New deldhi
-
వాళ్లది ఆత్మహత్య కాదు.. హత్యే!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై వారి బంధువులు స్పందించారు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని, వారిని చంపేశారని మృతుల్లో ఒకరైన నారాయణ్ దేవీ భాటియా కుమార్తె సుజాత ఆరోపించారు. ‘ప్రతి రెండ్రోజులకు ఓసారి నేను మా అమ్మతో మాట్లాడేదాన్ని. అందరూ ఆనందంగా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరూ బాబాలను నమ్మరు.మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ, మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది’ అని మండిపడ్డారు. ఊపిరాడకే చనిపోయారు.. చనిపోయిన 11 మందిలో 8 మంది ఊపిరాడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టంలో తేలినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతులకు పోస్ట్‌మార్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. మోక్షం పొందేందుకే.. మోక్షం పొందేందుకు ఎలా ప్రాణత్యాగం చేయాలన్నదానిపై చేతిరాతతో ఉన్న కాగితాలు బాధితుల ఇంట్లో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు రిజిస్టర్లలో లభ్యమైన ఈ కాగితాల్లో ‘మోక్షం పొందాలంటే దీన్ని మంగళ, గురు, శనివారాల్లోనే పాటించాలి. ఆ రోజు ఇంట్లో భోజనం వండకూడదు. మిగతా కుటుంబ సభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకునేంతవరకూ ఒకరు పర్యవేక్షించాలి. వాస్తవానికి ఈ బలిదానంతో చనిపోరు. వాళ్లను దేవుడు కాపాడతాడు.’ అని ఉంది. ఈ కుటుంబం బాధ్ తపస్యా అనే విధానాన్ని ఆచరించి ఆత్మహత్య చేసుకుందని ఇంట్లో దొరికిన రిజిస్టర్లను బట్టి తేలిందన్నారు. వీరందరూ మర్రిచెట్టు ఊడల నిర్మాణం తరహాలో ఒకేచోట తాళ్లతో ఉరివేసుకున్నారని వెల్లడించారు. 2015 నుంచి ఈ కుటుంబం తాంత్రిక క్రతువుల్ని నిర్వహించినట్లు రిజిస్టర్లను బట్టి తెలుస్తోందన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఎంపీ మంద జగన్నాథంను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా మందా జగన్నాథం కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటీకే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులుగా వేణుగోపాలచారి, తేజావత్, రామచంద్రులు ఉండగా తాజాగా మందాను నియామించడంతో ప్రభుత్వ ప్రతినిధు సంఖ్య నాలుగుకు పెరిగింది. -
బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ
-
బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసిన ఇల్మీ శుక్రవారం బీజేపీలో చేరారు. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన షాజియా ఇల్మీ, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి కీలకపాత్ర పోషించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రచారం కోసం రాష్ట్ర బీజేపీ ప్రకటించిన తొమ్మిది మంది ప్రముఖుల పేర్లలో షాజియా ఇల్మి పేరు కూడా ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఈ పేర్లను ప్రకటించారు. షాజియా ఇల్మీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్ కే పురం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసి కేవలం 326 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘజియాబాద్ నుంచి మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వీకే సింగ్‌పై పోటీచేసి ఓడిపోయారు. అప్పటికే ఆమెకు ఆప్‌తో విభేదాలు మొదలయ్యాయని, అంతేకాకుండా అయిష్టంగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారని కథనలు వచ్చిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్‌పై ఆప్ మాజీనేత షాజియా పోటీ?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫిరాయింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆప్ నాయకురాలు షాజియా ఇల్మి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ టిక్కెట్టు ఇవ్వడంతో 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాజియా పోటీచేశారు. కాగా నేడు రూటు మార్చిన ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. న్యూఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. స్వయంగా కేజ్రీవాల్ మీదే పోటీకి దిగుతారని కూడా చెబుతున్నారు. ఆమె అంతకుముందు స్టార్‌న్యూస్ చానల్లో పాత్రికేయ వృత్తిలో ఉండేవారు. సామాజిక కార్యకర్తగా కూడా పేరొందారు. గత రెండు వారాల నుంచి బీజీపీలో చేరనున్న ఆరో వ్యక్తి ఆమె. న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇల్మి పేరును ప్రకటించడం చూస్తే బీజేపీకి ఇది రాజకీయంగా కలిసొచ్చే అంశం అవుతుంది.