Neglect in duty
-
కొరడా ఝులిపిస్తున్న జగిత్యాల కలెక్టర్
సాక్షి, కోరుట్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముప్పై రోజుల ప్రణాళికలో నిర్లక్ష్యంపై వేటు తప్పడం లేదు. ముప్పై రోజుల ప్రణాళిక అమలులో కలెక్టర్ శరత్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వేటు వేస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రణాళిక అమలును పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో అక్కడ చేస్తున్న పనులు, గ్రామస్తుల భాగస్వామ్యం, అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నాలుగు రోజుల క్రితం మెట్పల్లి మండలం వెల్లుల కార్యదర్శిని సస్పెండ్ చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండ లంలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయడమే కాకుండా.. మరో కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా తహసీల్దార్‌ను బదిలీ చేశారు. ఈ చర్యలతో జిల్లావ్యాప్తంగా 30 రోజుల ప్రణాళిక అమలులో కలెక్టర్ శరత్ ఎంత సీరియస్ ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. పది రోజుల వ్యవధిలో ముగ్గురు కిందిస్థాయి సిబ్బంది సస్పెన్షన్‌కు గురవడంతో అధికారులు మరింత పకడ్బందీగా పనుల్లో నిమగ్నమయ్యారు. తనిఖీలు.. సమీక్షలు జిల్లావ్యాప్తంగా 30 రోజల ప్రణాళిక అమలులో లోటుపాట్లు లేకుండా కలెక్టర్ శరత్ ఎప్పటికప్పు డు అన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, అ ధికారులతో సమీక్షలు చేస్తున్నారు. గ్రామాలలో సమూల మార్పులు రావాలన్న లక్ష్యంతో 30 రోజుల ప్రణాళిక పనులు జిల్లాలోని 18 మండ లాల్లోని 380 గ్రామపంచాయతీల్లో చురుకుగా సాగుతున్నాయి. ప్రణాళిక అమలుకు 379 గ్రా మాల్లో 1,137 మంది కో–ఆప్షన్ సభ్యులు, 380 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతీ గ్రా మానికి ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ శరత్ ఇప్పటికే జిల్లాలోని సగం మండలాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక తీరుతెన్నులపై సమీక్షలు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రణాళిక అమలులో ఎక్కడెక్కడ లోపాలున్నాయనే దానిపై తనిఖీలు చేసి చ ర్యలు తీసుకుంటున్నారు. అలసత్వం వహిస్తు న్న అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పది రోజుల వ్యవధిలో 30 రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సస్పెన్షన్‌కు గురికాగా.. 8 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతోంది. ఇంటలిజెన్స్ కన్ను జిల్లాలో పది రోజులుగా సాగుతున్న 30 రోజుల ప్రణాళిక అమలు తీరు తెన్నులపై ఇంటలిజెన్స్ నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా ఇంటలిజెన్స్ అధికారులు గ్రామపంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అ మలు ఎలా ఉంది.. ఏ మేరకు అధికారులు, ప్ర జాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం ఉందన్న అంశంలో రోజువారీ ప్రగతి నివేదికలను ఉన్న తాధికారులకు అందిస్తున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయన్న విషయంలో ఇంటలిజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నివేదికలు జిల్లా ఉన్నతాధికారులకు చేరుతుండగా వీటి ఆధారంగా జిల్లాలో 30 రోజుల ప్రణాళిక అమలులో వెనకబడ్డ మండలాలపై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. మిగిలిన పది రోజుల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో ఉన్నతాధికారులు మరింత నిక్కచ్చిగా వ్యవహరించే అవకాశాలున్నాయడంలో సందేహం లేదు. -
బాలిక మిస్సింగ్ కేసు విచారణపై అసంతృప్తి
ఏలూరు టౌన్ : చింతలపూడిలోని సంక్షేమ వసతి గృహం విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు పది రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. తన కుమార్తె కనిపించటం లేదని బాలిక తండ్రి హస్టల్ వార్డెన్‌తో కలిసి ఫిర్యాదు చేసినా చింతలపూడి ఎస్సై పట్టించుకోలేదనే ఆరో పణలు ఉన్నాయి. దీంతో ఈ నెల 27న ఏలూరు రేంజ్ డీఐజీ టి.రవికుమార్‌మూర్తికి బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలిక అత్యాచార ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీని ఎస్పీ ఆదేశించారు. ఏలూరు పవర్‌పేటలో బాలిక ను నిర్బంధించిన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ చేశారు. చింతలపూడి ఎస్సై నిర్లక్ష్యం కారణంగానే బాలిక అత్యాచారానికి గురైందనీ, వెంటనే ఆరా తీసుంటే ఇంత ఘోరం జరిగేది కాదని బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సైపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కలెక్టర్ కాటంనేని భాస్కర్ చింతలపూడి హాస్టల్ వార్డెన్లు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఏం జరిగింది! దుగ్గిరాల గ్రామానికి చెందిన దంపతులకు ఇద రు కుమార్తెలు సంతానం. ఆ దంపతుల మధ్య విభేదాలు రావటంతో దూరంగా ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలనూ చింతలపూడిలోని సంక్షేమ వసతి గృహంలో చేర్పించారు. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా, అక్కడే ఆమె చెల్లి కూడా ఉంటూ చదువుతోంది. ఇంటికి వచ్చిన బాలికను ఈనెల 16 ఉదయం చింతలపూడి హాస్టల్లో తల్లి దించి వెళ్లింది. అదే రోజు హాస్టల్లో అల్పాహారం తీసుకున్న బాలిక హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. చింతలపూడి నుంచి ఏలూరు వచ్చేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన కిరణ్ ఆమెను చింతలపూడి ఐటీఐ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 17న ఉదయం బాలిక తండ్రికి ఫోన్ చేసి మీ కుమార్తె చింతలపూడి బస్టాండ్‌లో ఉందనీ, ఒంటరిగా ఉండడంతో తన ఇంటికి తీసుకువచ్చాననీ చెప్పాడు. అనంతరం ఏలూరు పాతబస్టాండ్ వద్దకు బాలికను తీసుకెళ్లిన కిరణ్ అతని బంధువు చిట్టిబాబును అక్కడకు రప్పించాడు. ఇద్దరూ కలిసి పవర్‌పేటలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను నిర్బంధించారు. కిరణ్ మాట్లాడిన మాటలపై అనుమానంగా వచ్చిన బాలిక తండ్రి చింతలపూడి వెళ్లి హాస్టల్ వార్డెన్‌తో కలిసి చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఎస్సై ఈ ఫిర్యాదును పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచీ బాలిక తండ్రి, బంధువులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి ఈనెల 26న బంధువులే బాలికను నిర్బంధించిన ఇంటిని తెలుసుకుని ఏలూరు టూటౌన్ పోలీసుల సహాయంతో వారినుంచి రక్షించారు. అనంతరం బాలికను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేస్తే 23 వరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం కూడా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఏమాత్రం ప్రయత్నం చేయకపోవటంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. బాలికపై అత్యాచారం, ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్యంపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ చేసి నివేదిక సమర్పించిన అనంతరం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
అధికారులు పనితీరు మార్చుకోవాలి
♦ అధికారులపై ఎంపీ ఆగ్రహం ♦ సమావేశ నిర్ణయాలపై పర్యవేక్షణ తప్పనిసరి ♦ జిల్లాలో 33,396 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి ♦ సకాలంలో పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు ♦ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మంసిటీ : జిల్లాలో పలు శాఖల అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని,ఇప్పటికైనా వారి పనుతీరును మార్చుకోవాలని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలుపై శనివారం ఖమ్మంలోని టీటీడీసీ భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్ణయాలపై పర్యవేక్షణ చేయాలి.. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పర్యవేక్షణ లేనప్పుడు సమావేశాలు,సమీక్షలు జరపడం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తూ వాటిపై తప్పనిసరిగా మానిటరింగ్ చేస్తూ నాలుగు రోజుల్లోపు వాటిపై తీసుకున్న చర్యల గురించి కమిటీలోని సభ్యులందరికి వివరాలు అందించాలని ఆదేశించారు.