Naveen Vijaya Krishna
-
మా అమ్మ, నానమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు: నరేశ్ తనయుడు
మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించిన లఘు చిత్రం సత్య. ఈ చిత్రానికి సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ దర్శకత్వం వహించాడు. మంగళవారం ఈ సినిమా నుంచి సోల్ ఆఫ్ సత్య అనే పాట విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. 'మూడు సంవత్సరాల క్రితం.. ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ సంవత్సరం జీవితంలో చాలా కోల్పోయాను. అక్కడి నుంచి మళ్లీ ఇక్కడివరకు వచ్చాను. నేను మీ అందరి కామెంట్లు చదివాను. ఇంత లావయ్యి మీ ముందుకు తిరిగి వచ్చాను. జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. నానమ్మ విజయనిర్మల, అమ్మ నేత్ర.. వీళ్లిద్దరూ నేనెప్పుడూ మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. కానీ వాళ్లు బతికుండగా అది నెరవేర్చలేకపోయాను. అందుకే వెనక్కు వెళ్లకుండా మళ్లీ తిరిగి వచ్చాను. సత్య సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నాను. నాకు మా నానమ్మే ఇన్స్పిరేషన్. తను యాక్టింగ్, డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ చూసుకునేది. తను సినిమాలు చేసేటప్పుడు నేను సెట్స్‌లో ఉండేవాడిని. అవన్నీ చూసి నాకు డైరెక్టర్ అవ్వాలనిపించేది. కానీ తనకు మాత్రం నేను నటుడినవ్వాలని కోరుకుంది. అందుకే తనకోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు డైరెక్టర్‌గా మారాను. సత్య సినిమా విషయానికి వస్తే జీవితంలో అందరికీ కష్టాలుంటాయి. మా అమ్మ, నానమ్మ కూడా ఎన్నో కష్టాలు పడ్డవారే! వాళ్లు ఫైటర్స్! వీరిద్దరూ నాకెప్పటికీ ఆదర్శం' అని చెప్పుకొచ్చాడు నవీన్ విజయకృష్ణ. చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే? -
‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’
‘‘నేను చేసే పాత్ర నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తే చాలు. సినిమా ఒప్పుకుంటాను. పారితోషికం గురించి పెద్దగా ఆలోచించను. పదేళ్ల తర్వాత ఆ నిర్మాత అంత ఇచ్చాడు.. ఈ నిర్మాత ఇంత ఇచ్చాడు అని లెక్కలు వేసుకోను. అలా లెక్కలేసుకుని పదివేలు తక్కువయ్యాయని ‘అష్టా చమ్మా’ సినిమాను వదులుకుని ఉంటే నాకు జీవితమే ఉండేది కాదు. నేను కొన్ని సినిమాలు ఉచితంగా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా చేశాను. అలాగని అన్నీ ఫ్రీగా చేయలేం. నాకూ ఖర్చులు ఉంటాయి’’ అన్నారు దర్శక,నటుడు, రచయిత శ్రీనివాస్ అవసరాల. నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. బాలాజీ సానల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఊరిని, కుటుంబాలను, సంప్రదాయ విలువలను గౌరవించాలనుకునే ప్రేమికుల కథ ఇది. నాది తమిళ వ్యక్తి పాత్ర. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ ఊరికి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరం. శ్రీనివాస్ అవసరాల ఉంటే వినోదం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం కొంతవరకు నిజమని నమ్ముతాను. కానీ నేను కూడా చెత్త సినిమాలు చేశాను. ఆడుతూపాడుతూ చేసిన ‘అష్టాచమ్మా’ పెద్ద విజయం సాధించింది. సూపర్ హిట్ సాధిస్తాయనుకున్న నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. యాక్టర్స్ అందరూ స్క్రీన్ రైటింగ్ చదువుకోవాలన్నది నా నమ్మకం. అప్పుడే కథలు వినేప్పుడు ఏయే అంశాలకు కథలు ఒప్పుకుంటున్నామో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడిగా నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా చేస్తున్నాను. నటుడిగా ‘నాయనా రారా ఇంటికి’ (ఎన్ఆర్ఐ) సినిమా చేస్తున్నాను. ఈ సినిమా సగం పూర్తయింది. అలాగే ఓ కథ రాస్తున్నా. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు’’ అన్నారు. -
ఎడిటర్‌గా 130.. హీరోగా 75!
‘‘ఎడిటర్‌గా చేసేటప్పుడు 130 కిలోల బరువుండేవాణ్ణి. హీరోగా మారాలనుకున్నాక బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. మహేశ్‌బాబు కూడా ‘బరువు తగ్గితేనే హీరో అవుతావ్’ అన్నారు. మూడేళ్లు కష్టపడి 55 కిలోలు తగ్గా. ఇప్పుడు నా బరువు 75 కిలోలు’’ అన్నారు నవీన్ విజయ కృష్ణ. సీనియర్ నరేశ్ కుమారుడీయన. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిశోర్, భిక్షమయ్య నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’తో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 21న చిత్రం రిలీజవుతోంది. నవీన్ మాట్లాడుతూ - ‘‘కృష్ణవంశీగారి ‘డేంజర్’, ‘రాఖీ’తో సహా పలు చిత్రా లకు ఎడిటింగ్, మహేశ్ చిత్రాలకు సాంగ్స్, ట్రైలర్స్ కట్ చేసేవాణ్ణి. ఈ సినిమా విషయానికొస్తే, చందు అనే దొంగ.. డాక్టర్ ఎలా అయ్యాడనేది కథ. వినోదాత్మకంగా ఉంటుంది. నేను హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. హీరోగా సింపుల్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయాలనుంది’’ అన్నారు. -
నవీన్ విజయకృష్ణ హీరోగా మూవీ లాంచ్
-
హీరోగా...నరేశ్ తనయుడి తెరంగేట్రం
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా మారారు. ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. అడ్డాల చంటి, గవర పార్థసారథి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ రగుతు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు కలిసి కెమెరా స్విచాన్ చేయగా, కృష్ణ, మహేశ్‌బాబు కలిసి క్లాప్ ఇచ్చారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. హీరో నవీన్ విజయకృష్ణ నాయనమ్మ, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ముహూర్తపు దృశ్యానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘మా కుటుంబం నుంచి నవీన్ రూపంలో మరో హీరో ఇండస్ట్రీకి రావడం ఆనందంగా ఉంది. నవీన్ మంచి ప్రతిభాశాలి. తనలో మంచి ఎడిటర్ కూడా ఉన్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడని నా నమ్మకం’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ -‘‘మా అబ్బాయి హీరోగా పరిచయం అవుతుంటే ఏదో తెలీని ఆనందం కలుగుతోంది. నా చిన్నతనంలోనే ‘పండంటికాపురం’లో బాలనటునిగా నటించాను. 17 ఏళ్ల ప్రాయంలో ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాను. మూడు దశాబ్దాల నట ప్రస్థానం నాది. ఇప్పుడు నా కుమారుడు నా వారసుడిగా రావడం గర్వంగా ఉంది. ప్రముఖ నటి మేనక కుమార్తె కీర్తి ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణవంశీ శిష్యుడు రామ్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తాడని నా నమ్మకం’’ అని చెప్పారు. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మహతిసాగర్, కూర్పు: త్యాగరాజన్.