మై భీ చౌకీదార్ (నేను కూడా కాపలాదారుడినే) అనే నినాదం ముద్రించి ఉన్న టీ కప్పుల్ని రైళ్లలో వాడటంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. శతాబ్ది రైళ్లలో చౌకీదార్ కప్పుల్లో టీ సరఫరా చేస్తున్నారని సోషల్ మీడియాలో ఫొటోలు సర్క్యులేట్ కావడంతో ఈసీ స్పందించింది. ఆ కప్పుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలంటూ రైల్వే శాఖకు ఒక లేఖ రాసింది. సంకల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ టీ కప్పుల్ని తయారు చేసినట్టుగా ఈసీ పరిశీలనలో తేలింది. ఇది ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్న ఈసీ ఏప్రిల్ 4లోగా వివరణ ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించింది. దీనిపై వెంటనే స్పందించిన రైల్వే శాఖ ఆ కప్పులు తయారు చేసిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. చౌకీదార్ టీ కప్పులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలున్న టికెట్ల వినియోగాన్ని కూడా నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment