సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో కలహాలు మరింత తీవ్రమయ్యాయి. పార్టీ నేత యోగేంద్ర యాదవ్ పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేశారు. హర్యానాలో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వ హిస్తూ ఆయన అన్ని పదవులను త్యజించారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా విభాగం అధ్యక్షుడు నవీన్ జై హింద్ కూడా తన పదవితోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యత్వాన్ని వదులుకున్నారు. హర్యానా నుంచి పోటీచేసిన ఆప్ అభ్యర్థులలో యోగేంద్ర యాదవ్, నవీన్ జైహింద్ ప్రముఖులు. యోగేంద్ర యాదవ్ గుర్గావ్ నుంచి, జైహింద్ రోహతక్ నుంచి పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు.
ఓటమి అనంతరం యోగేంద్ర యాదవ్, నవీన్ జైహి ంద్‌ల మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. హర్యానాలో పార్టీ ఓటమికి యోగేంద్ర యాదవ్ కారణమంటూ నవీన్ ఆరోపించారు. యోగేంద్ర కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని మరోవైపు జైహింద్ ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన యోగేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సభ్యత్వానికి, హర్యానా ఆప్ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, నవీన్ జైహింద్ రాజీనామాలపై జూన్ ఆరున నిర్ణయం తీసుకోనున్నట్లు ఆప్ ప్రకటించింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కి ఆదరణ పెరిగింది. దీంతో హర్యానా రాజకీయాలపై పా ర్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
పార్టీ రాజకీయ వ్యూహ ంలో హర్యానా ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆప్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో హర్యానాలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీచేసింది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి అధికారాన్ని చేజిక్కించకోవాలనుకుంది. కానీ అంచనాలు తారుమారయ్యాయి. .లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనను కూడా పార్టీ విరమించుకున్న సంగతి విదితమే.
ఆప్‌కు మరో దెబ్బ
Published Sat, May 31 2014 11:02 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement