Naveen Jaihind
-
విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్...భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్(39) నుంచి ఆమె చట్టబద్దంగా విడిపోయారు. స్వాతి మలివాల్ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె.. దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ఘజియాబాద్ లో పుట్టిపెరిగిన స్వాతి, ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్ఎస్ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె భాగం పంచుకున్నారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు నవీన్ జైహింద్ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. కొంతకాలం కలిసుండి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్ కన్వీనర్ కాగా, ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో స్వాతికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. చిచ్చుపెట్టిన మీటూ.. చిన్న వయసులోనే డీసీఎం చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన స్వాతి మలివాల్.. మహిళల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా పాటుపడ్డారు. చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో ఆమె కృషి కూడా ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇటీవలే నిరాహార దీక్ష కూడా చేపట్టారామె. కాగా, మీటూ ఉద్యమం సమయంలో స్వాతి భర్త నవీన్.. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి క్రమంగా దూరమైన జంట.. బుధవారం నాటికి విడాకులు తీసుకుంది. -
ఆప్‌కు మరో దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో కలహాలు మరింత తీవ్రమయ్యాయి. పార్టీ నేత యోగేంద్ర యాదవ్ పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేశారు. హర్యానాలో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వ హిస్తూ ఆయన అన్ని పదవులను త్యజించారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా విభాగం అధ్యక్షుడు నవీన్ జై హింద్ కూడా తన పదవితోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వాన్ని వదులుకున్నారు. హర్యానా నుంచి పోటీచేసిన ఆప్ అభ్యర్థులలో యోగేంద్ర యాదవ్, నవీన్ జైహింద్ ప్రముఖులు. యోగేంద్ర యాదవ్ గుర్గావ్ నుంచి, జైహింద్ రోహతక్ నుంచి పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఓటమి అనంతరం యోగేంద్ర యాదవ్, నవీన్ జైహి ంద్ల మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. హర్యానాలో పార్టీ ఓటమికి యోగేంద్ర యాదవ్ కారణమంటూ నవీన్ ఆరోపించారు. యోగేంద్ర కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని మరోవైపు జైహింద్ ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన యోగేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సభ్యత్వానికి, హర్యానా ఆప్ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, నవీన్ జైహింద్ రాజీనామాలపై జూన్ ఆరున నిర్ణయం తీసుకోనున్నట్లు ఆప్ ప్రకటించింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కి ఆదరణ పెరిగింది. దీంతో హర్యానా రాజకీయాలపై పా ర్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహ ంలో హర్యానా ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆప్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో హర్యానాలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీచేసింది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి అధికారాన్ని చేజిక్కించకోవాలనుకుంది. కానీ అంచనాలు తారుమారయ్యాయి. .లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనను కూడా పార్టీ విరమించుకున్న సంగతి విదితమే.