
'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'
న్యూఢిల్లీ: రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు తెలిసింది. ఎన్డీఏ ఎంపీలకు ఆదివారం సాయంత్రం మోదీ తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలకు ప్రభుత్వ పథకాలపై ప్రధాని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
పోలియో నిర్మూలించగలిగాం, స్వచ్ఛ భారత్ ను సాధించగలం అంటూ ఎంపీలను మోదీ ఉత్సాహరిచారు. నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలను సందర్శించి పరిశుభ్రత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలన్నారు. పేదల సంక్షేమానికి సంబంధించి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించినట్టు తెలుస్తోంది.