Nestle Coffee
-
మంచి కాఫీలాంటి స్టోరీ.. కాఫీ తాగని దేశం..కాఫీ లవర్‌గా మారిందెలా?
ఉదయం నిద్ర లేవగానే మనలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కొందరు టీ రుచిని ఆస్వాదిస్తే ఇంకొందరు కాఫీ ఘుమఘుమలను ఇష్టపడతారు. అయితే వేల సంవత్సరాలుగా టీని అభిమానించి.. దాన్నే తాగడానికి అలవాటుపడిన ఓ దేశాన్ని ఒక కంపెనీ కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే కాఫీ లవర్స్‌లా మార్చేసింది. అదెలా సాధ్యమైంది.. ఆ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా మరి. టీని ప్రేమించే దేశం... ప్రముఖ బహుళజాతి కంపెనీ నెస్లే గురించి తెలుసుగా... స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ సంస్థ ఆహార, పానియాల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రత్యేకించి ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తుల తయారీలో దిగ్గజం. కానీ ఈ సంస్థ 1970లలో జపాన్‌లో తమ ఇన్స్టంట్ కాఫీని విక్రయించేందుకు పడరాని పాట్లు పడింది. ఒక్క కప్పు కాఫీ కూడా అమ్మలేక చతికిలపడింది. ఇందుకు కారణం.. జపాన్ వేల సంవత్సరాలుగా టీని ఇష్టపడే దేశం కావడమే. ఇలాంటి మార్కెట్లో నెస్లే అడుగు ఎలా పెట్టింది? అక్కడి సంస్కృతిని అర్థం చేసుకొని.. ఇందుకోసం నెస్లే గట్టి కసరత్తే చేసింది. సంస్కృతిలో భాగంగా కొన్ని వస్తువులతో ప్రజలు ఏర్పరుచుకొనే ప్రత్యేక అనుబంధంపై పరిశోధనలు చేయడంలో పేరుగాంచిన సైకోఅనలిస్ట్, ఫ్రాన్స్ జాతీయుడైన క్లోయ్‌టెర్ రాపిల్లేను తన మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. జపాన్‌పై అధ్యయనం చేపట్టిన క్లోయ్‌టెర్... నెస్లే కాఫీ రుచులను ముందుగా జపాన్ పిల్లలకు అలవాటు చేయడానికి ఓ వ్యూహం సూచించాడు. క్లోయ్‌టెర్ చెప్పిందే తడవుగా మొదటి దశలో భాగంగా నెస్లే జపాన్ మార్కెట్‌ను కాఫీ రుచితో కూడిన స్వీట్లు, చాక్లెట్లతో ముంచెత్తింది. పిల్లలకు ఇవి తెగ నచ్చాయి. నెమ్మదిగా జపాన్‌కు కాఫీ రుచి తెలిసొచ్చింది. చదవండి👉అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ మాట కలిపిన ఇంజనీరింగ్ యువతి నేటి పిల్లలే రేపటి వినియోగదారులు కాఫీ రుచి కలిగిన క్యాండీలు ప్రవేశపెట్టిన పదేళ్ల తర్వాత నెస్లే కొత్త రకం కాఫీ ఉత్పత్తులతో తిరిగి ఆ దేశంలో అడుగుపెట్టింది. అప్పటికి నెస్లే ‘క్యాండీ వినియోగదారుల్లో’ చాలా మంది పెద్దవాళ్లయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు.. దీంతో వారంతా ఈ కాఫీ ఉత్పత్తులను తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నెస్లే తెచ్చిన ఇన్స్టంట్ కాఫీ అనతికాలంలోనే మార్కెట్‌ను హస్తగతం చేసుకుంది. తర్వాత 2012లో నెస్లే సంస్థ వివిధ ఆఫీసులకు నెస్కెఫే తయారీ మెషీన్లను సరఫరా చేయడంతోపాటు తమ సహచరులకు కాఫీ తయారు చేసి ఇవ్వగల ‘నెస్కెఫే అంబాసిడర్’లను నియమించింది. పని ప్రదేశాల్లో రుచికరమైన కాఫీ లభించేందుకు ఈ ప్రచారం దోహదపడింది. అలాగే ప్రజలు సామాజికంగా దగ్గరై సరదాగా గడిపేలా చేసింది. కాఫీ మెషీన్లు విక్రయించేందుకు, కాఫీ కాచి వినియోగదారులకు అందించేందుకు నెస్లే 2014లో హ్యూమనాయిడ్ రోబో ‘పెప్పర్’ను రంగంలోకి దించింది. జపాన్ రాజధాని టోక్యోలో నెస్లే 2019లో ప్రత్యేకంగా ఒక స్లీప్ కేఫ్‌ను తెరిచింది. ఈ కేఫ్‌కు వచ్చే వారు మెత్తటి పరుపులపై చిన్నపాటి కునుకుతీసి కాఫీ తాగేలా ఏర్పాట్లు చేసింది. టీ టు కాఫీ ఫైనల్‌గా ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు కనీసం కాఫీని తాగడానికి ఇష్టపడని జపాన్.. 2020 నాటికి ప్రపంచంలోకెల్లా 7వ అతిపెద్ద కాఫీ దిగుమతిదారుగా తయారైంది. ఈ దేశం ఏటా జపాన్ 43 లక్షల టన్నుల కాఫీని వినియోగిస్తోంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మ్యాగీ లవర్స్‌కు భారీ షాక్!
రెండు నిమిషాల్లోనే రెడీ. అంటూ మ్యాగీ నూడిల్స్‌తో మధ్యతరగతి జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది నెస్లే ఇండియా లిమిటెడ్. ఇప్పుడీ ఈ మ్యాగీ పెరుగుతున్న ధరలతో మసాలా దట్టించకముందే నషాళాలనికి అంటుతుంది. ఈ ఏడాది మార్చిలో నెస్లే సంస్థ మ్యాగీ నూడిల్స్ ధరల్ని పెంచింది. ఇప్పుడు మరోసారి ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. మ్యాగీ ఈ పేరు తెలియని పిల్లలుండరు. రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్‌ను వండి వార్చితే. లొట్టలేసుకొని లాగించేస్తుంటారు పిల్లలు. బ్రేక్ ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఎప్పుడైనా సరే మ్యాగీ ఉంటే చాలు. పిల్లలే కాదు..పెద్దలు సైతం మసాలా నూడిల్స్‌ను ఇష్టంగా తింటుంటారు. అలాంటి నూడిల్స్..పెరుగుతున్న ధరల కారణంగా తినేందుకు మరింత భారంగా మారనున్నాయి. నెస్లే సంస్థ మార్చిలో మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచింది. ఇప్పుడు ఆ ధరల్ని మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మ్యాగీతో పాటు నెస్లే తయారు చేస్తున్న కిట్ కాట్, నెస్కెఫే కాఫీ ధరలు పెరగనున్నట్లు నెస్లే సీఈఓ ష్నీడర్ చెప్పారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. మ్యాగీ ధరలు పెరగడానికి కారణం ఇదే ముడి సరుకు,ఫ్యూయల్, ట్రాన్స్ పోర్ట్, వర్క్‌ర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరిగడం వల్లే వరుసగా మ్యాగీ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నెస్లే సీఈఓ ష్నీడర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెస్లే..ఉత్పత్తిని పెంచడం,అంతర్గతంగా అమ్మకాల వృద్ధిని' చూసింది. పెరుగుతున్న ఇతర (పైన పేర్కొన్నట్లు) ఖర్చుల కారణంగా ఉత్పత్తుల ధరల్ని పెంచడం అనివార్యమైంది. ఇక ఈ సంవత్సరం అమ్మకాలు,లాభాల లక్ష్యాలను చేరుకోగలదని నెస్లే స్పష్టం చేసింది. చదవండి👉 పిడుగులాంటి వార్త..సామాన్యులకు షాక్.. వీటి ధరలు భారీగా పెరిగాయ్! -
అరకు కాఫీపై నెస్లే ఆసక్తి
డిమాండ్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి కూడా కాఫీ గింజలు సేకరించాలని ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే యోచిస్తోంది. అలాగే ఉత్పత్తిని మెరుగుపర్చుకునే దిశగా కర్ణాటకలోని నంజన్‌గుడ్ కాఫీ ప్లాంటును రూ. 200 కోట్లతో ఆధునికీకరిస్తోంది. కాఫీ, నూడుల్స్ ప్లాంట్ల సందర్శన సందర్భంగా కంపెనీ అధికారులు వివరాలు తెలిపారు. అరకు కాఫీ గింజల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరిపామని, అయితే నాణ్యతకు సంబంధించి తిరస్కరణలపరమైన రిస్కులపై వారిలో నెలకొన్న సందేహాల కారణంగా ఫలించలేదని ప్లాంటు ఇంచార్జి నిర్మల షాపూర్కర్ పేర్కొన్నారు. అయితే పెరిగే డిమాండ్‌ను బట్టి వారు ముందుకొస్తే ఇక్కడ నుంచి కూడా సమీకరించగలమని ఆమె వివరించారు.