
ఈ నెల 26న ఎన్డీయే ఎంపీలకు మోడీ టీ పార్టీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఎన్డీయే ఎంపీలకు టీ పార్టీ ఇవ్వనున్నారు. ఈ నెల 26న మోడీ ఎంపీలతో సమావేశంకానున్నారు. ఈ టీ పార్టీకి శివసేన ఎంపీలు కూడా హాజరవుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు వికంటించడం, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీలు మోడీ పార్టీకి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.