NDA MPs
-
వేతనం వదులుకోనున్న ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. -
బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోంది: మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరి అత్యవసర రోజులను తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న నిరాశతో ఒక కుటుంబాన్నే ఆ పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక కుటుంబాన్ని కాపాడాలనుకుంటోందని, బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోందని అన్నారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. -
ఎన్డీఏ ఎంపీల పాదయాత్ర!
-
'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'
న్యూఢిల్లీ: రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు తెలిసింది. ఎన్డీఏ ఎంపీలకు ఆదివారం సాయంత్రం మోదీ తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలకు ప్రభుత్వ పథకాలపై ప్రధాని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోలియో నిర్మూలించగలిగాం, స్వచ్ఛ భారత్ ను సాధించగలం అంటూ ఎంపీలను మోదీ ఉత్సాహరిచారు. నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలను సందర్శించి పరిశుభ్రత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలన్నారు. పేదల సంక్షేమానికి సంబంధించి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించినట్టు తెలుస్తోంది. -
ఈ నెల 26న ఎన్డీయే ఎంపీలకు మోడీ టీ పార్టీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఎన్డీయే ఎంపీలకు టీ పార్టీ ఇవ్వనున్నారు. ఈ నెల 26న మోడీ ఎంపీలతో సమావేశంకానున్నారు. ఈ టీ పార్టీకి శివసేన ఎంపీలు కూడా హాజరవుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు వికంటించడం, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీలు మోడీ పార్టీకి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.