Naresh Son Naveen Vijay Krishna Emotional Comments At The Soul Of Satya Song Launch Press Meet - Sakshi
Sakshi News home page

Naveen Vijaya Krishna: మీ కామెంట్లు చదివా.. లావయ్యి తిరిగి వచ్చాను..

Published Wed, Aug 16 2023 3:15 PM | Last Updated on Wed, Aug 16 2023 5:06 PM

Naresh Son Naveen Vijay Krishna Emotional Comments - Sakshi

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జంటగా నటించిన లఘు చిత్రం సత్య. ఈ చిత్రానికి సీనియర్‌ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయకృష్ణ దర్శకత్వం వహించాడు. మంగళవారం ఈ సినిమా నుంచి సోల్‌ ఆఫ్‌ సత్య అనే పాట విడుదల చేశారు. ఈ సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమంలో నవీన్‌ విజయకృష్ణ మాట్లాడుతూ.. 'మూడు సంవత్సరాల క్రితం.. ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్‌లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ సంవత్సరం జీవితంలో చాలా కోల్పోయాను. అక్కడి నుంచి మళ్లీ ఇక్కడివరకు వచ్చాను.

నేను మీ అందరి కామెంట్లు చదివాను. ఇంత లావయ్యి మీ ముందుకు తిరిగి వచ్చాను. జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం.  నానమ్మ విజయనిర్మల, అమ్మ నేత్ర.. వీళ్లిద్దరూ నేనెప్పుడూ మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. కానీ వాళ్లు బతికుండగా అది నెరవేర్చలేకపోయాను. అందుకే వెనక్కు వెళ్లకుండా మళ్లీ తిరిగి వచ్చాను. సత్య సినిమాతో కమ్‌బ్యాక్‌ ఇస్తున్నాను.

నాకు మా నానమ్మే ఇన్‌స్పిరేషన్‌. తను యాక్టింగ్‌, డైరెక్షన్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ చూసుకునేది. తను సినిమాలు చేసేటప్పుడు నేను సెట్స్‌లో ఉండేవాడిని. అవన్నీ చూసి నాకు డైరెక్టర్‌ అవ్వాలనిపించేది. కానీ తనకు మాత్రం నేను నటుడినవ్వాలని కోరుకుంది. అందుకే తనకోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు డైరెక్టర్‌గా మారాను. సత్య సినిమా విషయానికి వస్తే జీవితంలో అందరికీ కష్టాలుంటాయి. మా అమ్మ, నానమ్మ కూడా ఎన్నో కష్టాలు పడ్డవారే! వాళ్లు ఫైటర్స్‌! వీరిద్దరూ నాకెప్పటికీ ఆదర్శం' అని చెప్పుకొచ్చాడు నవీన్‌ విజయకృష్ణ.

చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement