Nehru family history
-
PRANAB, MY FATHER: రాహల్‌కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
నెహ్రూ కుటుంబ చరిత్రను చెరిపేందుకు కుట్ర
యూత్‌కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అమరేందర్‌సింగ్ సాక్షి, హైదరాబాద్: నెహ్రూ, గాంధీ కుటుంబ చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతోందని అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్‌సింగ్ రాజబ్రార్ ఆరోపించారు. అయితే, ఈ కుట్రలో బీజేపీకి భంగపాటు తప్పదని అన్నారు. శుక్రవారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘మనలో రాజీవ్’ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు ముందుకు రావాలని ప్రధానమంత్రి పదే పదే చెప్తున్నారని, అయితే భార్యను గౌరవించని వ్యక్తి ఇతర మహిళలను ఎలా గౌరవిస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని అనడం సిగ్గుచేటని, కాంగ్రెస్‌నుంచే కేసీఆర్ ఇంత ఎత్తుకు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి యువజన కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి సేవ చేయటానికే రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు. పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సీఎల్పి నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ ఈ దేశానికి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అప్రజాస్వామికమైన పాలన తెలంగాణలో కొనసాగుతోందని విమర్శించారు. సదస్సులో మాజీ మంత్రి డీకే అరుణ, రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.