nayana pujari
-
టెక్కీ హత్యకేసులో దోషులకు మరణశిక్ష
పుణె: ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయనా పూజారి(28) అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు దోషులకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. దోషులు యోగేశ్ రౌత్, మహేశ్ ఠాకూర్, విశ్వాస్ కదమ్‌లకు మరణ శిక్ష విధించగా, అప్రూవర్‌గా మారిన మరో దోషి రాజేశ్ పాండురంగ్ చౌదరిని విడిచిపెట్టింది. ఖరాడి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నయనా అక్టోబర్ 7, 2009లో పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా కిడ్నాప్ చేశారు. రెండు రోజుల అనంతరం ఆమె మృతదేహాన్ని జరేవాడీ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోషుల మీద మోపిన కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్య, చోరీ, ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలు నిరూపితమయ్యాయి. ఈ కేసులో ప్రధాన దోషిగా ఉన్న యోగేశ్ 2011 సెప్టెంబర్ 11న పోలీసుల కనుగప్పి పరారవ్వగా, 20నెలల అనంతరం అతన్ని షిర్డీలో అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో యోగేశ్ కొన్ని నెలల ముందు మరో మహిళను అత్యాచారం చేశాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అత్యాచారం.. హత్య: ముగ్గురికి మరణశిక్ష
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చిన కేసులో ముగ్గురు దోషులకు పుణె శివాజీనగర్ కోర్టు మరణశిక్ష విధించింది. నయనా పూజారి (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులేనని స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ సోమవారమే తేల్చారు. మంగళవారం నాడు వారు ముగ్గురికీ ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, ఒకే రకమైన ఉద్దేశంతో నేరపూరిత కుట్రకు పాల్పడి ఆస్తులు దుర్వినియోగం చేయడం లాంటి నేరాలు నిరూపితమయ్యాయి. హత్య చేయాలన్న ఉద్దేశంతో అపహరించడం, దోపిడీ చేసే సమయంలో గాయపర్చడం, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం అనే ఆరోపణలు మాత్రం ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యం చూపించకపోవడంతో నిరూపితం కాలేదు. ఖరాడి ప్రాంతంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసే నయనా పూజారి 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి రావడానికి వేచి చూస్తుండగా కిడ్నాప్ అయింది. రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖేడ్ తహసీల్‌లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బయటపడింది. బాధితురాలిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక కారులో ఆమెపై అత్యాచారం చేశారని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. ఆమె వద్ద ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు దొంగిలించారని, తర్వాత పీక పిసికి చంపేసి అడవిలో పారేశారని అన్నారు. నయనా పూజారి ఘటన తర్వాతే ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేసే మహిళలకు భద్రత కరువైన అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
టెకీ రేప్-హత్య కేసులో ఆ ముగ్గురూ దోషులే
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా తేల్చింది. నయనా పూజారి (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులేనని స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ తేల్చారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. దాంతో ముగ్గురు దోషులకు ఏ శిక్ష విధించాలన్న విషయమై వాదనలను కోర్టు మంగళవారం వింటుంది. ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, ఒకే రకమైన ఉద్దేశంతో నేరపూరిత కుట్రకు పాల్పడి ఆస్తులు దుర్వినియోగం చేయడం లాంటి నేరాలు నిరూపితమయ్యాయి. హత్య చేయాలన్న ఉద్దేశంతో అపహరించడం, దోపిడీ చేసే సమయంలో గాయపర్చడం, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం అనే ఆరోపణలు మాత్రం ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యం చూపించకపోవడంతో నిరూపితం కాలేదు. ఖరాడి ప్రాంతంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసే నయనా పూజారి 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి రావడానికి వేచి చూస్తుండగా కిడ్నాప్ అయింది. రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖేడ్ తహసీల్‌లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బయటపడింది. బాధితురాలిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక కారులో ఆమెపై అత్యాచారం చేశారని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. ఆమె వద్ద ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు దొంగిలించారని, తర్వాత పీక పిసికి చంపేసి అడవిలో పారేశారని అన్నారు. ఈ కేసులో దోషులు ముగ్గురితో పాటు ఉన్న మరో నిందితుడు రాజేష్ చౌదరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. ఇది అత్యంత అరుదైన కేసు కాబట్టి ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించాలనే అడుగుతామని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది హర్షద్ నింబాల్కర్ తెలిపారు. నయనా పూజారి ఘటన తర్వాతే ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేసే మహిళలకు భద్రత కరువైన అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.