట్లాడుతూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శతవర్ష ప్రయుక్త సువర్ణ భద్రకవచ సమర్పణాత్మక నవాహ్నిక శ్రీరామ మహాక్రతువు వేడుకలు ఈ నెల 10 నుంచి 18 వరకు కొనసాగిస్తామని తెలిపారు. 350 ఏళ్ల కిందట భక్త రామదాసు వారి ఆచార్యులైన రఘునాథ భట్టాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ప్రాచీన దివ్య ఉత్సవమూర్తులకు అలంకరణ చేయనున్న సువర్ణ భద్ర కవచ సమర్పణ మహాక్రతువులో భాగంగా చివరి తొమ్మిది రోజుల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు రోజుకు 12 వేల సార్లు శ్రీరామ మహామంత్రం హవనం, పంచగవ్యాభిషేకం చేస్తామని తెలిపారు. తొలిరోజు బాలకాండ, రెండవ, మూడవ రోజు అయోధ్యకాండ, 4వ రోజు అరణ్యకాండ, 5వ రోజు కిష్కిందకాండ, 6వ రోజు సుందరకాండ, 7, 8 రోజుల్లో యుద్ధకాండ, 9వ రోజు మహాపుర్ణాహుతి ప్రతిష్ఠాంగ మహాపట్టాభిషేకం నిర్వహిస్తామని వేదపండితులు వివరించారు. కార్యక్రమంలో పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్ పాల్గొన్నారు. -
‘నవమి’కి ప్రత్యేక ఏర్పాట్లు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలంలో ఏప్రిల్ 8, 9 తేదీలలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ ఎం.రఘునాధ్ తెలిపారు. ఈ ఏర్పాట్ల వివరాలను ఆయన బుధవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే... కల్యాణం జరిగే మిథిలా స్టేడియంలో చివరి సెక్టార్లలో కూర్చున్న భక్తులందరికీ స్వామి వారి కల్యాణం కనిపించేలా 40 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్లు 20 వరకూ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవి కాకుండా, స్టేడియం చుట్టూ మరికొన్ని పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తాం. స్టేడియం లోపల 40 కూలర్లను సిద్ధం చేస్తున్నాం. వంద రూపాయల సెక్టార్లలో భక్తుల కోసం పందిళ్ల ఎత్తును పెంచుతున్నాం. రూ.45లక్షల వ్యయంతో ఇంజనీరింగ్ పనులు చేయిస్తున్నాం. వీటిలో పది పనులకు టెండర్లు ఖరారయ్యాయి. మరో ఐదు పనులకు రీ-టెండర్లను 17వ తేదీన నిర్వహిస్తాం. భక్తుల కోసం వసతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లను, షామియానాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాం. ఐదు రూపాయలకే రెండు ముత్యాలతో తలంబ్రాలు విక్రయిస్తాం. స్వామి వారి ముత్యాల తలంబ్రాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది. అందుకే, వీటిని సామాన్య భక్తులకు కూడా అందించేందుకు కేవలం ఐదు రూపాయలకే విక్రయించాలని నిర్ణయించాం. దీని కోసం 100 కేజీల ముత్యాలు, 100 క్వింటాళ్ల బియ్యంతో ఆరులక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాం. ఈ పనులు వసంతోత్సవం తరువాత ప్రారంభమవుతాయి. గతేడాది 2.5 లక్షల లడ్డూలు విక్రయించాం. ఈ ఏడాది మూడులక్షల లడ్డూలను సిద్ధం చేసి, క్యూ లైన్లలోనే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తాం. శ్రీరామ నవమి ఆహ్వాన పత్రికలతో గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు వెళ్తున్నాం. కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాల ఆహ్వాన పత్రాలు గవర్నకు అందజేస్తాం. మరికొంతమంది ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రాలు ఇస్తాం. కల్యాణ మహోత్సవానికి గవర్నర్ వచ్చే అవకాశముంది. ఈ నెల 20వ తేదీ నుంచే వీఐపీ; 500, 200, 100 రూపాయల టిక్కెట్లను బ్యాంకర్ల ద్వారా అందుబాటులో ఉంచుతాం. ఉభయ దాతల టిక్కెట్ల విక్రయాన్ని ఇప్పటికే ప్రారంభించాం. మిగతా టిక్కెట్లను ముందుగానే అమ్ముతాం. గతేడాది టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.70లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.కోటి వచ్చేలా టిక్కెట్ల అమ్మకాలకు సన్నాహాలు చేస్తున్నాం. 2015 ఆగస్టులో జరిగే పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కోసం మూడు కాటేజీలు, వివిధ ప్రదేశాలలో 250 గదులు, 100 డార్మెటరీ లాకర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఐదుకోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ప్రతిపాదించిన గదులను తానీషా మండపం వద్దనున్న 2.6 ఎకరం స్థలంలో నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై మూడు కాటేజీల నిర్మాణం ప్రారంభమైంది. అభయాంజనేయ స్వామి ఆలయం పక్కనున్న 90 సెంట్ల దేవస్థానం స్థలంలో భక్తుల కోసం 100 లాకర్లతో డార్మెటరీ హాల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.