నేపాల్ ఎన్నిక ల్లో 70 శాతం పోలింగ్
కఠ్మాండు: నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీ చారిత్రక ఎన్నికలు మంగళవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 70 శాతం పోలింగ్ నమోదైంది. నేపాల్ మావోయిస్టు పార్టీ(యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు)నేతృత్వంలోని కూట మి ఎన్నికలను బహిష్కరించినప్పటికీ భారీ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2008 ఎన్నికల్లో 61.7 శాతం పోలింగ్ నమోదైంది. రాజకీయ సంక్షోభానికి తెరదించి, కొత్త రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్నికలు నిర్వహించారు.