అనంతరం ఎంపీ ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, స్వచ్ఛ భారత్,గిరిజన సంక్షేమ పథకాలు, జాతీయ ల్యాండ్ రికార్డుల అభివృద్ధి పథకాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సమావేశానికి హాజరుకాని విద్యుత్ ఎస్ఈ ధన్‌సింగ్‌పై ఎంపీ ఆసహనం వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ యాక్షన్ టేకెన్ రిపోర్టును సరిగా రికార్డు చేయడంలేదని,విద్యుత్ శాఖ జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్‌గా ఉన్నా దానికి సంబంధించిన సమావేశం నిర్వహించకున్న కూడా మినిట్స్ బుక్‌లో మాత్రం సమీక్ష జరిగినట్లునివేదిక ఇవ్వడం సబబుకాదన్నారు. వివిధ పనుల ప్రగతిపై అధికారుల వివరణ.. జిల్లాలో కనెక్టివిటీ రోడ్లు, బ్రిడ్జిల పనులు ఎంతవరకు వచ్చాయని ఎంపీ పంచాయతీరాజ్ ఎస్ఈ రవీందర్‌ను ప్రశ్నించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 171 పనులు మంజూరు కాగా అందులో 165 రోడ్డు పనులు పూర్తయినట్లు, మరో రెండు రోడ్లు నిర్మాణదశలో ఉన్నాయని, 11 చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో 9 పూర్తి చేసినటు,్ల మరొకటి నిర్మాణ దశలోఉండగా ఇంకో బ్రిడ్జి ప్రారంభం కాలేదన్నారు. 10 గ్రామీణ లింక్ రోడ్లలో ఒకటి మాత్రమే పూర్తయిందని ఎస్ఈ చెప్పడంతో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఎంపీ ప్రశ్నించ గా.. కొన్ని చోట్ల ఏజెన్సీ చట్టం అడ్డుగా ఉండగా, మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుని ముందుకు రావడం లేదని ఎస్ఈ చెప్పడంతో టెండర్లను రద్దు చేసి కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచిస్తూ, వాటికి మళ్లీ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 33,396 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి జిల్లాలో స్వచ్ఛ భారత్‌లో మంజూరయిన మరుగుదొడ్ల నిర్మాణాలపై డ్వామా పీడీ టి.జగత్‌కుమార్‌రెడ్డి వివరణ ఇస్తూ ఈజీఎస్ ద్వారా జిల్లాలోని 41 మండలాల్లో 466 గ్రామ పంచాయతీల్లో 38,617 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామని, అందులో 33, 396 మరుగుదొడ్లు పూర్తయ్యాయని, మరో 5,210 నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు ఎందుకు రావడం లేదని ఎంపీ అడగగా గ్రామీణనీటి పనుల శాఖ ఆధ్వర్యంలో మంజూరైన మరుగుదొడ్లకు నిధులు లేనందున బిల్లులు విడుదల చేయడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరణ ఇచ్చారు. నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ వారికి సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై ఎంపీ మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ట్రైకార్ పథకాల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్న యూనిట్లకు బ్యాంక్ అధికారులు బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దీనిని సరిచేస్తూ ,టీఎస్సీ సబ్‌ప్లాన్‌లో జిల్లాకు రావాల్సిన రూ.45 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతుకు సూచించారు. సాదాబైనామాల కింద 1.47 లక్షల దరఖాస్తులు భూమి రికార్డుల వివరాలపై జేసీ దివ్య మాట్లాడుతూ జిల్లాలో సాదాబైనామాల కింద ఇప్పటి వరకు 1.47లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 22 వరకు గడువు ఉన్నందున మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలోని 910 గ్రామాల ల్యాండ్ రికార్డులకు గాను 758 గ్రామాల ల్యాండ్ రికార్డులను ఆన్లైన్ చేసినట్లు వివరించారు. మిగిలిన గ్రామపంచాయతీల రికార్డులను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే ల్యాండ్ రికార్డుల నమోదులో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జేసీ ఎంపీకి తెలపడంతో ఎంపీ జేసీని అభినందించారు. సమాచారం ఇవ్వకపోతే ఎలా..? ఎంపీ సీతారాం నాయక్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపథకాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ జిల్లా అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో ఎంపిక చేసిన ఏడు మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆ యన అధికారులను ప్రశ్నించారు. ‘అభివృద్ధి పనులు ఏ స్థాయి లో ఉన్నాయనే కనీస సమాచారం ఇవ్వవద్దని, ప్రజా ప్రతినిధులకు ఏమీ చెప్పవద్దంటూ అధికారులకు ఎవరైనా కాగితాలు ఇచ్చారా..? ఉంటే వాటినైనా చూపించండి’ అని అడిగారు. స మావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, పంచాయతీరాజ్ ఎస్ఈ రవీందర్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ మురళీధరరావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రాందాస్, జెడ్పీ సీఈఓ నగేష్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, నామినేటెడ్ సభ్యులు భీమా శ్రీధర్, కొంగర జ్యోతిర్మయి, మట్టా దయానంద్, పలు మండలాల ఎంపీపీలు పాల్గొన్నారు.